సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల పేరుతో టీడీపీ దోపిడీ చేసిందని, ఆ ఐదేళ్లలో నీళ్లకు బదులు నిధులు పారించుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా ద్వారా నీరిచ్చేందుకు టీడీపీ రూపొందించిన అంచనా వ్యయంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు రిజర్వాయర్లు నిర్మిస్తోందని చెప్పారు. మూడు రిజర్వాయర్లు ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామని, ఆ ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం ద్వారా ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణం అనంతపురం జిల్లా రైతుల దశాబ్దాల కల అని పేర్కొన్నారు.
ఈ మూడు రిజర్వాయర్ల శంకుస్థాపనలను దేవినేని ఉమా, పరిటాల శ్రీరాంలు తప్పుపట్టడం సరికాదన్నారు. కరువు జిల్లా అనంతపురం ప్రజల కోసం మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలని దేవినేని ఉమా, పరిటాల శ్రీరాంలకు హితవు పలికారు. దమ్ము, ధైర్యం గురించి పరిటాల శ్రీరాం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం పరిటాల రవీంద్ర కల అని చెప్పటం ఏమిటని, పరిటాల మరణించిన తర్వాత 2005లో హంద్రీనీవా పనులు డాక్టర్ వైఎస్సార్ ప్రారంభించారని గుర్తు చేశారు. 2007 చివరిలో జీడిపల్లి జలాశయం నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దశలో ఈ ప్రాజెక్టు గురించి తాము ప్రతిపాదించామని, నాడు మహానేత వైఎస్సార్ దీనిని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
టీడీపీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ
Published Sat, Dec 12 2020 5:49 AM | Last Updated on Sat, Dec 12 2020 9:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment