అగ్రిగోల్డ్ నుంచి రావాల్సిన డిపాజిట్ల విషయమై బాధితులు ఒత్తిడి చేయడంతో.. ఓ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాప్తాడు (అనంతపురం): అగ్రిగోల్డ్ నుంచి రావాల్సిన డిపాజిట్ల విషయమై బాధితులు ఒత్తిడి చేయడంతో.. ఓ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదిపల్లిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధనుంజయ్ చౌక ధరల దుకాణం నిర్వహిస్తున్నాడు.
అగ్రిగోల్డ్ ఏజెంట్ కూడా అయిన అతడు గతంలో గ్రామానికి చెందిన పలువురి నుంచి సుమారు రూ.10 లక్షలను డిపాజిట్లు చేయించాడు. అవి తిరిగి రాకపోవడంతో ఆదివారం బాధితులు ధనుంజయ్‌ను నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన అతడు సోమవారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.