హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.
ఎవరీ హరిప్రియ?
హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్‌కు పరిచయమైంది.
(చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)
తెలుగులోనూ హీరోయిన్‌గా..
యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్‌కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.
కేజీఎఫ్ మూవీలో విలన్‌గా..
వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్‌ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.
అలా మొదలైన ప్రేమకథ
ఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది.
చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!
Comments
Please login to add a commentAdd a comment