Kannada Ators Vasishta Simha And Hari Priya Dating Rumours Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Haripriya And Simha: డేటింగ్‌లో హీరోయిన్ .. పెళ్లికి రెడీ అయ్యారా?

Published Tue, Nov 29 2022 6:04 PM | Last Updated on Tue, Nov 29 2022 7:17 PM

Kannada actors Vasishta Simha and Hari priya dating Goes Viral - Sakshi

కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ డేటింగ్‌లో ఉన్నారా? ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని శాండల్‌వుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి.  సింహా, హరిప్రియ డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటివరకు వీరిలో ఎవరూ ధృవీకరించలేదు.  

సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ‍వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 

కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పోస్ట్‌లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్‌' అంటూ స్పందించింది.

హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.  రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement