sandalwood hero
-
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
చిరంజీవిని గుర్తు చేసుకున్న భార్య.. ఎమోషనల్ పోస్ట్!
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు కూడా సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కాంతారతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ సప్తమిగౌడ. ఈ సినిమాలో ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కిచుకుంది. ఇటీవల శాండల్‌వుడ్‌లో యువ చిత్రంలో హీరోయిన్గా నటించింది. యువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శివరాజ్‌కుమార్ అన్నయ్య కుమారుడు యువరాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్‌కుమార్ రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. మరోవైరు ఈ ఏడాదిలోనే సప్తమి గౌడ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. -
గర్ల్ ఫ్రెండ్ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా రిషబ్ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా బర్త్ డే గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
సలార్‌తో పోటీ పడిన సూపర్ హిట్ మూవీ.. ఓటీటీకి వచ్చేస్తోంది!
కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా కర్ణాటకలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తరుణ్ సుధీర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9న నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. పెద్ద సినిమాతో పోటీ కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్‌ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే మొదట దర్శన్ బర్త్ డే సందర్భంగా ఈనెల 16న ఓటీటీకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ వారం రోజులు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అయితే ఈనెల 9న కేవలం కన్నడలోనే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వర్షన్లు మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. కాటేరా 2023లో శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.ఈ చిత్రంలో సీనియర్ కథానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాక్‌లైన్ వెంకటేష్ ఈ మూవీని నిర్మించాడు. -
అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!
శాండల్‌వుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో. కన్నడలో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. (ఇది చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది, అమర్దీప్ అయితే..:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) కన్నడలో సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాకు మౌత్ టాక్‌తో పాటు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా సప్త సాగరదాచే ఎల్లోని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని రక్షిత్ శెట్టిని అభ్యర్థించాడు. కాగా.. ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలు తెరకెక్కించారు. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది. (ఇది చదవండి: బిగ్‌బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰 Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/e4T72qJm69 — People Media Factory (@peoplemediafcy) September 15, 2023 -
హీరో భార్యకు సీమంతం.. ఏకంగా సమాధి వద్దే శుభకార్యం!
శాండల్‌వుడ్ హీరో ధృవ సర్జా కన్నడనాట పరిచయం అక్కర్లేని పేరు. 2012లో విడుదలైన 'అద్దురి' అనే సినిమా ద్వారా ఎంట్రీ వచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన ధృవ సర్జాకు కన్నడ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకి తమ్ముడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పనికి సర్వత్రా చర్చ మొదలైంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) చిరంజీవి సర్జా కోసం.. తన అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించడం విశేషం. శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ధృవ సర్జా తన సోదరుడు చిరంజీవి సర్జా మరణంతో ఆయన కుటుంబం ఇప్పటికీ బాధలో ఉంది. ధృవ సర్జా ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో చిరు జ్ఞాపకంగా ఉండేలా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకతో చిరును ప్రత్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!) కాగా.. ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు. ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్‌లో ఆడబిడ్డకు జన్మించింది. ప్రస్తుతం ఈ జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధృవ సర్జా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ధృవ సర్జా ప్రస్తుతం కేడి, మార్టిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. -
రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!
కాంతార సినిమాతో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది. కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో సాగే భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి వేడుకను జరుపుకున్నారు. తన ముద్దుల కూతురు రాధ్య, కుమారుడు రాన్వీ రాఖీలు కట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రిషబ్ శెట్టి. ఫోటోలు షేర్ చేస్తూ అన్నా, చెల్లెలికి హ్యాపీ రక్షాబంధన్.. మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. చిట్టి చిట్టి నవ్వులతో సంప్రదాయ దుస్తులతో ఉన్న రిషబ్ శెట్టి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం రక్షాబంధన్ విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఇటీవలే ప్రకటించారు. (ఇది చదవండి: ‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) -
స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్‌పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా') దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు వివాదం ఏంటి? ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్‌ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?
రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) అయితే తాజాగా రిషబ్ ట్విటర్లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ట్విటర్లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్) ನಾ ಹುಟ್ಟಿ ಬೆಳೆದ ಮನೆ ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪುಗಳ ಖಜಾನೆ. ಅದಕ್ಕೀಗ ರಾಧ್ಯಾಳ ಕಿವಿ ಚುಚ್ಚಿಸಿದ ಸಂಭ್ರಮದ ನೆನಪೊಂದು ಹೊಸದಾಗಿ ಜೊತೆ ಸೇರಿದೆ. The home where I grew up is filled with memories, and now Radhya's ear piercing ceremony added another special moment to it. pic.twitter.com/PnJDtZG4vy — Rishab Shetty (@shetty_rishab) June 25, 2023 -
ఖరీదైన కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ - వైరల్ వీడియో
Yash Land Rover Range Rover: కన్నడ సినిమా నటుడైనప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినీ నటులలో 'యష్' ఒకరు. కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన యస్ ఇటీవల ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాండల్‌వుడ్ హీరో యష్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర సుమారు రూ. 4 కోట్లు అని సమాచారం. నిజానికి భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా.. లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కారుని ఎగబడి కొంటుంటారు. (ఇదీ చదవండి: ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!) Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd — Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023 ఇప్పటికే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డి, మెర్సిడెస్ జిఎల్సి 250 డి కూపే, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 520 డి, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ వంటి కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి మరో లగ్జరీ బ్రాండ్ కారు చేరింది. సెలబ్రిటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఈ బ్రాండ్ కారుని చాలా మంది ఈ కారుని కొనుగోలు చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
సినిమా రంగంలో భారీ పెట్టుబడి.. అన్ని భాషల్లోనూ ఎంట్రీ..!
కన్నడలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో భారతీయ వినోద పరిశ్రమలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు. అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయ్ కిరగందూర్ మామట్లాడుతూ.. 'భారత్ వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీనివల్ల ఇండియాలో వినోద పరిశ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్నాం.' అని అన్నారు. -
ఆయన స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రంలో నటిస్తోంది. పుష్-పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఎదిగిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్ అందుకున్న రష్మిక మందన్నా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కమార్తో ఓ చిత్రంలో నటించారు. ఆయనతో కలిసి అంజనీపుత్ర అనే చిత్రంలో కనిపించారు. ఆ సినిమా విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పుష్ప బ్యూటీ. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. ' ఇప్పటికీ అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్‌కుమార్‌తో సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన హర్ష సార్‌కు థాంక్యూ.' అంటూ పోస్ట్ చేసింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. It’s #5YearsForAnjaniPutra already🤍 I keep thinking about the conversations with @PuneethRajkumar sir and he was more confident in me than myself always. He has the best heart, forever will be irreplaceable in my heart. Thankyou Harsha sir for this film,it means a lot to me.🌸 — Rashmika Mandanna (@iamRashmika) December 21, 2022 -
డేటింగ్లో ప్రముఖ నటి.. సోషల్ మీడియాలో వైరల్
కన్నడ నటుడు వశిష్ట సింహ, నటి హరిప్రియ డేటింగ్లో ఉన్నారా? ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతే కాదు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సింహా, హరిప్రియ డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తలను ఇప్పటివరకు వీరిలో ఎవరూ ధృవీకరించలేదు. సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో వశిష్ట సింహ, హరిప్రియ ఒక్కసారిగా మెరిశారు. తెల్లని దుస్తులతో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. పెళ్లికి సంబంధించి షాపింగ్ కోసమే దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే వశిష్ట తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తన పోస్ట్‌లో రాస్తూ.. 'మీరు ప్రతి విషయంలో ఉత్తమమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా. మీలో ఆనందం, ప్రేమ ఎప్పుడు ఉండాలి.. మీరు మీలా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. దీనికి హరిప్రియ కూడా 'థాంక్యూ పార్ట్నర్' అంటూ స్పందించింది. హరిప్రియ కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు. ఉగ్రమ్, రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో ఫేమ్ సాధించారు. మరోవైపు సింహా ఆర్య లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) -
మొన్న కేజీఎఫ్-2.. నేడు కేజీఎఫ్-1.. కాంతార దెబ్బకు రికార్డులన్నీ ఫట్
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కలెక్షన్లతో మోత మోగిస్తోంది. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. యశ్ నటించిన కేజీఎఫ్-1ను వెనక్కినెట్టింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది. (చదవండి: కాంతార తగ్గేదేలే.. ఆ విషయంలో కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్) అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కర్ణాటకలో పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో కేజీఎఫ్-2 రూ.1207 కోట్ల భారీ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. 2022లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కాంతార కూడా చేరింది. ఆ జాబితాలో కేజీఎఫ్- 2, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్1 , విక్రమ్, బ్రహ్మాస్త్ర -పార్ట్ 1, భూల్ భూలయ్యా -2 చిత్రాల తర్వాత ఏడో స్థానంలో కాంతార నిలిచింది. -
నటన మానేసి ఉద్యోగం చూసుకో.. రిషబ్ శెట్టి గురించి సంచలన విషయాలు..!
ప్రస్తుతం అందరి నోటా మార్మోగుతున్న సినిమా పేరు 'కాంతార'. కన్నడలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఆ హీరో ఎవరు? ఆయన గత చరిత్ర ఏంటి? అని సినీ ప్రేక్షకులు నెట్టింట్లో వెతుకుతున్నారు. అతని గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కసారి తెలుసుకుందాం. రిషబ్ శెట్టి నేపథ్యం: కాంతార హీరో రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్‌లో 1983 జులై 7న ఆయన జన్మించారు. హిందూ కుటుంబంలో పుట్టిన అతని తండ్రి పేరు భాస్కర్ శెట్టి. తల్లి పేరు లక్ష్మి శెట్టి. రిషబ్ ప్రవీణ్ శెట్టి అనే సోదరుడు ఉన్నాడు. రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిలిం డైరెక్షన్లో డిప్లొమా చేసిన ఆయన కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అలా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. (చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు) సినిమా అంటే ఫ్యాషన్: రిషబ్ శెట్టి పలు టీవీ సిరీస్‌ల్లోనూ పనిచేశారు. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంట్లో వాళ్లు ఈ పని మానేసి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోమని సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆయనకున్న ఫ్యాషన్‌తో సినిమా రంగంలోనే కొనసాగారు. రిషబ్ 2010లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 'నామ్ ఓరీలి ఒండినా' అనే చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేని రోల్లో నటించారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన 'తుగ్లక్'లోనూ కనిపించారు. ఇలా చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాలు నామమాత్రంగానే వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. నటన కంటే దర్శకత్వంపైనే ఆసక్తి : కానీ అదే సమయంలో రిషబ్‌కు దర్శకత్వంపై ఆసక్తి ఏర్పడింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. అలా 2017లో రక్షిత్ శెట్టి ఆయనకు ఓ అవకాశం ఇచ్చారు. రిషబ్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా 'రిక్కీ' 2016లో విడుదలైంది. ఈ మూవీలో హరిప్రియ హీరోయిన్గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. (చదవండి: త్వరలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టితో సినిమా: అల్లు అరవింద్) ఆ తర్వాత చేసిన ‘కిరిక్ పార్టీ’ మూవీ రిషబ్ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక రిషబ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రంలో కూడా రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. రష్మిక మందన్నా ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్‌గా పాపులర్ అయింది. ఆయనకు నటుడిగా ‘బెల్ బాటమ్’ మూవీ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. ఆ సినిమాకు జాతీయ అవార్డు: రిషబ్ శెట్టి తెరకెక్కించిన మూడో చిత్రం 'సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగడ్'. 2018లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో రిషబ్‌కు నేషనల్ అవార్డు వరించింది. ఈ మూవీకి నిర్మాత కూడా అతనే. అంతే కాకుండా ఫిలిం ఫేర్ అవార్డు, ఐఫా అవార్డు, సైమా అవార్డులు కూడా కైవసం చేసుకుంది. అయితే కాంతార హీరో ఓ టాలీవుడ్ సినిమాలో కూడా నటించారన్న సంగతి ఎక్కువ మందికి తెలియదు. ఈ ఏడాది తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంలో ఖలీల్ పాత్రలో నటించారు. రిషబ్‌కు 2017లో ప్రగతి శెట్టిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ప్రస్తుతం నిర్మాతగా ఒక చిత్రం, దర్శకుడిగా మరో మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించారు కూడా. -
సొసైటీపై విరక్తితో డైరెక్షన్ చేస్తున్న స్టార్ హీరో
సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు.. ఇలాంటి సినిమాలా తీసేది అనే విమర్శలు ఉపేంద్రనెప్పుడూ గాయపర్చలేదట. కానీ, ‘తేడా దర్శకుడు’ అనే మాట విన్నప్పుడల్లా కోపం నషాలానికి అంటుందట. కారణం.. వాస్తవ పరిస్థితుల్ని యథాతథంగా అలాంటి ట్యాగ్ లైన్‌ను అంటగడుతున్నారనే ఆయన ఫీలింగ్. ఉపేంద్ర సినిమాల్ని మెచ్చుకునేవాళ్లకంటే.. అందులోని ప్లాట్లైన్లను, కథనాల్ని తిట్టేవాళ్లు కూడా అదే రేంజ్లో ఉంటారు. అయినప్పటికీ ఆయనొక స్టార్ మేకర్. సెప్టెంబర్ 18న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (ఉపేంద్ర రావు) పుట్టినరోజు.. ఉడుప్పీ కొటేశ్వర గ్రామంలో 1968లో జన్మించారాయన. కన్ననాటే కాదు.. తెలుగులోనూ ఉప్పీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ►సినీ పరిశ్రమలో ఉపేంద్రలా ఆలోచించేవాళ్లు ఇంకెవరూ ఉండరు. ఉపేంద్ర ఒక్కడే గొప్పగా ఆలోచించగలడు : రజినీకాంత్ ►కన్నడ దర్శకుడు, నటుడు కాశీనాథ్.. ఉపేంద్రకి దగ్గరి బంధువు. అందుకే ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. ►కాశీనాథ్ స్టయిల్లోనే తీసిన మొదటి సినిమా ఆడకపోవడంతో.. తన స్టైల్లో ‘ష్’ తీసి మంచి దర్శకుడనే పేరు దక్కించుకున్నాడు. ►తన నిజజీవితంలో ఎదురైన.. ఎదురవుతున్న ఘటనలనే ‘పచ్చి’గా సినిమాగా చూపించడం ఉప్పీ స్టయిల్. ►సామాజిక స్పృహను తెరపై చూపించినప్పటికీ.. అందులోని బోల్డ్నెస్ వల్ల విమర్శలు ఎదురవుతుంటాయి ►ఉపేంద్ర చిన్నతనంలో కంటి సమస్య ఎదుర్కొన్నాడు. అందుకే కొన్ని సినిమాల్లో కళ్లను అటు ఇటు తిప్పుతూ ఓ స్పెషల్ సిగ్నేచర్‌ను చూపిస్తుంటారు. ‘‘నావి ఫిలసాఫికల్ సినిమాలేం కాదు. మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నమూ చేయను. ప్రతీ మనిషి తానే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. నేను దేవుడ్ని భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ, ఎదుటివారి ఆలోచనల్లోని ఒడిదుడుకులు పట్టుకోవాలనుకున్నప్పుడు, మనిషి గందరగోళంగా మారతాడు. స్వార్థంతో నిండిపోయిన ఈ సొసైటీ తీరే అంతా. అలాంటి వాళ్లపైన విరక్తితోనే డైరెక్షన్ చేస్తున్నా - ఓ ఇంటర్వ్యూలో ఉప్పీ చెప్పిన మాటలివి. ►ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ఓం’.. కన్నడనాట ఓ సెన్సేషన్. శివరాజ్‌కుమార్-ప్రేమ లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ కల్ట్ క్లాసిక్ జాబితాలో చోటు దక్కించుకుంది. ►హీరో కమ్ డైరెక్టర్‌గా ఉపేంద్ర తొలి భారీ సక్సెస్ ‘ఏ’. ఇది ఉప్పీ గతంలో ఓ నటితో జరిపిన ‘ప్రేమ’ వ్యవహారం ఆధారంగా తీసిన సినిమాగా ఓ ప్రచారం వినిపిస్తుంటుంది. ఈ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ తన ప్రొడక్షన్ హౌజ్‌లో ఓ సినిమా తీయాలంటూ ఉప్పీతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ►ఆ శాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ లీడ్ రోల్లో ‘ఆపరేషన్ అంత’ డైరెక్ట్ చేశాడు ఉపేంద్ర. కానీ, అది అంతగా ఆడలేదు. రాజకీయ కోణంలో వివాదాల్లో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉపేంద్ర’ భారీ సక్సెస్ అందుకుంది. ►ఉపేంద్ర సినిమా ముగింపును.. తన సినిమాను ఓపెనింగ్ షాట్‌గా వాడుకోవాలనే కోరికను స్టార్ దర్శకుడు శంకర్ గతంలో ఓ ఈవెంట్లో బయటపెట్టాడు కూడా. ►ముగ్గురు హీరోయిన్లను మనిషిలోని డబ్బు, అహం, డబ్బు-బాధ్యతలు అనే వాటితో పోలుస్తూ.. నేను అనే స్వార్థం ఉండకూడదనే ఉద్దేశంతో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ►షారూక్ ఖాన్ హిట్ మూవీ ‘డర్’ కన్నడ రీమేక్ ‘ప్రీత్సే’లో ఉప్పీ నటనకు ప్రశంసలు ►ఏ, ఉపేంద్ర, ప్రీత్సే, కుటుంబ, రక్త కన్నీరు, గోకర్ణ, గౌరమ్మా, ఆటో శంకర్.. 1998-2005 మధ్య ఏడు వంద రోజుల హిట్ సినిమాలు. ►రక్తకన్నీరుకు బెస్ట్ డైలాగ్ రైటర్‌గా అవార్డు ► వరుస సూపర్ హిట్లతో కన్నడ సూపర్ స్టార్‌గా గుర్తింపు ►తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ‘కన్యాదానం’తో యాక్టింగ్ డెబ్యూ ►విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు.. విలక్షణమైన నటుడిగా అలరించడం ఉప్పీకి ఉన్న ప్రత్యేకత ►డిఫరెంట్ సినిమాలు తీసినా.. కొంతకాలం సక్సెస్‌కి దూరం ► రోబో క్యారెక్టర్లో నటించిన తొలి నటుడు ఈయనే(హాలీవుడ్) ►2008లో ‘బుద్ధివంత’(బుద్ధిమతుడు)తో బ్యాక్ టు ఫామ్. ►దశాబ్దం గ్యాప్ తర్వాత 2010లో సూపర్ సినిమా డైరెక్షన్ ► రీమేక్‌లతో ఉప్పీకి అంతగా అచ్చీరాని సక్సెస్ ► ఉప్పీ 2తో మరోసారి డైరెక్టర్‌గా బాధ్యతలు ► తెలుగులో ఓంకారంతో దర్శకుడిగా డెబ్యూ. ఆ సినిమాకు నారేటర్ కూడా. ఆపై కన్యాదానం, రా, ఒకేమాట, నీతోనే ఉంటా, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తిలో నటించారు. త్వరలో వరుణ్‌తేజ్ ‘గనీ’తో కనిపించనున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
ఆడియో టేప్ దుమారం
విజయలక్ష్మిని దర్శన్ దూషిస్తున్నట్లుగా ఆడియో టేప్ సమసిపోని దర్శన్ దంపతుల గొడవ అంబరీష్ చర్చలు బెంగళూరు: శాండల్‌వుడ్ నటుడు దర్శన్ కుటుంబ జీవితంలో రేగిన కల్లోలం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. విజయలక్ష్మిని దర్శన్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లుగా ఓ ఆడియో టేప్ వాట్సాప్‌లో సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం వాట్సాప్ గ్రూప్‌లలో వినిపించిన ఈ ఆడియోటేప్‌లో అత్యంత అసభ్య పదజాలం వినిపించింది. అయితే ఈ ఆడియో టేప్‌లో ఉన్నది దర్శన్ గొంతు కాదని ఆయన భార్య విజయలక్ష్మి చెబుతుండడం గమనార్హం. ‘ పదమూడేళ్లుగా దర్శన్‌తో కలిసి ఉన్నాను, ఆయన నోటి వెంట ఎప్పుడూ ఇలాంటి పదజాలాన్ని నేను వినలేదు. అసలు ఆ గొంతు దర్శన్‌ది కాదు, మా మధ్య ఉన్న మనస్పర్థలను ఉపయోగించుకొని ఎవరో ఇదంతా సృష్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఇక విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయమే విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు దర్శన్‌కు సూచించినప్పటికీ తన తల్లికి అనారోగ్యంగా ఉన్న కారణంగా శుక్రవారం సాయంత్రం సమయానికి విచారణకు హాజరవుతానని దర్శన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇదే సందర్భంలో దంపతులిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్ధలను రాజీ ద్వారా నివృత్తి చేసేందుకు అటు రాష్ట్ర మహిళా కమిషన్‌తో పాటు సీనియర్ నటుడు అంబరీష్ సైతం ప్రయత్నిస్తున్నారు.