సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sandalwood Hero Yuvaraj Kumar Latest Movie Yuva Streaming On This Ott | Sakshi
Sakshi News home page

20 రోజుల్లోనే ఓటీటీకి శివరాజ్‌కుమార్‌ వారసుడి చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Apr 19 2024 10:06 AM | Last Updated on Fri, Apr 19 2024 12:10 PM

Sandalwood Hero Yuvaraj Kumar Latest Movie Yuva Streaming On This Ott - Sakshi

క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ కాంతారతో  ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ స‌ప్త‌మిగౌడ‌. ఈ సినిమాలో ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్ర‌లో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత క‌న్న‌డతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో అవకాశాలు దక్కిచుకుంది. ఇటీవల శాండల్‌వుడ్‌లో యువ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. యువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 29న థియేట‌ర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శివ‌రాజ్‌కుమార్ అన్న‌య్య కుమారుడు యువరాజ్‌కుమార్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 

తాజాగా ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్‌ విధానంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. సంతోష్ ఆనంద్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్‌కుమార్‌ రెజ్లర్‌ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజ‌నీష్ లోక‌నాథ్ మ్యూజిక్ అందించాడు.

మరోవైరు ఈ ఏడాదిలోనే స‌ప్త‌మి గౌడ‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న త‌మ్ముడు మూవీలో స‌ప్త‌మి గౌడ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement