రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!)
అయితే తాజాగా రిషబ్ ట్విటర్‌లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు.
ట్విటర్‌లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్)
ನಾ ಹುಟ್ಟಿ ಬೆಳೆದ ಮನೆ ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪುಗಳ ಖಜಾನೆ.
— Rishab Shetty (@shetty_rishab) June 25, 2023
ಅದಕ್ಕೀಗ ರಾಧ್ಯಾಳ ಕಿವಿ ಚುಚ್ಚಿಸಿದ ಸಂಭ್ರಮದ ನೆನಪೊಂದು ಹೊಸದಾಗಿ ಜೊತೆ ಸೇರಿದೆ.
The home where I grew up is filled with memories, and now Radhya's ear piercing ceremony added another special moment to it. pic.twitter.com/PnJDtZG4vy
Comments
Please login to add a commentAdd a comment