ear piercing
-
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?
రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) అయితే తాజాగా రిషబ్ ట్విటర్లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ట్విటర్లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్) ನಾ ಹುಟ್ಟಿ ಬೆಳೆದ ಮನೆ ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪುಗಳ ಖಜಾನೆ. ಅದಕ್ಕೀಗ ರಾಧ್ಯಾಳ ಕಿವಿ ಚುಚ್ಚಿಸಿದ ಸಂಭ್ರಮದ ನೆನಪೊಂದು ಹೊಸದಾಗಿ ಜೊತೆ ಸೇರಿದೆ. The home where I grew up is filled with memories, and now Radhya's ear piercing ceremony added another special moment to it. pic.twitter.com/PnJDtZG4vy — Rishab Shetty (@shetty_rishab) June 25, 2023 -
కర్ణవేధ... విద్యారంభం
షోడశ సంస్కారాలలో తొమ్మిదవది కర్ణవేధ: దీనికే కర్ణభేద అనే పేరు కూడా వుంది. అంటే చెవులకు రంధ్రం వేయడం అని అర్థం. వాడుకలో ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడమంటారు. దీనిని శిశువులందరికీ లింగభేదం లేకుండా శిశువుకు ఐదు సంవత్సరాలు నిండేలోపే జరిపించాలని దేవలుడనే మహర్షి బోధించాడు. తాటంకాలు అనగా చెవి తమ్మెలకు రంధ్రం వేసి వాటిని బంగారంతో అలంకరించడం ద్వారా మెదడుకు చైతన్యం కలిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెంది శిశువులు చురుకుగా అన్ని రంగాలలో రాణిస్తారని వైద్యశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడులు చెవి తమ్మెలలో అంతమౌతాయి. వాటిని నిత్యం బంగారంతో ప్రేరేపించడం ద్వారా అవి ఉత్తేజితమై, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. పూర్వాశ్రమంలో గురువులు తమ శిష్యులకు గుంజీలు తీసే శిక్ష విధించడంలో పరమార్థం ఇదే. అందుకే గతంలో స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ చెవులు కుట్టించుకునేవారు. సంస్కార విధానం: శుభముహుర్తాన స్నానాదులను ఆచరించాలి. స్వర్ణశిల్పాచార్యులను పిలిపించి, పూజామందిరం దగ్గర శిశువును కూర్చుండబెట్టి ఆచార్యుల చేత చెవులు కుట్టించాలి. తర్వాత ఆ చెవులను స్వర్ణాభరణాలతో అలంకరించాలి. తదుపరి ఆ చార్యులకు నూతన వస్త్ర దక్షిణ తాంబూలాదులను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. విద్యారంభం: యాజ్ఞవల్క్య స్మృతి తదితర స్మృతులలో ఈ అక్షరాభ్యాసం గురించి కనిపిస్తుంది. దీనికే విద్యారంభం, అక్షర స్వీకారం అని ఇతర పేర్లున్నాయి.. శిశువుకు ఈ సంస్కారాన్ని చూడాకరణం అయిన తర్వాత చేయాలని శాస్త్రం. వేదాధ్యయనంతప్ప ఇతర విద్యలన్నీ కూడా ఈ సంస్కారం అయిన తర్వాతే నేర్చుకోవడం ప్రారంభించాలని సూచించారు. ఒక్క వేదవిద్యమాత్రం, అర్హులైనవారు ఉపనయనం అయిన తరువాతే ప్రారంభించాలి. ఈ సంస్కారాన్ని ఐదు లేదా ఏడవ సంవత్సరంలో చేయాలని శాస్త్రవచనం. శిశువు విద్యలను అభ్యసించడం ద్వారా దినదిన ప్రవర్ధమానమవుతాడని, ఉత్తరాయణంలో ఈ సంస్కారం జరిపించాలని ఒక భాష్యకారుడు సూచించాడు. కొందరు కార్తీక, మార్గశిర మాసాలు కూడా యోగ్యమనే చెప్పారు. పురుష నక్షత్రాలలో, శుభతిథులలో, ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాలలో జరిపించాలని శాస్త్రం. సంస్కార విధానం: శుభముహుర్తాన, పూజామందిరంవద్ద గణపతి పూజ, పుణ్యహవాచనం పూర్తిచేసిన తర్వాత కలశస్థాపన చేసి, అందులోకి వాగ్దేవిని, గణపతిని, ఇతర దేవతలను ఆవాహనచేసి, సరస్వతీదేవికి విశేషపూజలు జరిపించాలి. గుణవంతుడు, విద్యాప్రపూర్ణుడైన ఒక ఆచార్యుని పిలిపించి ఆయనకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత, ఆ ఆచార్యుడు, ఒక పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి, మధ్యలో, ఆ బియ్యం మూడు సమాన భాగాలుగా అయ్యేట్లు ఒక బంగారు వస్తువుతో అడ్డంగా రెండు గీతల్ని గీయాలి. మొదటి భాగంలో ‘ఓం‘ అనీ, రెండవ భాగంలో ‘నమశ్శివాయ’ అనీ, మూడవభాగంలో ‘సిద్ధం నమః‘ అనీ వ్రాయాలి. శిశువును కుడితొడమీద కూర్చోపెట్టుకుని, తండ్రి, ఆ శిశువుచేత ఆ అక్షరాలను మూడుసార్లు దిద్దించాలి. ఆ తర్వాత గణపతికి, సరస్వతికి హవిస్సులర్పించే హోమం చేయాలని కొన్నిచోట్ల ప్రస్తావస్తన కనిపిస్తుంది. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
చెవి కుట్లు
ఈ 2020లో చెవి కుట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా నెటిజన్లు శోధించిన అంశాల్లో సౌందర్యానికి సంబంధించి చెవికి ఎన్ని పుడకలు, రింగులు లేదా ఎలాంటి ఆభరణాలు వచ్చాయనే అంశాన్ని అధికంగా శోధించినట్టు గూగుల్, పింటరెస్ట్.. వంటివి ఒక వార్తను విడుదల చేశాయి. ఈ శోధనను గమనించిన ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు ఈ తరహా ఆభరణాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి సింగిల్ స్టడ్స్, హూప్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. వీటిలో నక్షత్రరాశి రూపాన్ని పోలే ఆభరణాలు ఎక్కువ. ఇలా చెవులకు ఆభరణాలను అలంకరించడానికి ఎక్కువ కుట్లు వేయడం ఆక్యుప్రెజర్లో భాగంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు యువత గుర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకమైన చెవి ఆక్యుప్రెజర్ పాయింట్ల వద్ద స్టడ్స్ అమర్చుకోవడం వల్ల మైగ్రేన్, ఆందోళన, కొద్దిపాటి ఉదర సమస్యలు తగ్గవచ్చనే భావన వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. గిరిజన జాతుల్లో చెవి చుట్టూత కుట్లు, వాటికి ఆభరణాల వాడకం మనకు తెలిసిందే. బహుశా ఆ స్టైల్ ఇప్పటి తరానికి బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. -
చెవి కుట్టించుకున్న మంచు విష్ణు
హీరో విష్ణు ప్రతిసారీ ఏదో ఒకటి విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా దేవ కట్టాతో విష్ణు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో పాత్ర కోసం తప్పనిసరిగా చెవి కుట్టించుకోవాలని దర్శకుడు దేవ కట్టా విష్ణుకు చెప్పారట. దాంతో వెంటనే సరేనన్న విష్ణు.. బుద్ధిగా తన చెవి కుట్టించుకున్నారు. ప్రతి సినిమాలో విభిన్నంగా కనిపించాలని ప్రయత్నం చేసే విష్ణు.. ఈసారి కొత్త సినిమాలో మరింత కొత్తగా కనిపించాలని చెవి కుట్టించుకున్నారట. తమిళంలో విజయం సాధించిన అరిమ నంబి అనే చిత్రం ఆధారంగా దేవకట్టా ఈ సినిమా తీస్తున్నారు. తమిళ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా మొదటి షెడ్యూలు పూర్తయింది.