గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్! | Kantara actor Rishab Shetty special wishes to his wife on her birthday | Sakshi
Sakshi News home page

Rishab Shetty: తన భార్యకు కాంతార హీరో స్పెషల్ విషెస్.. వీడియో వైరల్!

Feb 29 2024 12:51 PM | Updated on Feb 29 2024 1:02 PM

Kantara Fame Rishab Shetty Special Wishes To Her Wife on Her Birthday  - Sakshi

కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్‌ హిట్‌ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే  'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్‌ గ్లింప్స్‌ మేకర్స్‌ విడుదల చేశారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

అయితే తాజాగా రిషబ్‌ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్‌ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా బర్త్‌ డే గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement