బర్త్‌ డే వేడుకల్లో విషాదం.. ‍అభిమానులకు కేజీఎఫ్ హీరో విజ్ఞప్తి | Kannada superstar Yash wrote to his fans about for his birthday celebrations | Sakshi
Sakshi News home page

Yash: 'మీరు ఇచ్చే గొప్ప బహుమతి అదే'.. అభిమానులకు కేజీఎఫ్ హీరో లేఖ

Published Mon, Dec 30 2024 9:23 PM | Last Updated on Mon, Dec 30 2024 9:27 PM

Kannada superstar Yash wrote to his fans about for his birthday celebrations

కేజీఎఫ్ హీరో, కన్నడ సూపర్ స్టార్ యశ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన బర్త్ డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్‌టౌన్‌కు రావద్దని కోరారు. ఎన్నో ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్‌కు సూచించారు. గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి యశ్ పోస్ట్ చేశారు.

కాగా.. యశ్ తన పుట్టిన రోజును జవనరి 8న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. పుట్టిన రోజు అందుబాటులో ఉండనని తెలిపారు. అయినప్పటికీ మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యశ్ లేఖను విడుదల చేశారు. మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని.. మీ అందరికీ 2025 శుభాకాంక్షలు అంటూ యశ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ ఏడాది విషాదం..

ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది. ఆయన బ్యానర్‌ను కడుతూ ముగ్గురు అభిమానులు విద్యాదాఘాతంలో మృతిచెందారు. కర్ణాటకలోని  లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19) ఉన్నారు.

yash

మరో ముగ్గురికి గాయాలు..

ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వారిని తరలించారు. యశ్‌ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్ధరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్ తన పుట్టినరోజును అభిమానులతో జరుపుకోలేదు. కరోనా సంక్షోభానికి ముందు, అతను ఒకప్పుడు తన అభిమానులతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. ఈ ఏడాది కూడా అభిమానులతో కలిసి బర్త్‌ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని  లేఖ ద్వారా అభిమానులకు తెలియజేశారు. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement