కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్‌పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
(ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా')
దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు.
అసలు వివాదం ఏంటి?
ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్‌ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
(ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక)
Comments
Please login to add a commentAdd a comment