Defamation
-
ఎంపీ సంజయ్ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్ తగిలింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ సింగ్‌పై గోవా సీఎం ప్రమాద్ సావంత్ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్ సింగ్‌కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్ పాయ్ వెర్నేకర్ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ సింగ్ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలకు హైకోర్టు సమన్లు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
-
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్‌ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్‌రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్‌పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్‌ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్‌కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్‌రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్‌ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రాహుల్ వ్యాఖ్యలు తప్పే కానీ.. తీర్పులో ఏముందంటే..?
ఢిల్లీ: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే.. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే.. 'దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బహిరంగంగా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికింది. కానీ పార్లమెంట్ పదవికి రద్దు చేయడం వంటి చర్యలు వ్యక్తి హక్కుకు భంగపరచడమే గాక.. ఎన్నికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అయితే పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీని కారణంగా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి దూరమయ్యారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతటి గరిష్ఠ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు ఎలాంటి సరైన కారణం ఇవ్వలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా.. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. రెండేళ్ల జైలు శిక్షపై స్టే -
స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్‌పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా') దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు వివాదం ఏంటి? ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్‌ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
ఇక విడాకులే ఫైనల్.. ఇప్పటికే ప్రక్రియ మొదలైంది: ఆలియా
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య ఆలియాతో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దుబాయ్ నుంచి పిల్లలతో సహా ఇండియాకు తిరిగొచ్చిన ఆలియా.. నవాజుద్దీన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనను, పిల్లలను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్యపై బాంబే హైకోర్టులో రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఆలియా విడాకుల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఆలియా మాట్లాడుతూ.. 'విడాకుల ప్రక్రియ కచ్చితంగా జరుగుతుంది. నా పిల్లల సంరక్షణ కోసం నేను పోరాడతా. నా పిల్లలిద్దరూ నాతో ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడరు' అని అన్నారు. ఇదే విషయంపై ఆలియా తరఫున లాయర్ రిజ్వాన్ ఇప్పటికే కోర్టుకు వాంగ్మూలం సమర్పించినట్లు తెలిపారు. నవాజుద్దీన్ న్యాయవాదులు తనకు సెటిల్మెంట్ కోసం కొన్ని నిబంధనలు పంపారని తెలిపారు. ఇప్పుడు ఆలియాతో అదే విషయమై చర్చిస్తున్నట్లు రిజ్వాన్ సిద్ధికీ పేర్కొన్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం వివాదం ముగిసిపోయేలా ప్రయత్నిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రూ. 100 కోట్ల పరువునష్టం దావాను ఉపసంహరించుకోవాలని సిద్దిఖీని కోరతామని రిజ్వాన్ పేర్కొన్నారు. అయితే మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాకు కాపీని మాకు ఇంకా అందజేయలేదని అన్నారు. -
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఆలియా అయితే సోషల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసింది. అయితే అసత్యాలు ప్రచారం చేస్తూ,తన పరువుకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దీన్పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. 2008 నుంచి తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ ఆ సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్వర్డ్లు తీసుకొని తనను ఆర్థికంగా మోసం చేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆలియాను సైతం ఉసిగొల్పాడని నవాజ్ తెలిపాడు. -
కేంద్రమంత్రి స్మృతి ఇరాని పరువు నష్టం దావా
-
కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్ కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావుకు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి, కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయరాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. పత్రికలు, టీవీ, సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రస్తావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడో అదనపు చీఫ్ జడ్జి కళ్యాణ చక్రవర్తి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు (యాడ్ ఇంటరిమ్ ఇంజక్షన్) జారీ చేశారు. డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి తనకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా రేవంత్‌ను ఆదేశించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను న్యాయమూర్తి విచారించారు. అడ్డగోలుగా ఆరోపణలు..: మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినా నిరాధారమైన ఆరోపణలతో ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనివల్ల కేటీఆర్ పరువు, ప్రతిష్టలకు తీవ్రస్థాయిలో భంగం కలుగుతోందని తెలిపారు. మంత్రిగా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలో, దేశ, విదేశాల్లోనూ కేటీఆర్ పేరు సంపాదించుకున్నారని, అనేక అవార్డులు పొందారని వివరించారు. దీంతె స్పందించిన న్యాయమూర్తి... పై ఆదేశాలు జారీ చేశారు. ప్రతివాది రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. -
‘అక్షయ్ వేధింపులకు దిగుతున్నాడు’
ముంబై: బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ జారీ చేసిన పరువు నష్టం నోటీసులు తీసుకునేందుకు బిహార్‌కు చెందిన యూట్యూబర్ రషీద్ సిద్దిఖీ నిరాకరించాడు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో రషీద్ య్యూట్యూబ్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అక్షయ్ తన నోటీసుల్లో పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న వీటిని పంపించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి ఎఫ్ఎఫ్ న్యూస్ చానెల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా, అవమానకరమైన రీతిలో తనపై తప్పుడు ప్రచారం చేశాడని అక్షయ్ ఆరోపించాడు. అయితే అక్షయ్ తనకు పంపించిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని, లేదంటే అతనిపై చట్టపరంగా ముందుకెళ్తానని సిద్దిఖీ అన్నారు. ఈ మేరుకు ఆయన తన న్యాయవాది జేపీ జైస్వాల్ ద్వారా శుక్రవారం నోటీసులు పంపించారు. అక్షయ్ కుమార్ నోటీసుల పేరుతో తనపై వేధింపులకు దిగుతున్నాడని అందులో ఆరోపించాడు. తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ప్రతీ పౌరుడికి ఉంటుందని, ప్రాథమిక హక్కుల్లో ఇది భాగమని సిద్దిఖీ స్పష్టం చేశారు. తన చానెల్లో వచ్చిన వీడియోలు పరువు నష్టం కిందకి రావని తెలిపారు. ఇతర న్యూస్ చానెళ్లలో వచ్చిన సమాచారం ఆధారంగానే తాను అక్షయ్‌పై వార్తలు ప్రసారం చేశానని పేర్కొన్నాడు. తాను ఆ వీడియోలను ఆగస్టులో ప్రసారం చేశానని.. అయితే ఇప్పటి వరుకు ఎందుకు స్నందించలేదో అక్షయ్‌సమాధానం చెప్పాలన్నారు. కావాలనే తనపై కక్ష్య సాధింపు చర్యలకు దిగాడని సిద్దిఖీ ఆరోపించారు. మహారాష్ట్ర పోలీసులతో పాటు ప్రభుత్వంపై ఉద్ధేశపూర్వకంగా తన యూట్యూబ్ చానెల్లో అసత్య ప్రచారం చేశాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు సిద్ధిఖీపై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయకుండా నవంబర్ 3న సిద్దిఖీ ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. -
ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా : టీటీడీ
సాక్షి, చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది. అలాగే రమణ దీక్షితులును ఆలయ ప్రధాన అర్చకుడిగా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం జరిగిన పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019-20 వార్షిక బడ్జెట్ కింద రూ. 3243 కోట్లకు పాలకమండలి ఆమోదం తెలిపిందని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10 కోట్లు, టీటీడీ పరిపాలనా భవనం మరమత్తుల కోసం రూ.14.30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ‘ఘాట్‌రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం. రూ.14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. జమ్ముకశ్మీర్, వారణాసిలోనూ ఆలయాలు నిర్శాణం. టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తాం. 2019-20 శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు ఆదాయం సమకూరింది’ అని తెలిపారు. -
దావా నెగ్గిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
లండన్ : పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ పరువునష్టం దావా కేసు నెగ్గారు. కోర్టు ఆదేశాలతో నిరాధార ఆరోపణలపై సదరు వార్తా ప్రసార సంస్థ ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. వివరాలు.. ఇమ్రాన్ మాజీ భార్య, పాక్ సంతతి బ్రిటిష్ పౌరురాలు రెహమ్ ఖాన్ పాక్‌లో ఎన్నికల ముందు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని వ్యక్తిగత, లైంగిక విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాక, పూర్తి వివరాలతో తన ఆత్మకథను రాస్తానని ఆమె అప్పడు ప్రకటించారు. ఎన్నికల్లో కాబోయే ప్రధానిగా ఇమ్రాన్ పేరు మార్మోగుతున్న తరుణంలో రెహమ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇమ్రాన్‌కు ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండడంతో పార్టీలోని ఇతర నాయకులు ఆమెను టార్గెట్‌గా చేసి అనేక తీవ్ర విమర్శలు చేశారు. రెహమ్ ఆత్మకథ రాసేందుకు ఇమ్రాన్ ప్రత్యర్థి పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు షెహబాజ్ షరీఫ్ వద్ద నుంచి డబ్బు తీసుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఇమ్రాన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు రెహమ్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ పార్టీ నాయకుడు, ఇప్పటి పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ గతేడాది జూన్‌లో దునియా అనే టీవీ చానెల్లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పైన పేర్కొన్న వ్యాఖ్యలను పరుష పదజాలంతో మరోసారి చేశారు. ఉర్దూలో ప్రసారమయ్యే దునియా చానెల్ ఇంగ్లాండ్‌లో కూడా ప్రసారమవుతుంది. అయితే రషీద్ చేసిన ఆరోపణలను ఆ చానెల్ పదే పదే ప్రసారం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన రెహమ్ ఖాన్ నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ లండన్‌లోని రాయల్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మాథ్యూ నిక్లిన్ రెహమ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పి కోర్టు ఖర్చులు చెల్లించాలని సదరు టీవీ చానెల్‌ను ఆదేశించారు. జడ్జి ఆదేశాల ప్రకారం దునియా టీవీ చానెల్ రెహమ్ ఖాన్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ, కొంత నష్ట పరిహారంతో కోర్టు ఖర్చుల్ని భరిస్తామని ప్రకటించింది. అనంతరం రెహమ్ స్పందిస్తూ.. ఈ తీర్పు వల్ల నా వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నానని, పాకిస్తాన్లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
కార్యకర్తలారా..మీరు ఏం చేస్తున్నారు.?
ముంబయి : ముంబయి నగరం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి ఏం చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. గతంలో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన రాహుల్‌గాంధీపై ముంబయి లోకల్ కోర్టులో పరువునష్టం దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు నుంచి సమన్లు అందుకోవడానికి రాహుల్ గురువారం ముంబయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ట్విటర్లో పేర్కొన్న మర్నాడే రాహుల్ ముంబయికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరైన రాహుల్ అటు నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గె, పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. మహరాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల విషయం పక్కనబెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి కాదని వెల్లడించారు. -
ప్రేమ సముద్రంలో పరువు కల్లోలం
ఉరకలు వేసే ఉత్సాహంతో ఈ జూన్ 30నపుట్టిన రోజు వేడుకని సంబరంగా జరుపుకుంది 22 ఏళ్ల చంద్రిక. కానీ అదే తన జీవితంలో చివరి వేడుకని తెలియలేదు తనకి.కృష్ణా జిల్లా నందిగామకు చెందిన చంద్రిక నిండు నూరేళ్ల జీవితం పాతికేళ్లు కూడా నిండకుండానే కడతేరిపోయింది. అది కూడా సొంత తండ్రి చేతిలో!ప్రమాదవశాత్తూ అనో, ఆవేశంలో అనో తండ్రి చంపేశాడని సరిపెట్టుకోవడానికి ఇది మామూలు హత్య కాదు.ఇది పరువు హత్య! పరువు పేరుతో హత్య. చంద్రిక చేసిన నేరమల్లా తన జీవిత భాగస్వామిని తాను ఎంపిక చేసుకోవడమే. నిజానికి 18 ఏళ్లు నిండిన ఏ ఆడపిల్లైనా తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవచ్చుననీ, దాన్ని ఎవరైనా అడ్డుకోవాలనుకోవడం తీవ్రమైన నేరంగా భావించాల్సి వస్తుందనీ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. కానీ ఈ దేశంలో కుటుంబ బంధాలూ, రక్త సంబంధాలూ, ప్రేమానుబంధాలన్నింటికన్నా మించింది కులమేనని మరోసారు రుజువు చేసింది చంద్రిక మరణం. ఆడపిల్లల జీవితాల్లో పరువు అనే మూడక్షరాలు సృష్టిస్తోన్న మారణకాండకి చంద్రిక ఒక తాజా ఉదాహరణ మాత్రమే. యూపీ, బిహార్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఖాప్ పంచాయితీల పేరుతోనూ, తమిళనాడులో ఖట్టా పేరుతోనూ కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురై చివరకు ఆచూకీ దొరకని కేసుగానో, తప్పి పోయిన కేసుగానో, ఎవరితోనో వెళ్లిపోయి కనపడకుండా పోయిన అమ్మాయిల జాబితాలోనో చేరిపోతూ అంతుచిక్కని రహస్యంగా మారిపోతున్నాయి అమ్మాయిల మరణాలు. అందుకు ఎన్నో నిదర్శనాలు. 2016 మార్చి 24. గుంటూరు జిల్లా పట్టాభిరాంపురంలో కూతురు దీప్తిని చున్నీని ముఖానికి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసాడు తండ్రి హరిబాబు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఐటీæ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న దీప్తి చేసిన ‘నేరం’ కూడా.. తనకు నచ్చిన వ్యక్తిని కులం చూడకుండా ప్రేమించడమే. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని, కులం తక్కువ వ్యక్తితో ప్రేమా గీమా అంటే తాము చనిపోతామని మొదట బెదిరించాడు. తర్వాత నయానా భయానా చెప్పి చూశాడు. దీప్తి తను ప్రేమించినతన్నే చేసుకుంటానని చెప్పడంతో ఏదో వంకతో హైదరాబాద్ నుంచి గుంటూరుకి పిలిపించి చున్నీతోనే ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత కోపంలో చంపేశామని పోలీసులకు లొంగిపోయాడు. 2015 జనవరి 31. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని పంజని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవీరపల్లి గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుతోన్న పదిహేడేళ్ల అమ్మాయిని సొంత తల్లిదండ్రులే చంపేసి, తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేరే కులానికి చెందిన 20 ఏళ్ల వ్యక్తితో చనువుగా ఉండడం తెలిసి, అమ్మాయి తండ్రి శ్రీరాములు కూతురిని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో తల్లీతండ్రీ ఇద్దరూ కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి కొండమీదికి తీసుకెళ్లి చంపేశారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో అది జరిగిన పది రోజుల తరువాత ఆ అమ్మాయి శవం దొరికింది. అసలు విషయం బయటపడింది. ప్రేమ.. పరువు.. హత్య ప్రాణంకన్నా ఎక్కువగా భావించే, ప్రేమించే పిల్లలకి ఏ తండ్రైనా, తల్లైనా ఎందుకు హాని చేస్తారు? కన్నపేగుకన్నా బలమైనదేదో వారిని కట్టిపడేస్తోంది. అదే.. కుల సమాజం. కులం కాకపోతే మతం లేదా ప్రాంతం లేదా స్టేటస్. వీటన్నింటి ద్వారా సంక్రమించే పరువు. అదే ఈ హత్యలన్నిటికీ కారణం. ఓ సామాజిక అనంగీకార భావన. ఇంకా చెప్పాలంటే న్యూనతా భావం. ఇంత వరకూ గౌరవంగా చూసిన సమాజం తక్కువ కులం వ్యక్తిని తమ బిడ్డ వివాహం చేసుకుంటే ఏమనుకుంటుందోననే భయం. తమని గేలిచేస్తారేమోననే ఆత్మన్యూనతాభావం. కులం నుంచి వెలివేస్తారేమోననే భయం. కుటుంబ గౌరవం పోతుందనే ఓ తప్పుడు భావజాలం వారిని సొంత బిడ్డలనే కడతేర్చుకునేలా చేస్తోంది. పరువు హత్యకు పాల్పడేలా చేస్తోంది.ఉత్తరాదికి పోటీగా ఏపీ! ఉత్తరప్రదేశ్, హరియానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ ఆడపిల్లలను కంట్రోల్ చేయడమన్నది ఖాప్ పంచాయితీల పేరుతో వ్యవస్థీకృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు పరువుహత్యల్లో ఉత్తరాది రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. – అత్తలూరి అరుణ సుప్రీంకోర్టు ఏం చెపుతోంది? ‘‘వివాహ వయస్సు వచ్చిన ఏ అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా తమకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు వుంది. అందులో ఖాప్ పంచాయితీలు గానీ, ఏ ఇతర వ్యక్తులుగానీ, సమాజాలుగానీ ప్రశ్నించే హక్కులేదు’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్వాల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జూ, జ్ఞాన్ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం.. పరువు పేరుతో హత్యలను వ్యవస్థీకరించిన ఖాప్ పంచాయితీలను తీవ్రంగా దుయ్యబట్టింది. దక్షిణాదిన తమిళనాడులో ఖట్టా్ట పంచాయితీలు, ఉత్తర భారతదేశంలో ఖాప్ పంచాయితీల పేరుతో జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇటీవల కూడా పరువు హత్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు, పోలీసు అధికారులకు కొన్ని సూచనలు కూడా చేసింది. కులాంతర, మతాంతర వివాహాల సందర్భంగా ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో వివరించింది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఈ దురాచారాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అయినప్పటికీ ఇప్పటికీ పరువు హత్యల పరంపర కొనసాగుతూనే ఉండడం ఆడపిల్లల జీవించే హక్కుని హరించి వేస్తోంది. ఐసీఏహెచ్కే నివేదిక ఆధారంగా... ►ప్రపంచవ్యాప్తంగా రోజుకు 13 మంది మహిళలు పరువుహత్యకు గురవుతున్నారు. ►ఏడాదికి సుమారు 5000 పరువు హత్యలు -
స్వామి వారి విలువ వంద కోట్లేనా...?
సాక్షి, హైదరాబాద్ : గత కొంతకాలంగా టీటీడీ పాలకమండలిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి తెరపైకి వచ్చారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పలేకనే టీటీడీ పాలకమండలి తనపై పరువు నష్టం దావా వేసిందని మండిపడ్డారు. తాను చెప్పినవన్ని వాస్తవాలేనని, వాటి గురించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వామి వారి పూజలు, నైవేద్యాల్లో లోపాలు జరుగుతున్నాయి. స్వామి వారికి ఆరాధనలు సరిగా జరగడం లేదన్నందుకు నా మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం వేసారు. అంటే స్వామి వారి పరువును కేవలం వంద కోట్లకే పరిమితం చేస్తున్నారా’ అంటూ ప్రశ్నించారు. ఆభరణాలు తరలిపోతున్నాయి... శ్రీవారికి ఎందరో రాజులు విలువైన ఆభరణాలు సమర్పించారు. వాటి వివరాలను శిలాశాసనాలలో కూడా పొందుపరిచారు. కానీ నేడు అవన్ని తరలిపోతున్నాయి. వంటశాల నుంచి నేలమాళిగకు దారి ఉన్నట్లు తెలుస్తుంది. స్వామి వారి సంపద అంతా నేలమాళిగలోనే ఉందని, అక్కడకు సామాన్యులు వెళ్లలేరని తెలిపారు. స్వామి వారిని పస్తులు ఉంచారు... ఎవరికి చెప్పకుండా పోటును మూసివేసారు. పోటు మూసి వేస్తే ప్రసాదాలు, నైవేద్యాలు ఎక్కడ తయారు చేస్తారని ప్రశ్నించారు. అందుకే స్వామి వారిని 25 రోజుల పాటు పస్తులు ఉంచారని విమర్శించారు. పోటును మూసివేసి అక్కడ భారీగా తవ్వకాలు జరిపారని...పోటు తలుపులు తీసిన తరువాత చూస్తే అక్కడ భూకంపం వచ్చినట్లుగా ఉందన్నారు. తాను వెంటనే ఈ విషయం గురించి జేఈఈని అడిగానని..కానీ ఆయన సరిగా స్పందించలేదన్నారు. ఎవరో మేడం చెప్పిందని తవ్వకాలు జరిపామన్నారు. కానీ తరువాత కాలంలో స్వయంగా జేఈఈనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోటులో తవ్వకాలు జరిపామని తెలిపారన్నారు. వీటన్నింటి గురించి ప్రశ్నిస్తే తనను ఉద్యోగం నుంచి తొలగించారని మండిపడ్డారు. తాను వద్దని వారించిన వినకుండా అతిక్రూరంగా ఆనాడు వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని మండిపడ్డారు. ఈ తొలగింపుల్లో నాలుగైదు నిధులు దొరికాయని బయట ప్రచారం జరుగుతుందని తెలిపారు. మిరాశీ, వంశ పారంపర్య అర్చకత్వం రెండూ వేరు. కానీ ద్వేషపూరితంగా మిరాశీ వ్యవస్థను రద్దు చేయడమే కాక వంశపారంపర్య అర్చకత్వాన్ని కూడా రద్దు చేశారని విమర్శించారు. కానీ దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం సాధించమని గుర్తు చేసారు. సీబీఐ విచారణ జరపాలి... గతంలో ఆభరణాల్లో ఏమైనా తరుగులు ఉంటే అర్చకుల నుంచి డబ్బులు వసూలు చేసే వారని... అందుకే అర్చకులు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని గుర్తు చేసారు. కానీ నేడు శ్రీవారి ఆభరణాల బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదని.. తరుగులు, రాలిపోయిన రాళ్లకు బాధ్యత లేకుండా పోయిందని వాపోయారు. తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఆలయంలో అపవిత్ర కార్యక్రమాలు... 2017లో శ్రీవారి ఆలయంలో రెండు అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇలా స్వామి వారికి అపవిత్రత ఆపాదించే కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైదిక విజ్ఞానం లేని అధికారులను నియమిస్తున్నారని అందువల్లే మన ఆచార, వ్యవహారాలు వారికి తెలియడంలేదని ఆరోపించారు. అధికారులు శుచి, శుభ్రత పాటించడం లేదని మండిపడ్డారు. తాను ఉన్నంత వరకూ శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడనని, కానీ ఇప్పటికి శ్రీవారి ఆలయంలో అర్చకులకు విలువ లేదని బాధపడ్డారు. -
మోదీకి సిద్దరామయ్య పరువునష్టం నోటీసులు
బెంగళూరు: అసత్య అవినీతి ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిమాండ్‌చేశారు. క్షమాపణలు చెప్పకుంటే, పరువునష్టం కింద రూ.100 కోట్లు అపరాధరుసుం చెల్లించాలని మోదీ, అమిత్‌లకు సిద్దరామయ్య లీగల్ నోటీసులు పంపించారు. అవినీతి ఆరోపణలు చేసినందుకు కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పకు సైతం సిద్దరామయ్య నోటీసులు పంపారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘ప్రతీ పనికి లంచం తీసుకునే సర్కారు’, ‘పది శాతం కమీషన్లు పొందే సర్కారు’ అని ప్రచారసభల్లో మోదీ పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం తెల్సిందే. -
అసత్యాలు ప్రచారం చేస్తే.. డిఫమేషన్ వేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాం నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. యూపీఏ హయాంలోనే జరిగిందనీ ఈ ఉంభకోణం బీజేపీ వాదిస్తుండగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బీజీపీ వత్తాసు వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ తాజా వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. ముఖ్యంగా పీఎన్బీ మెగా స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీలో తన కుటుంబీకులకు షేర్లు ఉన్నాయన్నఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అంతేకాదు నిర్మలా సీతారామన్ చేసిన నిరాధార ఆరోపణలను ప్రచురించే అన్ని మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు గానీ, తనభార్య, కుమారుడికిగానీ గీతాంజలి,నీరవ్ మోదీతో ఎలాంటి సంబంధాలు లేవనీ, నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలు పౌర , క్రిమినల్ సహా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి చెందిన స్థలంలో అయిదేళ్ల క్రితం నీరవ్ మోదీకి చెందిన కంపెనీ అద్దెకు తీసుకున్నారనీ, ఈ ఒప్పందం 2017 డిసెంబరుతోనే ముగిసిపోయినట్టు చెప్పుకొచ్చారు. కాగా కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వి భార్యకు నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్లు ఉన్నాయంటూ నిర్మలా సీతారామన్ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. -
మీడియా తప్పులపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మీడియా సంస్థలపై తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛా హక్కు ద్వారా మీడియా చేసే పొరపాట్లను పెద్దవి చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘‘వార్తను త్వరగతిన ఇవ్వాలన్న ఆత్రుత వల్లనో లేక మరేయితర కారణంతోనో చిన్న చిన్న తప్పులు చేస్తూ మీడియా సంస్థలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తమ పరువుకు భంగం వాటిల్లినప్పుడు బాధితులు కోర్టులను ఆశ్రయించవచ్చు. అది రాజ్యాంగ బద్ధంగా వారికి కల్పించబడిన హక్కు. అయితే మీడియా సంస్థలు చేసే పొరపాట్లు అవి అవతలివారికి నష్టం కలిగించేవే అయినా.. అవి పరువు నష్టం కిందకు రాబోవు’’ అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఓ హిందీ టీవీ ఛానెల్ తనపై అసత్య వార్తలు ప్రచురించాయని బిహార్‌కు చెందిన ఓ మహిళ ఏడేళ్ల క్రితం పట్నా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. భూకబ్జా వ్యవహారంలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అయితే వెంటనే ఆ మీడియా సంస్థ క్షమాపణలు తెలియజేస్తూ ప్రకటన ఇవ్వగా.. ఆమె ఆ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సెప్టెంబర్ లో హైకోర్టు బెంచ్ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో సోమవారం ఆ పిటిషన్ విచారణకు రాగా.. న్యాయమూర్తి పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేశారు. -
ప్రేమకు పరువుండదా!
ప్రేమకు పరుగు ఉంటుంది. పరువం తీయించే పరుగు. భయాలు పెట్టించే పరుగు. పరువు నీడ నుంచి పరుగు. ప్రతిష్టల బరువు నుంచి పరుగు. కట్టుబాట్ల ఆనకట్టలు వేస్తే.. ప్రేమ తలవొగ్గుతుందా? ప్రేమ తలొంచుతుందా? పెద్దవాళ్లకు పరువంటే ప్రేమ ఉంటుంది. మరి... పిల్లల ప్రేమకు పరువుండదా?! ‘‘ఎంత పని చేశావ్‌రా...? ఇప్పుడెలాగా?’’ తన మేనల్లుడు రోహిత్ చెప్పిన మాట విని, ధారగా కాలవ కట్టిన చెమటలు తుడుచుకుంది సునంద.‘‘అలా గాబరా పడకు అత్తా... అసలే నాకు భయంగా ఉంది.. నువ్వు కంగారు పడి నన్ను ఇంకా భయపెట్టకు అత్తా!’’ అన్నాడు పందొమ్మిదేళ్ల రోహిత్.‘‘గాబరా పడక.. నువ్వు చేసిన పనేంట్రా?’’ అరిచేశాడు సునంద భర్త.‘‘నువ్వు మా దగ్గరకు వస్తున్నట్టు మీ అమ్మానాన్నలకు తెలుసా?’’ అడిగాడు అదే కోపంతో.తెలీదనట్టుగా తలూపాడు.తల పట్టుకొని కూర్చున్నారు సునంద, ఆమె భర్త మోహన్. ఆవేశం, కోపం తగ్గాక ‘ఇప్పుడేం చేద్దాం’ అన్నట్టుగా మొహాలు చూసుకున్నారిద్దరూ!ఇంతకీ వాళ్లనంతలా భయపెట్టిన ఆ విషయమేంటి?రోహిత్.. ఇంజనీరింగ్ విద్యార్థి. అతని చెల్లి సృజన. ఇంటర్ చదువుతోంది. తండ్రి మదన్.. కాంట్రాక్టర్. తల్లి లత.. గృహిణి. హైదరాబాద్‌లో నివాసం. సామాజిక పరంగా చూస్తే అగ్రకులం. డబ్బుకు కొదవలేదు. దానితో వచ్చిన హోదాకూ ఢోకా లేదు. పరువు అంటే పడిచస్తారు మదన్, లత. ఏడాదిగా సృజన ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. తరచు కలవడాలు, సినిమాలు, పిక్నిక్స్కు, ఫ్రెండ్స్ గాదరింగ్స్కు ఆ అబ్బాయితో వెళ్లడం సాధారణమైంది. ఒకరోజు అన్న కంట్లో పడింది. హెచ్చరించాడు. ఇంకోసారి తండ్రి స్నేహితుడి దృష్టిలోకి వచ్చింది. తండ్రి బెదిరించాడు. ‘అలాంటిదేమీలేదు. జస్ట్ ఫ్రెండ్’ అని కొట్టిపారేసి ఆ హెచ్చరికను, బెదిరింపును తుంగల్లో తొక్కేసింది. ఎప్పటిలాగే స్నేహం కొనసాగించింది. అయితే ఎవరికంటా కనపడకుండా జాగ్రత్త తీసుకోసాగింది. కాని రోహిత్ మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేదు. మరచిపోలేదు. కాలం గడుస్తోంది. సృజనకు, ఇంజనీరింగ్ చదువుతున్న ఆ అబ్బాయికీ స్నేహం బలపడసాగింది. ఒకరోజు... లాంగ్‌డ్రైవ్‌కి ప్లాన్ చేసుకుంది ఆ జంట. ఇంట్లో చెప్పిన సమయం కన్నా చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకుంది సృజన. అంటే దాదాపు అర్ధరాత్రికి. తనకోసం ఎదురుచూస్తున్న ఇంటిల్లిపాదికీ తన ఆలస్యానికి కారణంగా అంతకుముందే సిద్ధం చేసి ఉంచుకున్న ఓ అందమైన కట్టుకథని వినిపించింది. ముగ్గురూ మౌనంగా విన్నారు. ఆమె నిద్రపోయాక తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే అసలు కారణమేంటో సృజన ఇల్లు చేరకముందే ఆమె స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కున్నారు వాళ్లు. ఆ ఒక్కరోజే కాదు ఆమె చాలా రోజుల నుంచే చాలా అబద్ధాలు ఆడుతోందనీ తెలిసింది. చేయకూడని తప్పు ఏదో చేస్తోందనీ చూచాయగా అర్థమై పోయింది వాళ్లకి. ‘చెల్లి విషయం మాకు వదిలెయ్.. అబ్బాయి సంగతి నువ్వు చూడు’ అనే బాధ్యతను కొడుకుకు అప్పజెప్పారు లత, మదన్. అప్పటినుంచి.. ఆ పనిమీదే ఉన్నాడు రోహిత్. ‘‘ఒరేయ్.. వాడితో ఫ్రెండ్షిప్చేసి కంట్రోల్ చేయాలిరా’’ అని ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా చాలా సీరియస్‌గా పాటించాడు రోహిత్. ఫ్రెండ్పిష్ చేశాడు. ఆ అబ్బాయిని నమ్మించాడు. సేమ్ టు సేమ్ చెల్లెలిని ఆ అబ్బాయి లాంగ్‌డ్రైవ్‌కి తీసుకెళ్లినట్లే అతనిని ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌డ్రైవ్‌కి తీసుకెళ్లాడు. అలా కిడ్నాప్‌కి ప్లాన్ చేశాడు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది కానీ, మధ్యలో చిన్న అపశృతి దొర్లింది. ఇప్పుడు..మేనత్త వాళ్లింట్లో.. ‘‘అత్తా.. వాడిని చంపాలని మేం అనుకోలేదు. నిజానికి వాడు చచ్చిపోయాడనే విషయం కూడా నాకు తెలియదు. టీవీలో స్క్రోలింగ్ చూసేవరకు. ఆ రోజు అసలు ప్లాన్.. వాడిని బాగా తాగించి.. మా ఫ్రెండ్‌వాళ్ల ఫామ్ హౌజ్‌లో రూమ్ అరెస్ట్ చేయాలని. సృజన జోలికి రావాలంటేనే భయపడేలా చేసి వదిలేద్దాం అనుకున్నాం. అయితే లికర్ను చూడగానే వాడితోపాటు ఫ్రెండ్స్ కూడా తాగడం మొదలుపెట్టారు. నాకూ మనసాగలేదు. నేనూ తాగాను. ఆ మత్తులో వాడిని కిడ్నాప్ చేయబోతున్నామనే విషయాన్ని కక్కేశాం. అంతే! వాడికి మత్తు దిగిపోయింది. అక్కడినుంచి పారిపోడానికి ట్రై చేశాడు. తెలివి తెచ్చుకుని మేం పట్టుకోవడానికి ప్రయత్నించి, పట్టుకున్నాం. ఆ పెనుగులాటలో కొట్టుకున్నాం కూడా. వాడు ఆవేశంతో సృజను మరిచిపోయి బతికేదే లేదు. త్వరలోనే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుంటాం అన్నాడు. ఆ మాటకు కసితో వాడి తల మీద బాటిల్‌తో కొట్టాను. అత్తా.. వాడు మన కులం కాదు. మనకన్నా తక్కువ కులం. నా చెల్లెతో తిరగడమే తప్పు.. పైగా పెళ్లి చేసుకుంటాననడంతో నాకూ కోపమొచ్చింది. అందుకే కొట్టాను. వాడి తల నుంచి రక్తం కారేసరికి భయమేసి నేను పారిపోయాను. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా పారిపోయారట ఎక్కడివాళ్లక్కడ. నేను ఇంకో ఫ్రెండ్ వాళ్లింట్లో ఉన్నా. అక్కడే టీవీలో చూశా. వాడు చచ్చిపోయాడని. ఫ్రెండ్స్ ద్వారా నా గురించి పోలీసులకు తెలిసిందని. అమ్మానాన్న పోలీస్ స్టేషన్లోనే ఉన్నారట. ఇంకో ఫ్రెండ్ చెప్పాడు. వాళ్ల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయేమోనని నాతో మాట్లాడ్డానికే ఎవరూ ఇష్టపడట్లేదు. ఇక షెల్టర్ ఎవరిస్తారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చాను అత్తా..!’’ అంటూ వివరించిన రోహిత్ కళ్లల్లో పశ్చాత్తాపం కన్నా భయమే కనిపించింది సునందకు.భర్త వంక చూసింది అయోమయంగా! ‘‘తక్కువ కులం.. ఎక్కువ కులమేంట్రా?’’ అన్నాడు మోహన్.‘‘అవును మామయ్యా.. అమ్మా, నాన్న తక్కువ కులం వాళ్లతో, మనకన్నా తక్కువ డబ్బున్న వాళ్లతో మాట్లాడొద్దని.. చెప్పేవాళ్లు. చిన్నప్పుడు రెండుమూడుసార్లు నేనలా మాట్లాడితే.. కొట్టారు కూడా. అది నా మైండ్‌లో పడిపోయింది మామయ్యా.. అందుకే అప్పటి నుంచి మాట్లాడ్డం మానేశాను. మనకన్నా అన్నిట్లో తక్కువున్న వాళ్లంటే నాకు అసహ్యం కూడా. కాని సృజన అమ్మానాన్న వాళ్ల మాట ఎప్పుడూ వినలేదు. ఎంత కొట్టినా.. తిట్టినా అది వాళ్లతోనే మాట్లాడేది. ఇదిగో ఇప్పుడు ఆ అలగా జనంతో సంబంధాలు కలుపుకునే దాకా వెళ్లింది. వాడితో తిరగొద్దని అందరం చెప్పాం. అయినా వినలేదు. పైగా వాడికి బుద్ధి చెప్పమని నాన్నవాళ్లే అన్నారు. ముందు బెదిరిద్దామనే అనుకున్నా.. కాని ఇలా..’’ అని ఆగిపోయాడు. హతాశుడయ్యాడు మెహన్. ఖంగుతిన్నది సునంద.‘ వీడు మారాలంటే పోలీసులకు అప్పగించాల్సిందే సునంద’’ అంటూ ఎవరి సమాధానమూ చూడకుండా పోలీసులకు ఫోన్ చేశాడు మోహన్. రోహిత్ తేరుకుని తప్పించుకునే ప్లాన్ వేసుకునేలోపే పోలీసులు అక్కడికి వచ్చేశారు.ఏడుస్తూ చేతులతో ముఖం కప్పుకున్న సునంద భుజం మీద ఓదార్పుగా చేయి వేశాడు మోహన్.(హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఈ మధ్య తెలంగాణాల్లోనూ ఎక్కువైన పరువు హత్యల ఆధారంగా అల్లిన కథనం ఇది. వీటిని వ్యతిరేకిస్తూ హిందీలో ‘ఇషక్ జాదే’ వంటి సినిమాలూ వచ్చాయి). బాల్యం నుంచే బీజం వేయండి ! పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారన్న విషయంపై మీకు మీరే ముందే ఒక నిర్ణయానికి వచ్చేయడం తప్పు. వారేం చెప్పాలనుకుంటున్నారో చెప్పే అవకాశం ఇవ్వాలి. ప్రేమ అనేది కుల, మతాలకు అతీతం అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. అలాగే పిల్లలు తమ ప్రేమ విషయాన్ని వ్యక్తపరిస్తే, ‘వీరితో మాట్లాడొద్దు’, ‘ప్రేమించడం తప్పు’ లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మంచిది కాదు. పిల్లలతో వారిలోని చెడు గురించి మాట్లాడే ముందు మంచిని ప్రస్తావించాలి. అలాగే ఒకరితో కంపేర్ చేస్తూ మాట్లాడడం కూడా వారిపై చెడు ప్రభావం చూపిస్తుంది. కులాల ప్రస్తావన, కొందరిని తక్కువ చేసి చూడడం లాంటివి ఒక తరం నేర్చుకోకూడదంటే ఇప్పటినుంచే తల్లిదండ్రులు అలాంటి ఆలోచనలకు దూరంగా పిల్లలను పెంచాలి. వారిలో బాల్యం నుంచే సానుకూల భావనలు నింపడానికి ప్రయత్నించండి. సంతోషంగా ఉండడం అంటే ఏంటో, అలా ఉండాలంటే మనం ఏం చేయాలో వాళ్లకు అలవాటు చేస్తే బాగుంటుంది. పిల్లలతో యోగా, ధ్యానం లాంటివి చేయిస్తే, వారి ఆలోచనలు కూడా స్థిరంగా, పాజిటివ్‌గా ఉంటాయి. - డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్ – శరాది -
బిగ్‌బాస్ హోస్ట్‌పై పరువునష్టం దావా!
చెన్నై: విలక్షణ నటుడు, తమిళ బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత కమల్‌హాసన్‌పై క్రిమినల్ పరువునష్టం దావా దాఖలైంది. జూలై 14న ప్రసారమైన 'బిగ్‌బాస్' షోలో ఇసాయి వెల్లాలర్ సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ చెన్నై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం ఫిర్యాదు దాఖలైంది. ఇసాయి వెల్లాలర్ సామాజికవర్గం ప్రజలు పిల్లనగ్రోవిని దేవుడిలా భావిస్తారని, కానీ, బిగ్‌బాస్ షోలో మాత్రం పిల్లనగ్రోవిని అవమానపరుస్తూ చూపించారని, దానితో నటుడు శక్తి ఆటలాడరని, బిగ్‌బాస్ సభ్యులు పిల్లనగ్రోవిని డైనింగ్ టేబుల్‌పై పెట్టుకొని భోజనం చేశారని, వేణువుతో ఇలా వ్యవహరించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తి ఈ కేసు విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు. -
భావప్రసారాన్ని హరించకూడదు: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: పరువునష్టం చట్టాన్ని ప్రజల భావ ప్రసార స్వేచ్ఛను హరించేలా, న్యాయవ్యవస్థలో ప్రవేశించేలా ఉండకూడదని ఢిల్లీ కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. తమ పరువుకు భంగం కలిగించాడని ఆరోపిస్తూ ఫ్రాంక్ఫిన్ ఏవియేషన్ సర్వీసెస్ అనే సంస్థ ఓ విద్యార్థిపై చేసిన కేసును కోర్టు విచారించింది. పుణేకు చెందిన హరీష్ భాటియా కొడుకు ఆ సంస్థపై చీటింగ్ కేసు పెట్టాడు. ఈ సంస్థ ఢిల్లీలో తనపై అనేక తప్పుడు కేసులు పెట్టడం ద్వారా తనను ఇబ్బందులకు గురి చేస్తుందనేది కేసు సారాంశం. అయితే అతనే కావాలని సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని సంస్థ వాదిస్తోంది. కోర్టు సాక్షిగా 2014లో తమ సంస్థను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తోంది. తన కొడుకు 2008లో లెవల్–5 బీటెక్ కోసం ఈ సంస్థలో చేరాడని, ఫిబ్రవరి, 2009లో ఈ సంస్థ కోర్సు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిందని, ఫ్రాంక్ ఫిన్ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ బోగస్‌దని తేలిందని భాటియా వాదన. -
ఇవేం పరువు దావాలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నేతలపై తమిళనాడు ప్రభుత్వం వరుసగా దాఖలు చేస్తున్న పరువునష్టం దావాలపై సుప్రీంకోర్టు విస్తుపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు, మరేరాష్ట్రంలో లేని విధం గా ఇవేం పరవునష్టం దావాలు బాబోయ్ అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఎన్ని పరవునష్టం దావాలు వేసారో రెండువారాల్లోగా జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, సతీమణి ప్రేమలతపై తిరుపూరు కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది నవంబరులో తిరుపూరులో జరిగిన డీఎండీకే బహిరంగసభలో అన్నాడీఎంకే ప్రభుత్వ ఉచిత వస్తువుల పంపిణీపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పేరు ప్రతిష్టలకు భంగకరమని పేర్కొంటూ విజయకాంత్, ప్రేమలతలపై తిరుపూరు కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ఈ దావాతోపాటూ తమపై పెట్టిన పరువునష్టం కేసులన్నీ కొట్టివేయాల్సిందిగా కోరుతూ విజయకాంత్, ప్రేమలతలు డీఎండీకే తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే దాఖలు చేసిన పరువునష్టం దావా తిరుప్పూరు కోర్టులో ఈనెల 26వ తేదీన విచారణకు వచ్చింది. విజయకాంత్, ప్రేమలత కోర్టుకు హాజరుకాకపోవడంతో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది. దీంతో డీఎండీకే డిల్లీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాదైన జీఎస్ మణి బుధవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ముందు హాజరయ్యారు. అన్నాడీఎంకే తమ వారిపై వేసిన అన్ని పరువునష్టం దావాలకు సుప్రీంకోర్టు గతంలోనే స్టే మంజూరు చేసి ఉన్న స్థితిలో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. తమ పిటిషన్‌ను స్వీకరించి తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, రోకింగ్టన్ గురువారం విచారణకు స్వీకరించారు. తమిళ నాడు ప్రభుత్వ తరఫు న్యాయవాది యోగేష్‌ఖన్నా, పసంద్, జీఎస్ మణి హాజరైనారు. సుప్రీం కోర్టులో స్టే విధించి ఉండగా తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్‌ను ఎలాజారీ చేస్తుందని జీఎస్ మణి వాదించారు. పరువునష్టం దావాలపై సుప్రీం కోర్టు స్టే విధించలేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. పరువునష్టం కేసులు తమిళనాడులోనే.. ఈ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మధ్యలో కలుగజేసుకుని తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమిళనాడులో మాత్రమే ఎందుకు పరువునష్టం దావాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు బనాయించడం లేదు. తమిళనాడులో మాత్రమే ఎందుకు ఇన్ని పరువునష్టం కేసులు దాఖలవుతున్నాయి. ఇంతవరకు తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెవరిపై పరువునష్టం దావాలు వేశారో మొత్తం జాబితాను రెండువారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విజయకాంత్, ప్రేమలతలపై జారీచేసిన పీటీ వారెంట్‌పై స్టేను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసును సెప్టెంబరు 21వ తేదీకి వాయిదావేశారు. -
రాహుల్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ
-
పరువునష్టం దావా సరైందే: సుప్రీం
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా ఇండియన్ పీనల్ కోడ్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 499, 500ల కింద రెండేళ్లు జైలు శిక్ష విధించే నిబంధన కాలం చెల్లిందిగా దీనిని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు నిచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లను జస్టిస్ ఫ్రఫుల్ల సీ పంత్, దీపక్ మిశ్రా లతో కూడిన బెంచ్ విచారించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ సహేతుకమైన పరిమితులుంటాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రైవేట్ పరువు పరువు నష్టం దావా కేసులో సమన్లు జారీ అయితే ఎనిమిది వారాల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చునని, ఆసమయంలో వారికి రక్షణ ఉంటుదని కోర్టు స్పష్టం చేసింది.