షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్పై పరువు నష్టం అభియోగాలు నమోదయ్యాయి. సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు మాజీ చైర్మన్ ఆయనపై పెట్టిన కేసు నేపథ్యంలో కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ అభియోగాలు నమోదు చేసుకొని విచారణను వచ్చే అక్టోబర్ 12కు వాయిదా వేసినట్లు తెలిసింది.
పలు బహిరంగ సమావేశాల్లో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ 2000 నుంచి 2003 మధ్య కాలంలో తనకు ఇబ్బంది కలిగించారని, పరువునష్టం కలిగించారని యూనాలోని కింది స్థాయి కోర్టుకు వెళ్లారు. కానీ, ఆ కోర్టు ఆయనపై తొలుత అభియోగాలు నమోదు చేసేందుకు నిరాకరించింది. అయితే, ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం కింది స్థాయి కోర్టుకు అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరిగి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్పై కేసుకు సంబంధించి అభియోగాలు జారీ చేశారు.
ఆ సీఎంపై అభియోగాలు నమోదు
Published Tue, Sep 1 2015 9:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement