సిమ్లా: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనను నిర్లక్ష్యం చేసే ఏ ఉపాధ్యాయుడిని సహించబోమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అన్నారు. సెలవులు మంజూరు కాకుండానే పాఠశాలకు గైర్హాజరయితే వారిని పూర్తిగా డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు విద్యనందించే విషయంలో తాను రాజీపడబోనని, ఎలాంటి అవసరాలున్న అందిస్తాను కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకోనని అన్నారు.
ఆదివారం అనూహ్యంగా ఓ గ్రామాన్ని సందర్శించి అక్కడ గుమిగూడిన పెద్దలతో మాట్లాడారు. ఒక్కపాఠశాలలే కాకుండా రెవెన్యూ ఆఫీసుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు గైర్హాజరు ఎట్టి పరిస్థితుల్లో అవకూడదని అన్నారు. ఈ విషయాలపై ప్రధానంగా గ్రామ పెద్దలు, గ్రామాధికారులు పర్యవేక్షణ కలిగి ఉండాలని చెప్పారు.
'నిర్లక్ష్య టీచర్లను సహించలేను'
Published Sun, Aug 16 2015 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement