Chief Minister Virbhadra Singh
-
అసెంబ్లీని కుదిపేసిన రేప్ కేసు
సిమ్లా: బాలిక హత్యాచార కేసు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఘటనపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ పట్టుబట్టడం.. అందుకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభలో గందరగోళం నెలకొనగా, చివరకు సభ వాయిదా పడింది. జూలై మొదటి వారంలో సిమ్లా కొట్ఖాయ్ పట్టణంలో 16 ఏళ్ల బాలిక అతి దారుణంగా అత్యాచారం ఆపై హత్యకు గురైన విషయం తెలిసింది. ఘటన వెనుక ఆరుగురు సంపన్న కుటుంబానికి చెందిన యువకులు ఉన్నారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాదు నేరస్థుల ఫోటోలు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ కూడా అయ్యాయి. అయినప్పటికీ సరైన సాక్ష్యాలు లేవంటూ పోలీసులు చెబుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశం విధాన సభను కుదిపేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ అంశంపై స్పందించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదంటూ బీజేపీ ఆరోపించింది. దీనికి తోడు స్పీకర్ బ్రిజ్ బిహరి లాల్ భుటాలి కూడా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున నివేదిక వచ్చాకే చర్చించాలని సూచించటంతో ప్రతిపక్షం స్వరం పెంచి నినాదాలు చేసింది. దీంతో స్పీకర్ 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవటంతో చివరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇక సభ వాయిదాతో బీజేపీ అసెంబ్లీ బయట ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేత ప్రేమ్‌కుమార్ దుమాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోపక్క ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నా గుడియా న్యాయ మంచ్ సంఘం రేపు అసెంబ్లీ బయట నిరసనకు పిలుపునిచ్చింది. -
సీఎం రాజీనామా చేసే ప్రశ్నేలేదు
షిమ్లా: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మంత్రివర్గం బాసటగా నిలిచింది. సోమవారం ఆ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై వీరభద్ర సింగ్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించింది. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మంత్రులు తోసిపుచ్చారు. 20 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం వీరభద్ర సింగ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకత్వం కలసికట్టుగా ఆయనకు మద్దతుగా నిలిచిందని మంత్రులు చెప్పారు. -
'పాక్ జట్టుకు భద్రత కల్పించలేం'
సిమ్లా: టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈనెల 19న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌కు పాక్ ఆటగాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి భద్రతా కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరోసారి స్పష్టం చేశారు. వేదికపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పునరాలోచించాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌ను ధర్మశాలలో జరగనివ్వమని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికుల సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే. పఠాన్‌కోట్ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన సైనికులు మరణించారని, అమరవీరుల స్మారక స్థూపానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగే ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ జరగనివ్వబోమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు విదాస్పదంగా మారిన ధర్మశాల స్టేడియంను సందర్శించేందుకు పాక్ అధికారులు భారత్ చేరుకున్నారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించి పాక్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగానే టి-20 ప్రపంచకప్‌లో ధర్మశాల స్టేడియంలో పాక్ జట్టును ఆడించడంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరుగుతుందని, ఇప్పటికిప్పుడు వేదిక మార్చడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీసీసీఐ అధికారులతో పాటు పాక్ భద్రతా బృందం సభ్యులు కూడా పాల్గొంటారు. -
ధర్మశాలలోనే జరుగుతుంది..!
పాక్‌తో మ్యాచ్‌పై ఠాకూర్ ఆశాభావం న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని బీ సీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇస్తుందని అన్నారు. ‘షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న పాక్‌తో మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అనుకుంటున్నాను. సీఎం వీరభద్ర సింగ్‌తో బుధవారంనాటి సమావేశం సామరస్యంగా జరిగిం ది. మ్యాచ్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సైనిక కుటుంబాలతో ప్రభుత్వం మాట్లాడుతుంది. మంచి నిర్ణయమే వెలువడుతుందని ఆశిస్తున్నాను. బోర్డు నుంచైతే ఎలాంటి ఇబ్బంది లేదు. క్రీడల్లో రాజ కీయాలను తేవడం సరికాదు. ఈ వేదికపై మ్యాచ్ గతంలోనే నిర్ణయం జరిగింది. ఒకవేళ భద్ర తా సిబ్బంది కొరత ఉంటే కేంద్రం నుంచి తెప్పించుకోవచ్చని సీఎంకు సూచించాను. ఇక ఇక్కడ మ్యాచ్ కు అనుమతి లేకపోతే మా దగ్గర ప్లాన్ బి లేదు. ఈ చివరి క్షణంలో ఎలాంటి ప్రత్యామ్నాయం చేయలేము’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. ‘ఇక్కడ మ్యాచ్‌ను జరగనివ్వం’ సిమ్లా: పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌ను ధర్మశాలలో జరగనివ్వమని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికుల లీగ్ చీఫ్ రిటైర్డ్ మేజర్ విజయ్ సింగ్ మన్కోటియా స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన సైనికులు మరణించారని ఆయన గుర్తు చేశారు. అమరవీరుల స్మారక స్థూపానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగే ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ జరగనివ్వబోమని రాష్ట్ర టూరిజం అభివృద్ధి బోర్డు చైర్మన్ కూడా అయిన విజయ్ సింగ్ తేల్చారు. భద్రతపై హామీ ఇవ్వకుంటే వైదొలుగుతాం: పాక్ లాహోర్: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే తమ జట్టుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతపై హామీ ఇవ్వాలని, లేకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది. ‘ఐసీసీకి ఈ విషయంలో మేం ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. మా జట్టును సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. అలాగే పాక్ ఆటగాళ్లకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పాలి. లేకపోతే టి20 ప్రపంచకప్‌లో ఆడేది కష్టమే. మా ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. కానీ భారత్‌లో పరిస్థితులే మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి’ అని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు. -
సీఎంపై ఈడీ కేసు నమోదు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై మరోసారి చిక్కుల్లోపడ్డారు. తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఈ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోననా సీఎంను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా త్వరలోనే ప్రశ్నించనుంది. అవినీతి నిరోధక శాఖ ఢిల్లీ కేంద్ర కార్యాలయ సహకారంతో రాష్ట్రంలోని సిమ్లాలోని ఈడీ కార్యాలయం కేసును దర్యాప్తు చేస్తుందని ఈడీ వర్గాలు తెలిపాయి. సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి సుమారు రూ. 6.1 కోట్ల మేర అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఈ క్రమంలో ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరితోపాటు ఎల్ ఐసీ ఏజెంట్ అనంద్ చౌహాన్, అతని సోదరుడు సీఎల్ చౌహాన్ పేర్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చింది. కాగా సీబీఐ అధికారులు ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆయన ఇళ్లతోపాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో 6 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వీరభద్ర సింగ్ అరెస్టయ్యే అవకాశం ఉందని ఊహాగానాలుకూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా వీరభద్ర సింగ్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఆయన అరెస్ట్ పై స్టే విధించింది. -
'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే'
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు ఊరట కలిగింది. ఆయన అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. అక్రమంగా ఆస్తులు పోజేశారని వీరభద్రసింగ్‌పై ఆరోపణలు సీబీఐ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై భార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమను అరెస్టు చేయకుండా స్టే విధించాలని వారు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ అరెస్టుపై స్టే విధించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించిందని, ఇది అక్రమం అని పేర్కొంటూ వారిని ప్రశ్నించాలని కోర్టుకు తెలియజేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 18న తదుపరి ఉత్తర్వులు వెలువరిస్తామని, అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. -
ఆ సీఎంపై అభియోగాలు నమోదు
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై పరువు నష్టం అభియోగాలు నమోదయ్యాయి. సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు మాజీ చైర్మన్ ఆయనపై పెట్టిన కేసు నేపథ్యంలో కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ అభియోగాలు నమోదు చేసుకొని విచారణను వచ్చే అక్టోబర్ 12కు వాయిదా వేసినట్లు తెలిసింది. పలు బహిరంగ సమావేశాల్లో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ 2000 నుంచి 2003 మధ్య కాలంలో తనకు ఇబ్బంది కలిగించారని, పరువునష్టం కలిగించారని యూనాలోని కింది స్థాయి కోర్టుకు వెళ్లారు. కానీ, ఆ కోర్టు ఆయనపై తొలుత అభియోగాలు నమోదు చేసేందుకు నిరాకరించింది. అయితే, ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం కింది స్థాయి కోర్టుకు అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరిగి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై కేసుకు సంబంధించి అభియోగాలు జారీ చేశారు. -
'నిర్లక్ష్య టీచర్లను సహించలేను'
సిమ్లా: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనను నిర్లక్ష్యం చేసే ఏ ఉపాధ్యాయుడిని సహించబోమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అన్నారు. సెలవులు మంజూరు కాకుండానే పాఠశాలకు గైర్హాజరయితే వారిని పూర్తిగా డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు విద్యనందించే విషయంలో తాను రాజీపడబోనని, ఎలాంటి అవసరాలున్న అందిస్తాను కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకోనని అన్నారు. ఆదివారం అనూహ్యంగా ఓ గ్రామాన్ని సందర్శించి అక్కడ గుమిగూడిన పెద్దలతో మాట్లాడారు. ఒక్కపాఠశాలలే కాకుండా రెవెన్యూ ఆఫీసుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు గైర్హాజరు ఎట్టి పరిస్థితుల్లో అవకూడదని అన్నారు. ఈ విషయాలపై ప్రధానంగా గ్రామ పెద్దలు, గ్రామాధికారులు పర్యవేక్షణ కలిగి ఉండాలని చెప్పారు.