ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా : టీటీడీ | TTD Decision Defamation On Andhra Jyothi News Paper | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా : టీటీడీ

Published Sat, Dec 28 2019 4:21 PM | Last Updated on Sat, Dec 28 2019 5:04 PM

TTD Decision Defamation On Andhra Jyothi News Paper - Sakshi

సాక్షి, చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది. అలాగే రమణ దీక్షితులును ఆలయ ప్రధాన అర్చకుడిగా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం జరిగిన పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019-20 వార్షిక బడ్జెట్‌ కింద రూ. 3243 కోట్లకు పాలకమండలి ఆమోదం తెలిపిందని తెలిపారు. ఘాట్‌ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10 కోట్లు, టీటీడీ పరిపాలనా భవనం మరమత్తుల కోసం రూ.14.30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

‘ఘాట్‌రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం. రూ.14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. జమ్ముకశ్మీర్‌, వారణాసిలోనూ ఆలయాలు నిర్శాణం. టీటీడీ ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్‌ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తాం. 2019-20 శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు ఆదాయం సమకూరింది’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement