బిగ్‌బాస్ హోస్ట్‌పై పరువునష్టం దావా!
చెన్నై: విలక్షణ నటుడు, తమిళ బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత కమల్‌హాసన్‌పై క్రిమినల్ పరువునష్టం దావా దాఖలైంది. జూలై 14న ప్రసారమైన 'బిగ్‌బాస్' షోలో ఇసాయి వెల్లాలర్ సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ చెన్నై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం ఫిర్యాదు దాఖలైంది.
ఇసాయి వెల్లాలర్ సామాజికవర్గం ప్రజలు పిల్లనగ్రోవిని దేవుడిలా భావిస్తారని, కానీ, బిగ్‌బాస్ షోలో మాత్రం పిల్లనగ్రోవిని అవమానపరుస్తూ చూపించారని, దానితో నటుడు శక్తి ఆటలాడరని, బిగ్‌బాస్ సభ్యులు పిల్లనగ్రోవిని డైనింగ్ టేబుల్‌పై పెట్టుకొని భోజనం చేశారని, వేణువుతో ఇలా వ్యవహరించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తి ఈ కేసు విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.