కోలీవుడ్ బిగ్‌బాస్-7లోకి కోయంబత్తూరుకు చెందిన షర్మిల ఎంట్రీ దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఆమె షోలో పాల్గొనాలని తమళనాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె కామన్ ఉమెన్ అయినా ఈ మధ్య సోషల్‌మీడియాలో వెరీ పాపులర్ అయింది. అంతే కాకుండా ఆమెకు కమల్ హాసన్ మద్ధతు కూడా ఉందని బహిరంగంగానే చెప్పవచ్చు. అక్కడ కూడా ఈ షో ఆగష్టు నెలలోనే ప్రారంభం కానుంది.
షర్మిల ఎవరంటే..
తమిళనాడులోని కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలను ఎం షర్మిల(24) పొందింది. కానీ ఆమె నడిపిన బస్సులో తమిళనాడు ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లోనే ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే షర్మిల బాగా సెలబ్రటీ అయ్యారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు సోషల్ మీడియాలో ఓపెన్‌గానే కామెంట్లు చేశారు. దీంతో ఒకరోజు ఆమె నడుపుతున్న బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేశారు. దీంతో ఒక్కసారి అమె మరింత పాపులర్ అయింది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై మారుతి ట్వీట్.. ఏకిపారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్)
బస్సు కండెక్టర్ వల్ల జాబ్ పోయింది
షర్మిల కోసం ఎంపీ కనిమొళి రావడంతో అదే బస్సులో ఉన్న కండక్టర్‌కు నచ్చలేదు. దీంతో ఆమె ఎంపీ అనుచరులతో దురుసుగా ప్రవర్తించింది. దీంతో కండెక్టర్‌ను షర్మిల వారించింది. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు.అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ మరో స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయింది. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో తర్వాత చెప్పుకొచ్చింది. ఎంపీ కనిమొళి పట్ల తనతో బస్సులో ఉన్న మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేసింది.
షర్మిలకు కమల్ సాయం
వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్ షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చి కమల్ హాసన్ అందరినీ ఆశ్యర్యపరిచారు. ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతిగా అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాజాగా ఆమెకు బిగ్‌బాస్ ఎంట్రీ దాదాపు ఖాయం అని ప్రచారం జరుగుతుంది. షో ఎంట్రీ వరకు కమల్ నుంచి కచ్చితంగా సాయం అందుతుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment