పరువు నష్టం కేసులో బెయిలుకు పూచీకత్తు సమర్పించకుండా జైలుపాలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొదటిరోజు జైలులో నిద్రలేని రాత్రిని గడిపారు.
జైలులో మొదటిరోజు కేజ్రీవాల్‌కు నిద్రలేని రాత్రి
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో బెయిలుకు పూచీకత్తు సమర్పించకుండా జైలుపాలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొదటిరోజు జైలులో నిద్రలేని రాత్రిని గడిపారు. బీజేపీ నేత నితిన్ గడ్కారీ పెట్టిన పరువు నష్టం కేసులో బెయిలుకు రూ.10 వేల పూచీకత్తు సమర్పించడానికి కేజ్రీవాల్ తిరస్కరించడంతో బుధవారం ఢిల్లీలోని కోర్టు ఆయనను రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడం తెలిసిందే. తీహార్ జైలులోని 14వ వార్డులోని సాధారణ సెల్‌లో ఉన్న కేజ్రీవాల్ రాత్రంతా ఉక్కపోత, దోమల దాడి వల్ల నిద్రలేని రాత్రిని గడిపారని జైలు అధికారులు తెలిపారు.