
బెంగళూరు: అసత్య అవినీతి ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిమాండ్‌చేశారు. క్షమాపణలు చెప్పకుంటే, పరువునష్టం కింద రూ.100 కోట్లు అపరాధరుసుం చెల్లించాలని మోదీ, అమిత్‌లకు సిద్దరామయ్య లీగల్ నోటీసులు పంపించారు. అవినీతి ఆరోపణలు చేసినందుకు కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పకు సైతం సిద్దరామయ్య నోటీసులు పంపారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘ప్రతీ పనికి లంచం తీసుకునే సర్కారు’, ‘పది శాతం కమీషన్లు పొందే సర్కారు’ అని ప్రచారసభల్లో మోదీ పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం తెల్సిందే.