సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) స్కాం నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. యూపీఏ హయాంలోనే జరిగిందనీ ఈ ఉంభకోణం బీజేపీ వాదిస్తుండగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బీజీపీ వత్తాసు వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ తాజా వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. ముఖ‍్యంగా పీఎన్‌బీ మెగా స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీలో తన కుటుంబీకులకు షేర్లు ఉన్నాయన్నఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అంతేకాదు నిర్మలా సీతారామన్ చేసిన నిరాధార ఆరోపణలను ప్రచురించే అన్ని మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
వ్యక్తిగతంగా తనకు గానీ, తనభార్య, కుమారుడికిగానీ గీతాంజలి,నీరవ్ మోదీతో ఎలాంటి సంబంధాలు లేవనీ, నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలు పౌర , క్రిమినల్ సహా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి చెందిన స్థలంలో అయిదేళ్ల క్రితం నీరవ్ మోదీకి చెందిన కంపెనీ అద్దెకు తీసుకున్నారనీ, ఈ ఒప్పందం 2017 డిసెంబరుతోనే ముగిసిపోయినట్టు చెప్పుకొచ్చారు.
కాగా కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వి భార్యకు నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్లు ఉన్నాయంటూ నిర్మలా సీతారామన్ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment