
Yash Land Rover Range Rover: కన్నడ సినిమా నటుడైనప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినీ నటులలో 'యష్' ఒకరు. కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన యస్ ఇటీవల ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శాండల్‌వుడ్ హీరో యష్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర సుమారు రూ. 4 కోట్లు అని సమాచారం. నిజానికి భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా.. లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కారుని ఎగబడి కొంటుంటారు.
(ఇదీ చదవండి: ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!)
Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd
— Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023
ఇప్పటికే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డి, మెర్సిడెస్ జిఎల్‌సి 250 డి కూపే, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 520 డి, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ వంటి కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి మరో లగ్జరీ బ్రాండ్ కారు చేరింది. సెలబ్రిటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఈ బ్రాండ్ కారుని చాలా మంది ఈ కారుని కొనుగోలు చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.