Land Rover
-
ల్యాండ్ రోవర్ కారు కొన్న సిరాజ్
టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తనకెంతో ఇష్టమైన ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సిరాజ్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. కొత్త కారుతో సిరాజ్ ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ కారును తన కుటుంబం కోసం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దేవుడి ఆశీర్వాదంతో తన కలల కారును సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial)మీ కలలపై ఎలాంటి పరిమితులు ఉండవు. అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా కష్టపడి పని చేసేలా చేస్తాయి. నిలకడతో చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నా కలల కారును కొనుగోలు చేసేలా చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడికి కృతజ్ఞతలు. నిన్ను నువ్వు నమ్ముకుంటే అనుకున్నది సాధించగలవు అంటూ సిరాజ్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా, సిరాజ్ అత్యంత పేద కుటుంబం నుంచి దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, సిరాజ్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన పరిమిత ఓవర్లలో సిరీస్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. టీ20, వన్డే సిరీస్‌లలో సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. భవిష్యత్తులో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లలోనైనా సిరాజ్ ఫామ్‌ను అందుకోవాలని ఆశిద్దాం. -
మొదటిసారి భారత్‌కు రానున్న యూకే కంపెనీ.. తగ్గనున్న ఈ కార్ల ధరలు
యూకే వాహన తయారీ సంస్థ 'ల్యాండ్ రోవర్' మొదటిసారి భారతదేశంలో తన కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ల్యాండ్ రోవర్ భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల తయారీని ప్రారంభించనుంది. కంపెనీ యూకే వెలుపల తన వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. భారతదేశం బ్రాండ్‌కు కీలకమైన మార్కెట్ కావడంతోనే సంస్థ ఈ డెసిషన్ తీసుకుంది.రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కోసం ఒక కొత్త అసెంబ్లింగ్ లైన్ మహారాష్ట్రలోని పూణేలోని టాటా మోటార్స్ తయారీ కేంద్రంలో ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో ఏటా రెండు షిఫ్టులలో 10,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రేంజ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 160 శాతం పెరిగాయి. అంటే భారతీయులు రేంజ్ రోవర్ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి భారత్ ఒక ప్రధానమైన మార్కెట్ అని రేంజ్ రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ గెరాల్డిన్ ఇంఘమ్ పేర్కొన్నారు.భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు స్థానికంగా తయారైన తరువాత ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఇవి రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. -
భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ కొత్త కారు - ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ల్యాండ్ రోవర్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8' లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ. 2.01 కోట్ల నుంచి రూ. 2.80 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌తో 38.2kWh బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ట్రీట్మెంట్, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్‌లతో రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే? రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.1.3 కోట్ల కారులో బాబా రామ్‌దేవ్ - వీడియో వైరల్
ప్రముఖ యోగా గురువు 'బాబా రామ్‌దేవ్' సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 డ్రైవ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కారు ఎవరిదీ, దాని ధర ఎంత, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారుని పతంజలి CFA దివ్యాంశు కేసర్వాణి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఆటో వార్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో రామ్‌దేవ్ బాబా ఈ కారుని కొనుగోలు చేయలేదని యూపీ ఈస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్‌లోని పతంజలి గ్రూప్ సీఎఫ్ఓ ఇచ్చారని తెలిపారు. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ధర సుమారు రూ. 1.3 కోట్లు వరకు ఉంటుంది. సెడోనా రెడ్ కలర్ షేడ్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటం వీడియోలో చూడవచ్చు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే.. నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా రెండవది 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజిన్ 394 Bhp పవర్, 550 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 296 Bhp పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ & ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. View this post on Instagram A post shared by AUTO WAAR (@auto.waar) -
కొత్త లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతైనా తగ్గేదేలే!
ప్రముఖ మలయాళ నటుడు 'ఫహద్ ఫాసిల్' పేరు తెలియకపోయినా.. 'పార్టీ లేదా పుష్పా' అనే డైలాగ్ వింటే మాత్రం వెంటనే ఆయనెవరో గుర్తొచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిన నటుడు ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు. దీని ధర ఎంత? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు 'ల్యాండ్ రోవర్' (Land Rover) కంపెనీకి చెందిన 'డిఫెండర్' అని తెలుస్తోంది. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు అర్జున్ కపూర్, ప్రకాష్‌రాజ్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సునీల్ శెట్టి వంటి చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. గోండ్వానా స్టోన్ పెయింట్ స్కీమ్ కలిగిన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో డిఫెండర్ 130, డిఫెండర్ 110 & డిఫెండర్ 90 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫహద్ ఫాసిల్ డిఫెండర్ 90 కొనుగోలు చేసినట్లు చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా మూడు డోర్లు కలిగిన వేరియంట్. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 వేరియంట్ 5.0 లీటర్ వి8 ఇంజన్ కలిగి 296 హార్స్ పవర్ & 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతమైన ఈ కారు వాహన వినియోగదారులకు ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫహద్ ఫాసిల్ లంబోర్ఘిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. -
వైరల్ వీడియో: లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్
-
యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Ramdev Land Rover Defender 130: యోగా గురువు ,పతంజలి ఆయుర్వేదానికి చెందిన రామ్‌దేవ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారా? దాదాపు 1.5 కోట్ల విలువైన కారును డ్రైవ్ చేస్తున్నవీడియో ఒకటి ప్రస్తుం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు నడుపుతూ రామ్‌దేవ్ దర్జా ఒలకబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన ఇతర లగ్జరీకార్ల కలెక్షన్స్, పతంజలి సంపద హాట్‌టాపిక్‌గా నిలిచింది. లగ్జరీ కార్ల కలెక్షన్ యోగా గురు రామ్‌దేవ్ కార్ల కలెక్షన్ కూడా ఆసక్తికరం. మహీంద్రా XUV700, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ ఎవోక్ , జాగ్వార్ XJLలాంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. మహీంద్రా నుంచి ల్యాండ్ రోవర్ కి ప్రమోట్ అయ్యారంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు బాబా రామ్‌దేవ్ ఎప్పుడూ భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.రామ్‌దేవ్‌బాబా నేతృత్వంలోని పతంజలి మార్కెట్ క్యాప్ రూ. 46,000కోట్లు. (చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!) వీడియోలో కనిపిస్తున్న ఎస్యూవీ సెడోనా రెడ్ కారును రాందేవ్ కొన్నారా అనేది స్పష్టత లేదు. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్130 రేంజ్-టాపర్ అండ్ బిగ్గెస్ట్ కారు. కాగా సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ డిఫెండర్ 130 2023 ఎడిషన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయింది. డెలివరీలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వెర్షన్‌గా కొనసాగింపుగా తీసుకొచ్చిన డిఫెండర్ 130 అదే వీల్‌బేస్‌ను కలిగి ఉంది, అయితే కంపెనీ వెబ్సైట్ ప్రకారం, బాడీ 340 మిమీ పొడవు ఉంటుంది. మూడు వరుస సీట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్,మెమరీ ఫంక్షన్లతో కూడిన 14-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా లాంటి ఇతర ఫీచర్లున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్) View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) -
లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: యోగాగురు, పంతజలి ఆయుర్వేద అధినేత బాబా రామ్‌దేవ్ ఇటీవల హరిద్వార్‌లో సరికొత్త కారులో ప్రయాణించారు. ఇటీవలే విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130లో రామ్‌దేవ్ ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు వర్ణంలో ఉన్న ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల ఇండియాలో విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130 కారులో వెళ్తూ బాబా రామ్‌దేవ్ కనిపించారు. ఇండియాలో ఉన్న లాండ్ రోవర్ బ్రాండ్‌లో డిఫెండర్ 130 అత్యంత మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డోర్ ఓపెన్ చేసిన రామ్‌దేవ్.. లోపలి భాగాన్ని ఓసారి పరిశీలించారు. కొత్తగా కనిపిస్తున్న కారు డ్రైవర్ సీటులో కూర్చుని నడుపుకుంటూ వెళ్లారు. అయితే.. ఇటీవలే కొన్నట్లు కొత్తగా కనిపిస్తున్న ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) డిఫెండర్ 130 అనేది 2023 ఆరంభంలోనే విడుదలైన మోడల్ కారు. కేవలం రెడ్ కలర్లో మాత్రమే విడుదలైంది. అయితే.. ఇండియాలో ఇటీవలే దీని డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వర్షన్‌కు అడ్వాన్సుడ్‌గా డిఫెండర్ 130 విడుదలైంది. బాడీ 340 ఎంఎం పొడవు గల బాడీ ఉండటమే పాత మోడల్‌కు దీనికి ఉన్న తేడా. ఇదీ చదవండి: పరమ శివున్ని పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే..? -
వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా.. -
ఖరీదైన కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ - వైరల్ వీడియో
Yash Land Rover Range Rover: కన్నడ సినిమా నటుడైనప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినీ నటులలో 'యష్' ఒకరు. కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన యస్ ఇటీవల ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాండల్‌వుడ్ హీరో యష్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర సుమారు రూ. 4 కోట్లు అని సమాచారం. నిజానికి భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా.. లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కారుని ఎగబడి కొంటుంటారు. (ఇదీ చదవండి: ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!) Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd — Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023 ఇప్పటికే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డి, మెర్సిడెస్ జిఎల్సి 250 డి కూపే, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 520 డి, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ వంటి కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి మరో లగ్జరీ బ్రాండ్ కారు చేరింది. సెలబ్రిటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఈ బ్రాండ్ కారుని చాలా మంది ఈ కారుని కొనుగోలు చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
సెలబ్రిటీల మనసుదోచే ఆ కారు మలయాళీ స్టార్ గ్యారేజిలో
Kunchacko Boban Land Rover Defender: ప్రముఖ మలయాళీ నటుడు 'కుంచకో బోబన్' (Kunchacko Boban) ఇటీవల కొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Land Rover Defender) కొనుగోలు చేశారు. ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఇతడు దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కొనుగోలు చేసిన ఈ SUV ఇప్పుడు కుంచకో బోబన్ గ్యారేజిలో కూడా చేరింది. ఇది డిఫెండర్ 110 వెర్షన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 89.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నటుడు కొనుగోలు చేసిన ఈ కారు కస్టమైజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ పూర్తిగా బ్లాక్ కలర్ పొందింది. అయితే రూప్ మాత్రం విభిన్నమైన కలర్ పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన గ్యారేజిలో టయోటా వెల్ఫైర్, పోర్షే కయెన్, మినీ కూపర్ ఎస్ వంటి మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ఖరీదైన కార్ల జాబితాలోకి ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా చేరింది. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?) ల్యాండ్ రోవర్ డిఫెండర్ భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు బాడీ స్టైల్స్‌లో లభిస్తుంది. అవి 110 వెర్షన్, 90 వెర్షన్. 110 వెర్షన్ అనేది 5-డోర్ మోడల్ కాగా, 90 వెర్షన్ అనేది 3-డోర్ వెర్షన్. కుంచకో బోబన్ కొనుగోలు చేసిన 110 వెర్షన్ 5 డోర్ మోడల్. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఆధునిక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. డిఫెండర్ 110 అండ్ 90 వెర్షన్ల కోసం కంపెనీ 5.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఇంజిన్లు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. -
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 లాంచ్: ధర రూ. 1.30 కోట్లు
దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ తన డిఫెండర్ 130 విడుదల చేసింది. ఇది HSE, X అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.30 కోట్లు, రూ. 1.41 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇవి పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్సన్స్‌లో లభిస్తాయి. నిజానికి భారతదేశంలో విడుదలైన 130 డిఫెండర్ లైనప్‌లో పొడవైన వేరియంట్, ఇందులో మూడు వరుసలలో సీట్లు ఉంటాయి, కావున ఎనిమిది మందికి సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే పొడవుగా ఉంటుంది, దీని కోసం కంపెనీ ఇందులో పొడవైన రియర్ ఓవర్హాంగ్ అమర్చింది. ఈ కారు మూడవ వరుసకు యాక్సెస్ స్లైడింగ్ ఉంటుంది, మూడవ వరుసలో కూడా పెద్దలు సులభంగా కూర్చోవచ్చు. వెనుక రెండవ సన్‌రూఫ్ ఉండటం వల్ల ఎక్కువ లైటింగ్ లభిస్తుంది, అంతే కాకుండా ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. బూట్ స్పేస్ 2,516 లీటర్ల వరకు ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే, డిఫెండర్ 130 దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో Pivi-Pro సాఫ్ట్‌వేర్‌తో కూడిన 11.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్లెస్ ఛార్జింగ్, మెరిడియన్ ఆడియో సిస్టమ్, 14-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉంటాయి. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇవి రెండూ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. -
Land Rover : జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.సెప్టెంబర్ 30న విడుదల కానున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది. కేవలం 300 యూనిట్లే డిఫెండర్ వీ8 బాండ్ 300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. 5.0 లీటర్ సూపర్చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 386 కిలోవాట్ పవర్, 625 ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్ డార్క్ గ్రే వీల్స్‌తో ఎక్స్టెండెడ్ బ్లాక్ ప్యాక్, సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డిఫెండర్ 007 రేర్ బ్యాడ్జ్ పొందుపరిచారు. డిఫెండర్ వీ8 90 వేరియంట్ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. చదవండి: ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్! -
ఓ దొంగోడు.. పోలీసులు.. సినిమాను తలపించే సీన్!
మనం నిత్యం ఎన్నో దొంగతనాల గురించి చదువుతూనే ఉన్నాం. కొందరు పొట్టకూటి కోసం దొంగలుగా.. మారితే మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తప్పుదోవ పడతారు. అయితే కొన్ని దొంగతనాలు సినిమాలను మించి జరుగుతుంటాయి. తాజాగా బ్రిటన్‌లో ఓ కారు దొంగతనం సీన్ సినిమాను తలపించే విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. యూకే రైల్వే స్టేషన్లో ఓ దొంగ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును దొంగిలించడానికి పథకం వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని తోసేసి కారును రైలు పట్టాలపై పరుగు పెట్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, కారును పట్టాలపై కొంత దూరం పరుగు పెట్టించిన దొంగ అక్కడే వదిలేసి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఈ సీన్ గ్రాండ్ తెఫ్ట్ ఆటో (జిటిఏ) గేమ్‌ను గుర్తు చేసింది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ ఈ సీన్ కంప్యూటర్ గేమ్‌లను తలదన్నేలా ఉంది.’’ అంటూ రాసుకొచ్చాడు. Man was tekking from the police on the tracks 😭😭 pic.twitter.com/Jkp2CTuCRb — A (@Cyp_Alii) July 15, 2021 -
అదిరిపోయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వర్షన్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ కొత్త వెర్షన్‌ను బుధవారం రోజున విడుదల చేసింది. కొత్త డిస్కవరీలో న్యూ ఎల్ఈడీ హెడ్లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రెష్ ఫ్రంట్ రియర్ బంపర్లను అమర్చారు. అంతేకాకుండా కారు ఇంటిరీయర్స్‌లో న్యూ పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్తో 11.4 అంగుళాల హెచ్డి టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్‌తో ఆధునాతన కనెక్టివిటీ కల్గి ఉంది. న్యూ డిస్కవరీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది.కారులో స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం ఇంజన్లను ఏర్పాటు చేశారు. పెట్రోల్ వేరియంట్ 265 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 500ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజీల్వేరియంట్ 221 కిలోవాట్ల సామర్థ్యాన్ని 650ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్కవరీ కొత్త వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .88.06 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డిస్కవరీ ఆధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రానుంది. భారత్‌లో ల్యాండ్ రోవర్ శ్రేణిలో రేంజ్ రోవర్ ఎవోక్ (రూ .59.04 లక్షలు నుంచి), డిస్కవరీ స్పోర్ట్ (రూ .65.30 లక్షలు), డిఫెండర్ 110 (రూ .83.38 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 91.27 లక్షలు) రేంజ్ రోవర్ రూ. 2.10 కోట్లుగా ఉన్నాయి. జెఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ దర్శకుడు రోహిత్ సూరి మాట్లాడుతూ..కొత్త డిస్కవరీ, ల్యాండ్ రోవర్ కార్లలో తన సామర్ధ్యాన్ని నిలుపుకుంటూ, నూతన ఆవిష్కరణతో, లగ్జరీ లుక్‌ను అందిస్తోంది. అడ్వెంచరస్ ప్రయాణాలకు ఉత్తమమైన ఎస్యూవీ అని ఒక ప్రకటనలో తెలిపారు. -
జేఎల్ఆర్ చేతికి ‘బౌలర్’
న్యూఢిల్లీ: ఏ తరహా ప్రాంతంలోనైనా పరుగులు తీసే పెర్ఫామెన్స్ కార్లను, విడి భాగాలను, ర్యాలీ రెయిడ్ వాహనాల్ని తయారు చేసే బ్రిటన్ సంస్థ బౌలర్‌ను టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) కొనుగోలు చేసింది. ఆఫ్–రోడ్ కాంపిటీషన్ కార్లను కూడా తయారు చేసే బౌలర్ కంపెనీ ఇకపై జేఎల్ఆర్కు చెందిన స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ వ్యాపారంలో ఒక భాగం కానుంది. అయితే ఎంత మొత్తానికి ఈ సంస్థకు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం జేఎల్ఆర్ వెల్లడించలేదు. -
రేంజ్ రోవర్ వెలార్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్).. భారత్‌లోనే ఉత్పత్తి అయిన ‘రేంజ్ రోవర్ వెలార్’ అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభించింది. ఇక్కడే ఉత్పత్తి పూర్తిచేయడం వల్ల ఈ కారు ధర 15–20% మేర తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. భారత లగ్జరీ ఎస్యూవీ మార్కెట్లో గట్టి పోటీనివ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. సింగిల్ ట్రిమ్, ఆర్ డైనమిక్– ఎస్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్.. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.72.47 లక్షలుగా (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘2018 నుంచి ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా వినియోగదారులనుంచి ఈ లగ్జరీ ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోంది. ఇక్కడే ఉత్పత్తి చేయడం ద్వారా గతంలో కంటే తక్కువ ధరకు కారును అందిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
టాటా మోటార్స్ ‘బ్రేక్స్’ ఫెయిలవ్వడానికి కారణాలేంటి?
2008... ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బతో దివాలా కోరల్లోకి జారుకున్న ఫోర్డ్ మోటార్స్ తన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)ను అమ్మకానికి పెట్టింది. అప్పటివరకూ భారతీయ కార్పొరేట్లలో ఎవ్వరూ చేయనంత సాహసాన్ని టాటా గ్రూప్ అధిపతి రతన్‌టాటా చేశారు. పంతంపట్టి మరీ దాదాపు 2.3 బిలియన్ డాలర్లు(అప్పట్లో మన కరెనీప్రకారం రూ.9,300 కోట్లు) వెచ్చించి టాటా మోటార్స్ జేఎల్ఆర్ను సొంతం చేసుకుంది. అంతభారీ మొత్తం అవసరమా అన్నవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టేలా... జాగ్వార్‌పై టాటాలు లాభాల స్వారీ చేశారు. దేశీ వాహన మార్కెట్లో పోటీపడలేక ఆపసోపాలు పడుతున్న టాటామోటార్స్కు జేఎల్ఆర్ ఆతర్వాత కాలంలో నిజంగా కామధేనువే అయింది. అంతర్జాతీయంగా అమ్మకాల్లో జేఎల్ఆర్ చిరుతలా దూసుకెడుతూ మాతృసంస్థను ఆదుకుంటూ వచ్చింది. 2019... పదేళ్లు తిరిగేసరికి అంతా రివర్స్‌గేర్. ఒకప్పుడు సంస్థకు సంజీవనిలా పనిచేసిన అదే జేఎల్ఆర్... ఇప్పుడు మాతృ సంస్థను కనీవినీఎరుగని నష్టాల లోయలోకి తోసేసింది. షేరు విలువ కూడా అంతకంతకూ పాతాళంలోకి జారిపోతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు టాటామోటార్స్ ‘బ్రేక్స్’ ఫెయిల్ అవడానికి దారితీసిన కారణాలేంటి? ఎందుకిలా తలకిందులైంది? భవిష్యత్తు ఏంటి?... వీటన్నింటిపై సాక్షి బిజినెస్ ప్రత్యేక కథనం ఇది... సాక్షి, బిజినెస్ విభాగం బస్సులు, ట్రక్కులు, మిలిటరీ వాహనాల నుంచి కార్ల దాకా అన్ని రకాల వాహనాల తయారీలోలో ఉన్న టాటా మోటార్స్.. దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలు ప్రకటించడం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 26,961 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో టాటా మోటార్స్ షేరు ఇంట్రాడేలో ఏకంగా 30% కుప్పకూలింది. ఒక్క రోజులోనే సంస్థ మార్కెట్ విలువ రూ. 9,000 కోట్ల పైచిలుకు హరించుకుపోయింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)లో పెట్టుబడుల విలువను తగ్గించాల్సి రావడమే భారీ నష్టాలకు కారణంగా టాటా మోటార్స్ చెబుతోంది. ఏడాది వ్యవధిలో టాటా మోటార్స్ మార్కెట్ విలువ ఏకంగా 62% పడిపోవడం కంపెనీ దారుణ పరిస్థితికి నిదర్శనం.ప్రస్తుతం టాటా మోటార్స్ అమ్మకాల్లో 70–75 శాతం దాకా, లాభాల్లో 90 శాతం దాకా వాటా జేఎల్ఆర్దే ఉంటోంది. అయితే, గడిచిన మూడు, నాలుగు త్రైమాసికాలుగా.. అమ్మకాలు మందగిస్తుండటం, లాభాల మార్జిన్లు తగ్గుతుండటం తదితర అంశాలు జేఎల్ఆర్ తీరుపై సందేహాలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. 2016 ఆర్థిక సంవత్సరం దాకా రెండంకెల స్థాయి వృద్ధితో దూసుకెళ్లిన జేఎల్ఆర్ అమ్మకాలు ఆ తర్వాత నుంచి చాలా నెలల్లో సింగిల్ డిజిట్‌లోనే నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని కీలకమైన లగ్జరీ మోడల్స్‌ను నిలిపివేసి కొత్త వాటితో భర్తీ చేస్తుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణమంటూ కంపెనీ చెబుతున్నా.. అసలు కారణాలు ఇంకా వేరేవి చాలానే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. రాజుకున్న బ్రెగ్జిట్ కుంపటి... జేఎల్ఆర్ రాజకీయ, భౌగోళిక అనిశ్చితితో పాటు టెక్నాలజీపరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్రెగ్జిట్పరమైన ఆందోళనలతో పాటు యూరప్‌లో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతుండటం, కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు మందగిస్తుండటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధభయాలు మొదలైనవి జేఎల్ఆర్కు ప్రతికూలంగా ఉంటున్నాయి. జేఎల్ఆర్ అమ్మకాల్లో ఈ మూడు ప్రాంతాల వాటా సుమారు మూడో వంతు ఉంటుంది. మొత్తం జేఎల్ఆర్ విక్రయాల్లో చైనా మార్కెట్ వాటానే 24 శాతం పైగా ఉండేది. కానీ అక్కడ డిమాండ్ మందగిస్తుండటం సమస్యగా మారింది. చైనాలో జేఎల్ఆర్ అమ్మకాలు 42% పడిపోయాయి. సంపన్న మార్కెట్ల ఆర్థిక వ్యవస్థలు కూడా పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో లగ్జరీ, డీజిల్ వాహన విక్రయాల మందగిస్తుండటం సైతం జేఎల్ఆర్కు ప్రతికూలంగా మారుతోంది. ఇక బ్రెగ్జిట్ వివాదంతో బ్రిటన్ నుంచి ఎగుమతి చేసే కార్లపై మిగతా యూరోపియన్ యూనియన్ దేశాల్లో అధిక పన్నులు వర్తించనుండటం కూడా ప్రతికూలంగా ఉంటోంది.ఒకవేళ చెకోస్లొవేకియా ప్లాంట్ గానీ అందుబాటులోకి వస్తే .. జేఎల్ఆర్కు ఈ భారం కాస్త తగ్గొచ్చు. జేఎల్ఆర్ అమ్మకాల సరళి సైతం సమస్యలకు కొంత కారణంగా ఉంటోంది. జేఎల్ఆర్కి సంబంధించి లాండ్ రోవర్‌తో పోలిస్తే జాగ్వార్ వాహనాల విక్రయాల మార్జిన్ చాలా తక్కువ. అంతర్జాతీయంగా దిగ్గజాలైన బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్‌లతో పోటీపడాల్సి రావడమే ఇందుకు కారణం. జేఎల్ఆర్ వాహనాలు పటిష్టమైన ఎస్‌యూవీలకు మాత్రమే పేరొందాయి. అటు, టయోటా లాంటి సంస్థలతో పోలిస్తే జేఎల్ఆర్ చిన్న సంస్థ. ఇలాంటివి కేవలం ఒక ప్రత్యేక విభాగంపై మాత్రమే ఆధారపడితే ఫలితాలు ఉంటాయి. కానీ పోటీ సంస్థల తరహాలో ప్రతీ విభాగంలోకి ప్రవేశించడం, వాటిని నిర్వహించడం జేఎల్ఆర్ తలకు మించిన భారంగా మారింది. పైపెచ్చు, జాగ్వార్, ల్యాండ్రోవర్ల కార్లు ఒకదానితో మరొకటి పోటీపడుతూ సొంత గ్రూప్ వాహనాల విక్రయాలను కూడా దెబ్బతీస్తున్నాయి. ఎఫ్ పేస్ ఎస్యూవీ, రేంజ్ రోవర్ ఎవోక్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, వేలార్ లాంటివి ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమ క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా మళ్లుతోంది. అయితే, ఈ విషయంలో జేఎల్ఆర్ వ్యూహాలు మెప్పించేవిగా లేవని పరిశీలకులు అంటున్నారు. బ్రెగ్జిట్ పరిణామాలతో విదేశీ మారకంపరమైన నష్టాలు కూడా జేఎల్ఆర్ ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆదాయాలు తగ్గితే.. తదుపరి ఆవిష్కరణలపైనా, ఆపై మార్కెటింగ్‌పైనా ప్రతికూల ప్రభావాలు పడొచ్చన్నది అంచనా. కోలుకునే అవకాశాలు ఉన్నాయా.. చుట్టూరా ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న టాటా మోటార్స్‌కి దేశీ అమ్మకాలు మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. దేశీయ వ్యాపారం ఊపందుకుంటోందని, మార్కెట్ వాటా పెరుగుతుండటంతో పాటు లాభదాయకత కూడా వృద్ధి నమోదు చేస్తోందని మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. టర్నెరౌండ్ 2.0 వ్యూహం మంచి ఫలితాలే ఇస్తోందంటూ తెలిపారు. ఇక జేఎల్ఆర్లో కూడా వ్యయాల నియంత్రణ చర్యలు తీసుకోనుంది. 2.5 బిలియన్ పౌండ్ల టర్నెరౌండ్ ప్లాన్‌లో భాగంగా 4,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. కొత్త కార్ల మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడులతో ప్రత్యర్థి సంస్థలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, వ్యయాల నియంత్రణతో నష్టాలు కొంత మేర తగ్గించుకోగలిగినా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానీ అమ్మకాల గ్రాఫ్ కొంత కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జేఎల్ఆర్ అమ్మకాలు 7% క్షీణించవచ్చని, వచ్చే సారి మాత్రం లో బేస్ ఎఫెక్ట్, కొత్త ఆవిష్కరణల ఊతంతో కాస్త మెరుగ్గా ఉండొచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. కొత్త మోడల్స్, కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ లేదా హైబ్రీడ్ వాహనాలు ఎంతవరకూ క్లిక్ అవుతాయన్న దానిపై కంపెనీ టర్నెరౌండ్ ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల మాట. దేశీయంగా ట్రక్కులు, ప్యాసింజర్ కార్ల అమ్మకాలు కాస్త పెరుగుతున్నట్లు కనిపించినా.. గత త్రైమాసికంలో ట్రక్స్ విక్రయాలు అనూహ్యంగా తగ్గాయి. లిక్విడిటీ, ఫైనాన్సింగ్ సమస్యలు, వాణిజ్య విభాగంలో కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం ఆటోమొబైల్ రంగానికి సవాలుగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ తీసుకుంటున్న చర్యలు ఎంత మేర ఫలితాలిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. షేరు ఢమాల్ .. టాటా మోటార్స్ షేరు శుక్రవారం ఎన్ఎస్ఈలో ఏకంగా 29.45 శాతం పడి.. రూ.129 స్థాయిని తాకింది. సుమారు పాతికేళ్ళ తర్వాత ఇంతలా పడటం ఇదే ప్రథమం. 1993 ఫిబ్రవరి 2న షేరు 40.5 శాతం పడింది. కాగా, చివర్లో కోలుకుని 17.58 శాతం నష్టంతో రూ. 151 వద్ద క్లోజయ్యింది. ఒకే రోజున కంపెనీ మార్కెట్ విలువ రూ. 9,124 కోట్లు క్షీణించి రూ. 52,809 కోట్ల నుంచి రూ. 43,685 కోట్లకు పడిపోయింది. -
జాగ్వార్ ఎక్స్‌జేలో స్పెషల్ ఎడిషన్
టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) జాగ్వార్ ఎక్స్‌జే మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్ ఎక్స్‌జే మోడల్ మార్కెట్లోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్, జాగ్వార్ ఎక్స్‌జే50ను అందిస్తున్నట్లు జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి తెలిపారు. ఈ కారు ధర రూ.1.11 కోట్లని పేర్కొన్నారు. 3 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు కోసమే ప్రత్యేకంగా 19– అంగుళాల అలాయ్ వీల్స్‌ను రూపొందించామని చెప్పారాయన. వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవటానికి 6.2 సెకన్లు చాలని... ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ కారులో ఎయిట్– స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, తదితర ప్రత్యేకతలున్నాయి. -
మార్కెట్లోకి రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.69.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఇండియా). ఇది హెచ్ఎస్ఈ డైనమిక్ వేరియంట్ రూపంలో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.ఈ కొత్త 2 డోర్ లగ్జరీ కన్వర్టిబుల్ ఎస్‌యూవీలో 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2 లీటర్ ఇంజినియం పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ ఎస్యూవీ కన్వర్టిబుల్‌ను మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో స్థిరమైన వేగంతో వెళ్లేందుకు వీలుగా ఇందులో ఆల్ టెరైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ (ఏటీపీసీ) సిస్టమ్‌ను అమర్చామని పేర్కొన్నారు. అలాగే ఈ కారులో సరౌండ్ కెమెరా వ్యవస్థను పొందుపరిచామని తెలిపారు. దీనిసాయంతో వాహనం బయట చుట్టూ దగ్గరిగా 360 డిగ్రీల్లో చూడొచ్చన్నారు. -
జాగ్వార్ ల్యాండ్‌రోవర్ కార్ల ధరలు కట్
జీఎస్టీ ప్రభావంతో రూ. 11 లక్షల దాకా తగ్గుదల న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం కింద తగ్గే పన్ను రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌లో భాగమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెల్లడించింది. ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 10.9 లక్షల దాకా రేటును తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం జాగ్వార్ ఎక్స్ఈ సెడాన్ ధర రూ. 2 లక్షల నుంచి రూ. 5.7 లక్షల దాకా, జాగ్వార్ ఎక్స్‌జే రేటు రూ. 4 లక్షల నుంచి రూ. 10.9 లక్షల దాకా తగ్గుతాయి. అలాగే ల్యాండ్ రోవర్ మోడల్స్ అయిన డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్లపై ధరలు రూ. 3.3 లక్షలు–రూ. 7.5 లక్షల దాకా తగ్గుతాయి. రాష్ట్రాలవారీగా రేట్లపరమైన ప్రయోజనాలు మారతాయని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ మోడల్స్ ధరలు రూ. 37.25 లక్షల నుంచి రూ. 1.02 కోట్ల దాకా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే రేట్ల తగ్గుదల 12 శాతం దాకా ఉండగలదని కంపెనీ తెలిపింది. తక్షణ ప్రభావంతో తాము రేట్ల తగ్గుదల ప్రయోజనాలు అందిస్తున్నామని, ఒకవేళ జూలై 1 నుంచి జీఎస్టీ గానీ అమల్లోకి రాని పక్షంలో తగ్గిన ధరలు జూన్‌కి మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుత విధానంతో పోలిస్తే జీఎస్టీలో తక్కువ పన్ను శ్లాబ్ కారణంగా పెద్ద కార్ల ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఇండియా ఇప్పటికే తమ ఎస్యూవీ ఎకోస్పోర్ట్, సెడాన్ ఆస్పైర్, హ్యాచ్‌బ్యాక్ ఫిగోలపై రూ. 30,000 దాకా డిస్కౌంట్లు ప్రకటించింది. అటు జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సైతం ధరలు తగ్గించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాలు మొదలైన ఆఫర్లు ప్రకటించాయి. -
‘దేశీ’ జాగ్వార్ ఎక్స్ఎఫ్ @ 47.5 లక్షలు
న్యూఢిల్లీ: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా దేశీయంగా తయారు చేసిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.47.50 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ కారు రెండు వేరియంట్లలో లభి స్తుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తెలిపింది. 2–లీటర్ ఇంజినియమ్ డీజిల్, 2 లీటర్ పెట్రోల్ వేరియంట్లలలో ఈ కారు లభిస్తుందని కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. 2009లో ఈ కారును భారత్‌లోకి తెచ్చామని, మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. 26 సెం.మీ. టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతిక ఫీచర్లున్నాయని వివరించారు. ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా కంపెనీ నాలుగు మోడళ్లను ఎఫ్–టైప్(ప్రారంభ ధర రూ.1.25 కోట్లు), ఎక్స్‌జే(ధర రూ.99.99 లక్షలు),ఎఫ్–పేస్(రూ.68.40 లక్షలు), ఎక్స్ఈ(రూ.39.90 లక్షలు).. భారత్‌లో విక్రయిస్తోంది. -
కార్ లవర్స్‌కు పండగే!
-
టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు 11% అప్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు మార్చి నెలలో వృద్ధి చెందాయి. జాగ్వార్ లాండ్ రోవర్(జేఎల్ఆర్)తో సహా గ్లోబల్ వాహన విక్రయాలు 11% వృద్ధితో 1,18,750 యూనిట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,06,595 యూనిట్లుగా ఉన్నాయని టాటా మోటార్స్ బీఎస్ఈకి నివేదించింది. ఇక ప్యాసెంజర్ వాహన విక్రయాలు 8% వృద్ధితో 68,109 యూనిట్ల నుంచి 73,515 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. లగ్జరీ బ్రాండ్ జేఎల్ఆర్ వాహన విక్రయాలు 22 శాతం వృద్ధితో 52,736 యూనిట్ల నుంచి 64,579 యూనిట్లకు ఎగశాయని పేర్కొంది. -
సప్టెంబర్‌లో ల్యాండ్ రోవర్ కొత్త ‘డిస్కవరీ స్పోర్ట్’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ కొత్త ప్రీమియం ఎస్యూవీ వెహికల్ ‘డిస్కవరీ స్పోర్ట్’ను సెప్టెంబర్ 2న మార్కెట్లోకి తీసుకువస్తోంది. రిటైలర్లు వీటి బుకింగ్స్ ప్రారంభించారు. ల్యాండ్ రోవర్ ఉత్పత్తుల విస్తరణలో ‘డిస్కవరీ స్పోర్ట్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో ల్యాండ్ రోవర్ వాహనాలు 22 ఔట్‌లెట్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.