దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ తన డిఫెండర్ 130 విడుదల చేసింది. ఇది HSE, X అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.30 కోట్లు, రూ. 1.41 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇవి పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్సన్స్‌లో లభిస్తాయి.
నిజానికి భారతదేశంలో విడుదలైన 130 డిఫెండర్ లైనప్‌లో పొడవైన వేరియంట్, ఇందులో మూడు వరుసలలో సీట్లు ఉంటాయి, కావున ఎనిమిది మందికి సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే పొడవుగా ఉంటుంది, దీని కోసం కంపెనీ ఇందులో పొడవైన రియర్ ఓవర్‌హాంగ్ అమర్చింది.
ఈ కారు మూడవ వరుసకు యాక్సెస్ స్లైడింగ్ ఉంటుంది, మూడవ వరుసలో కూడా పెద్దలు సులభంగా కూర్చోవచ్చు. వెనుక రెండవ సన్‌రూఫ్ ఉండటం వల్ల ఎక్కువ లైటింగ్ లభిస్తుంది, అంతే కాకుండా ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. బూట్ స్పేస్ 2,516 లీటర్ల వరకు ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే, డిఫెండర్ 130 దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో Pivi-Pro సాఫ్ట్‌వేర్‌తో కూడిన 11.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, మెరిడియన్ ఆడియో సిస్టమ్, 14-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉంటాయి.
కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇవి రెండూ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment