defenders
-
లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: యోగాగురు, పంతజలి ఆయుర్వేద అధినేత బాబా రామ్‌దేవ్ ఇటీవల హరిద్వార్‌లో సరికొత్త కారులో ప్రయాణించారు. ఇటీవలే విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130లో రామ్‌దేవ్ ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు వర్ణంలో ఉన్న ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల ఇండియాలో విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130 కారులో వెళ్తూ బాబా రామ్‌దేవ్ కనిపించారు. ఇండియాలో ఉన్న లాండ్ రోవర్ బ్రాండ్‌లో డిఫెండర్ 130 అత్యంత మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డోర్ ఓపెన్ చేసిన రామ్‌దేవ్.. లోపలి భాగాన్ని ఓసారి పరిశీలించారు. కొత్తగా కనిపిస్తున్న కారు డ్రైవర్ సీటులో కూర్చుని నడుపుకుంటూ వెళ్లారు. అయితే.. ఇటీవలే కొన్నట్లు కొత్తగా కనిపిస్తున్న ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) డిఫెండర్ 130 అనేది 2023 ఆరంభంలోనే విడుదలైన మోడల్ కారు. కేవలం రెడ్ కలర్లో మాత్రమే విడుదలైంది. అయితే.. ఇండియాలో ఇటీవలే దీని డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వర్షన్‌కు అడ్వాన్సుడ్‌గా డిఫెండర్ 130 విడుదలైంది. బాడీ 340 ఎంఎం పొడవు గల బాడీ ఉండటమే పాత మోడల్‌కు దీనికి ఉన్న తేడా. ఇదీ చదవండి: పరమ శివున్ని పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే..? -
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 లాంచ్: ధర రూ. 1.30 కోట్లు
దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ తన డిఫెండర్ 130 విడుదల చేసింది. ఇది HSE, X అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.30 కోట్లు, రూ. 1.41 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇవి పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్సన్స్‌లో లభిస్తాయి. నిజానికి భారతదేశంలో విడుదలైన 130 డిఫెండర్ లైనప్‌లో పొడవైన వేరియంట్, ఇందులో మూడు వరుసలలో సీట్లు ఉంటాయి, కావున ఎనిమిది మందికి సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే పొడవుగా ఉంటుంది, దీని కోసం కంపెనీ ఇందులో పొడవైన రియర్ ఓవర్హాంగ్ అమర్చింది. ఈ కారు మూడవ వరుసకు యాక్సెస్ స్లైడింగ్ ఉంటుంది, మూడవ వరుసలో కూడా పెద్దలు సులభంగా కూర్చోవచ్చు. వెనుక రెండవ సన్‌రూఫ్ ఉండటం వల్ల ఎక్కువ లైటింగ్ లభిస్తుంది, అంతే కాకుండా ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. బూట్ స్పేస్ 2,516 లీటర్ల వరకు ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే, డిఫెండర్ 130 దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో Pivi-Pro సాఫ్ట్‌వేర్‌తో కూడిన 11.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్లెస్ ఛార్జింగ్, మెరిడియన్ ఆడియో సిస్టమ్, 14-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉంటాయి. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇవి రెండూ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. -
డిస్నీ హాట్‌స్టార్‌లో 6 కొత్త వెబ్ సిరీస్‌లు.. ఎప్పుడంటే ?
These 6 Marvel Series Will Stream On Disney Plus Hotstar: మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎమ్‌సీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే పేరు ఉంది. ఇటీవల మార్వెల్ నుంచి 28వ చిత్రంగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతేకాకుండా మరోవైపు మిస్ మార్వెల్ (Ms Marvel) సిరీస్‌తో బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే తర్వాత వచ్చే ఎమ్‌సీయూ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. వారికోసం మార్వెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శించనున్నారు. ఏకంగా 6 మార్వెల్ సిరీస్‌లు మే 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సిరీస్‌లు ఏంటో చూసేయండి. చదవండి: ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే.. 1. డేర్ డెవిల్ (Daredevil) 2. జెస్సికా జోన్స్ (Jessica Jones) 3. ఐరన్ ఫిస్ట్ (Iron Fist) 4. పనిషర్ (Punisher) 5. ల్యూక్ కేజ్ (Luke Cage) 6. డిఫెండర్స్ (Defenders) -
Land Rover : జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.సెప్టెంబర్ 30న విడుదల కానున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది. కేవలం 300 యూనిట్లే డిఫెండర్ వీ8 బాండ్ 300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. 5.0 లీటర్ సూపర్చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 386 కిలోవాట్ పవర్, 625 ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్ డార్క్ గ్రే వీల్స్‌తో ఎక్స్టెండెడ్ బ్లాక్ ప్యాక్, సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డిఫెండర్ 007 రేర్ బ్యాడ్జ్ పొందుపరిచారు. డిఫెండర్ వీ8 90 వేరియంట్ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. చదవండి: ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్! -
మీరే..దేశ రక్షకులు
విద్యానగర్(గుంటూరు): దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారా.. దేశ రక్షణ దళంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారా..? అలాంటి వారి కోసం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహధారుఢ్యం, శరీర కొలతలు, పోలీస్ వెరిఫికేషన్, వైద్య, రాత పరీక్ష విధానాల ద్వారా ఎంపిక చేస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్, టెక్నికల్ క్యాటగిరీల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 500 పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ జరుగుతున్నట్లు రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ అఫ్సర్ జాఫ్రి తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు అనే వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్ష విధానం.. 1.6 కిలోమీటర్ల పరుగుపందెం 6 నిమిషాల 20 సెకన్లలోపు పూర్తి చేయాలి. 9 అడుగుల లాంగ్‌జంప్, పుష్అప్స్ కనీసం 6 తీయాలి. ఒక కడ్డీపై నిలబడి బ్యాలెన్స్‌గా చేతులు చాపి నడవాలి. సోల్జర్ జనరల్ డ్యూటీలో 1.6 కిలోమీటర్ల పరుగు పందేన్ని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 5 నిముషాల 20 సెకన్లలోపు, రెండవ గ్రూపు 6 నిముషాలలోపు పూర్తి చేయాలి. ఫిజికల్ టెస్ట్‌లో ఎంపికైనవారు అనంతరం మెడికల్, రాతపరీక్షకు హాజరుకావాలి. రాత పరీక్షలో సమాధానాల్లో ప్రతి తప్పునకు నాలుగవ వంతు మార్కు కట్ చేస్తారు.