
మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎమ్‌సీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే పేరు ఉంది. ఇటీవల మార్వెల్ నుంచి 28వ చిత్రంగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ప్రేక్షకులను అలరిస్తోంది.
These 6 Marvel Series Will Stream On Disney Plus Hotstar: మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎమ్‌సీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే పేరు ఉంది. ఇటీవల మార్వెల్ నుంచి 28వ చిత్రంగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతేకాకుండా మరోవైపు మిస్ మార్వెల్ (Ms Marvel) సిరీస్‌తో బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇదిలా ఉంటే తర్వాత వచ్చే ఎమ్‌సీయూ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. వారికోసం మార్వెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శించనున్నారు. ఏకంగా 6 మార్వెల్ సిరీస్‌లు మే 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సిరీస్‌లు ఏంటో చూసేయండి.
చదవండి: ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే..
1. డేర్ డెవిల్ (Daredevil)
2. జెస్సికా జోన్స్ (Jessica Jones)
3. ఐరన్ ఫిస్ట్ (Iron Fist)
4. పనిషర్ (Punisher)
5. ల్యూక్ కేజ్ (Luke Cage)
6. డిఫెండర్స్ (Defenders)