daredevil
-
డిస్నీ హాట్‌స్టార్‌లో 6 కొత్త వెబ్ సిరీస్‌లు.. ఎప్పుడంటే ?
These 6 Marvel Series Will Stream On Disney Plus Hotstar: మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎమ్‌సీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే పేరు ఉంది. ఇటీవల మార్వెల్ నుంచి 28వ చిత్రంగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతేకాకుండా మరోవైపు మిస్ మార్వెల్ (Ms Marvel) సిరీస్‌తో బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే తర్వాత వచ్చే ఎమ్‌సీయూ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. వారికోసం మార్వెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శించనున్నారు. ఏకంగా 6 మార్వెల్ సిరీస్‌లు మే 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సిరీస్‌లు ఏంటో చూసేయండి. చదవండి: ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే.. 1. డేర్ డెవిల్ (Daredevil) 2. జెస్సికా జోన్స్ (Jessica Jones) 3. ఐరన్ ఫిస్ట్ (Iron Fist) 4. పనిషర్ (Punisher) 5. ల్యూక్ కేజ్ (Luke Cage) 6. డిఫెండర్స్ (Defenders) -
చైనా సూపర్ మ్యాన్ ఊ యాంగ్నింగ్ దుర్మరణం
-
ఈ వీడియో చూస్తే గుండె ఆగుడే!
మాస్కో: రకరకాల ఫీట్లతో చాలామంది ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో కొంతమంది ఆశ్చర్యపోయేలా ఫీట్లు చేస్తే మరికొందరు ఔరా అనిపిస్తారు. ఇంకొందరు మాత్రం మహాద్భుతం ఇంత గొప్పగా చేయడం ఎవరివల్ల కాదు అని అనుకునేలా చేస్తారు. కానీ, రష్యాకు చెందిన ఒలెగ్ షెర్స్టీయాకెంకో అనే ఓ డేర్ డెవిల్ ఫీటర్.. మాత్రం ఇతడికేం పోయే కాలమా అన్నట్లుగా సాహసాలు చేశాడు. అత్యంత ఎత్తైన ఆకాశ హార్మ్యాలపై సాధారణం నిల్చుని కిందికి చూడటమే అరుదు.. దాని మీద నడవగలగడం గుండెలు జారిపడే సాహసం అలాంటిది.. ఏకంగా కోతి గంతులు వేస్తే, అదీకాకుండా ఆ అంచులపై శీర్షాసనం వేయగలిగితే దానికి ఇక ఏ పేరు పెట్టాలి. ఒలెగ్ మాత్రం అలాగే చేశాడు. రష్యాకు చెందిన ఇతగాడు పెద్ద పెద్ద భవన అంచులపై కుప్పిగంతులు వేయడంతోపాటు సైకిల్‌తో సవారీలు చేశాడు. నేరుగా దాని అంచుపై తలకిందులుగా శీర్షాసనం వేసి ఒళ్లుగగుర్పొడిచేలా చేశాడు. ఇప్పటికే ఈతడు ఇలాంటివి ఎన్నో చేసినప్పటికీ ఇది మాత్రం వాటన్నింటికంటే కూడా చాలా భయంకరమైన ఫీట్.. దీనిని చూస్తున్నవారెవ్వరికైనా దాదాపు గుండె ఆగినంత పనై పోతుంది. కొంతమంది అతడి సాహసాన్ని మెచ్చుకుంటుండగా ఇంకొందరు మాత్రం జీవితంపట్ల ఎందుకంత నిర్లక్ష్యం అంటూ చురకలంటించారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. -
అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..
షాంఘై: సహజంగా ఓ పెద్ద భవంతి పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూడాలంటేనే గుండెలు జారీ పడినట్లు అనిపిస్తుంది. అలాంటిది వందల మీటర్లు ఎత్తున్న భవనం.. దానిపైన ఓ సన్నటి పిల్లర్ లాంటి నిర్మాణంపైకి ఎక్కి దానిపైన నిల్చోవడమే కాకుండా తాపీగా కూర్చుని కాళ్లు ఊపుకుంటూ కింద చీమల్లాగా కదులుతున్న బస్సులను, పిట్టగూళ్లలా కనిపిస్తున్న ఇళ్లను చూసి ఓ వీడియోకు ఫోజిస్తే.. షాంఘైలో ఓ యువకుడు ఇలాగే అదిరిపడే సాహసం చేశాడు. షాంఘైలోని పెద్ద భవనంపైకి ఎక్కి దానిపైన ఉన్న ఓ పిల్లర్ లాంటి నిర్మాణం చివర వరకు ఎలాంటి సహాయం రక్షణ కవచాలు లేకుండానే పాకేసి హాయిగా కూర్చున్నాడు. అనంతరం ఓ వీడియోకు పోజిచ్చాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. అయితే, అతడు అంత ఎత్తు ఎక్కిన తర్వాత కూడా అతడికి ఇంకా సంతోషంకలగలేదంట. అందుకే అతడు మరో ఎత్తయిన నిర్మాణం ఎక్కబోతున్నాడంట.