అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో.. | Daredevil free climbs Shanghai skyscraper to get a better view | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..

Published Mon, Jun 13 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..

అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..

షాంఘై: సహజంగా ఓ పెద్ద భవంతి పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూడాలంటేనే గుండెలు జారీ పడినట్లు అనిపిస్తుంది. అలాంటిది వందల మీటర్లు ఎత్తున్న భవనం.. దానిపైన ఓ సన్నటి పిల్లర్ లాంటి నిర్మాణంపైకి ఎక్కి దానిపైన నిల్చోవడమే కాకుండా తాపీగా కూర్చుని కాళ్లు ఊపుకుంటూ కింద చీమల్లాగా కదులుతున్న బస్సులను, పిట్టగూళ్లలా కనిపిస్తున్న ఇళ్లను చూసి ఓ వీడియోకు ఫోజిస్తే.. షాంఘైలో ఓ యువకుడు ఇలాగే అదిరిపడే సాహసం చేశాడు.

షాంఘైలోని పెద్ద భవనంపైకి ఎక్కి దానిపైన ఉన్న ఓ పిల్లర్ లాంటి నిర్మాణం చివర వరకు ఎలాంటి సహాయం రక్షణ కవచాలు లేకుండానే పాకేసి హాయిగా కూర్చున్నాడు. అనంతరం ఓ వీడియోకు పోజిచ్చాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. అయితే, అతడు అంత ఎత్తు ఎక్కిన తర్వాత కూడా అతడికి ఇంకా సంతోషంకలగలేదంట. అందుకే అతడు మరో ఎత్తయిన నిర్మాణం ఎక్కబోతున్నాడంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement