climb
-
ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే
ఖాట్మాండు: అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలుగంటుంటారు. అలాంటి వారికి నేపాల్ ప్రభుత్వం ఒక చేదువార్త వినిపించింది. ఇకపై ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అత్యంత ఖరీదైనదిగా మారబోతోంది.ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి విదేశీయులు ఇకపై దాదాపు 21 లక్షల రూపాయలు, అంటే ఐదు లక్షల నేపాలీ రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు ఇందుకోసం రూ. 15,17,780 రుసుము చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు దానిని రూ. 20,69,676కి పెంచారు.నేపాల్ ప్రభుత్వం పర్వతారోహణ మాన్యువల్‌ను ఆరోసారి సవరించింది. ఇటీవల జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశంలో పర్వతారోహణ నియమాలను సవరిస్తూ, అధిరోహణ రుసుమును పెంచింది. ఈ కొత్త నియమం 2025, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్మి మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల కారణంగా చెత్త పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త సవరణల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులకు బీమా, ఇతర నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పర్వతారోహణ గైడ్లు, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, సామాను క్యారియర్లకు రోజువారీ భత్యం, బీమా రేట్లు పెంచారు. నూతన రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఎవరెస్ట్ ఎక్కే అధిరోహకులు తమ పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వశాఖకు సమర్పించాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది? -
'స్పైడర్ విమెన్': జస్ట్ ఒట్టి చేతులతో అవలీలగా వంద మీటర్లు..!
మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణించి చూపిస్తున్నారు. సాధ్యం కానీ ప్రతి పనిని నారీ శక్తితో సాధించగలమని చాటి చెబుతున్నారు. సరిగ్గా అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ.చైనాలో 43 ఏళ్ల షాన్డాంగ్ మహిళ ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా అవలీలగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్నే అధిరోహించింది. దాదాపు 30 అంతస్తులకు సమానమైన 108 మీటర్ల ఎతైన కొండను అధిరోహించి రికార్డు సృష్టించింది.. ఆమె నిలువు రాతి మీదుగా చాలా సునాయాసంగా ఎక్కేయగలదు. అక్కడ ఆమె మగ స్పైడర్ పీపుల్లోని ఏకైక మహిళ. జస్ట్ ఒట్టి చేతులతో శిఖరాలను ఎక్కేస్తుంది . ఆమె తన తండ్రి మార్గదర్శకత్వంలో సుమారు 15 ఏళ్ల వయసులో ఈ ఎతైన కొండను అధిరోహించడం ప్రారంభించింది. అంతేగాదు చిన్నతనంలో తాను అబ్బాయిలతో పోటీ పడి మరీ ఔషధ మూలికలు తెచ్చేందుకు కొండలపైకి ఎక్కడం నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందక మునుపే తాను పక్షుల వ్యర్థాలు వంటివి సేకరించడం కోసం ప్రతి రోజు పర్వతాలను ఎక్కేదాన్ని అని చెప్పింది షాన్డాంగ్. నిజానికి మియావో ప్రజలు సాంప్రదాయకంగా మారుమూల పర్వత ప్రాంతాలలో నివసిస్తారు. అందువల్లే వారు ఒట్టి చేతులతో ఈజీగా ఎక్కేయగలరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకరకంగా ఒట్టి చేతులతో పర్వతాన్ని అధిరోహించడంలో వారికి సాటి లేరు. అక్కడ ప్రజలకు ఇది తరతరాలుగా వచ్చిన సంప్రదాయం. అయితే తనను అందరూ స్పైడర్ మహిళగా పిలుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెబుతోంది. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో ..నెటిజన్ల సదరు మహిళని హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. పోస్టులుపెట్టారు. (చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!..పాపం ఆ ప్రయాణికుడు..
విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్‌గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్ కాక్‌పీట్ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ శాన్ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డింగ్ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్లు ఆన్‌బోర్డ్‌లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్ లావేటరీ డోర్‌ని తెరిచాడు. అంతే ఒక్కసారిగా విమానం డోర్ లాక్ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు. ఇంతలో మరో ట్రిప్‌కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్ డెక్ కాక్‌పీట్ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్ రోడ్ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్‌లైన్స్ ట్విట్టర్లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది. No joke… yesterday last passenger got off plane with no one else on board, he shut the door. Door locked. Pilot having to crawl through cockpit window to open door so we can board. @SouthwestAir pic.twitter.com/oujjcPY67j — Matt Rexroad ✌🏼🇺🇸 (@MattRexroad) May 25, 2023 (చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!) -
62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు
అనుకున్నది చేయాలన్న కృత నిశ్చయం, తపన ఉంటే చాలు. అందుకు వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది లేటు వయసులో చదువుకుని పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఉన్నారు. మరికొద్దిమంది కాస్త ముందడుగు వేసి వృద్ధాప్యలో ఉండి కూడా మారథాన్, బాక్సింగ్ వంటివి నేర్చుకుని శభాష్ అని ప్రశంసలు అందుకున్నారు. అలాంటివారి కోవకు చెందినవారే కేరళలోని 62 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఆమె ఏం సాహసం చేసిందో తెలుసా!. వివరాల్లోకెళ్తే...బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) - అగస్త్యర్కూడమ్ను అధిరోహించింది. ఆమె ఈ పర్వతారోహణ చేసేందుకు తన కొడుకు, స్నేహితులతో కలిసి బెంగుళూరు నుంచి కేరళకు వచ్చినట్లు తెలిపింది. అంతేకాదు నాగరత్నమ్మ గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోయానని పేర్కొంది. ఇప్పుడు తన పిల్లలందరూ స్థిరపడ్డారు కాబట్టి పర్వతారోహణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ అగస్త్యర్కూడమ్కు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారిపై లింగ ఆధారిత పరిమితులు విధించబడదని కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ మహిళలు పర్వత శ్రేణి ట్రెక్కింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. పైగా అగస్త్యర్కూడం కేవలం ట్రెక్కింగ్ శ్రేణి మాత్రమే కాదు, నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన పుణ్యక్షేత్రం కూడా. ఈ మేరకు ఆ బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ని చూసి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Vishnu (@hiking_._) (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
అవాక్కయ్యే వీడియో.. అంతపైకి బైక్
ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయాక సోషల్ మీడియాలో సరదా, సందేశాత్మక వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. కాస్త ఫన్నీగా ఉన్నా సరే ఆ వీడియోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలకు సంబంధించిన వీడియోలను కూడా తెగ లైక్ చేస్తున్నారు. తాజాగా జిష్ణు అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అది ఎక్కడా, అది ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి తన తలపై బైక్‌ను పెట్టుకొని బస్సు మీదకు ఎక్కించాడు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, తన తలపై పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని నిచ్చెన సాయంతో బస్సు పైకి ఎక్కి సురక్షితంగా బైక్‌ను దించాడు. దీనికి సంబంధించిన వీడియోను జిష్ణు అనే వ్యక్తి తన ట్విటర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇక దీనినే బ్యాలెన్సింగ్ అంటారని ఓ నెటిజన్ పేర్కొనగా.. ఈ వీడియోను జాన్ అబ్రహంకు చూపించాలంటూ మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. -
బస్సు పైకి బైక్..
-
తెలంగాణ శిఖరం
-
భళా అనిపించిన సాహస 'జ్యోతి'
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట) : కృషి..పట్టుదల ఉంటే అసాధ్యాన్ని..సుసాధ్యం చేయడం పెద్దగా లెక్కకాదు. అని నిరూపించింది వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి. రాష్ట్రంలోనే కిలిమాంజారోని పర్వత శ్రేణిని అధిరోహించిన మొదటి మహిళా ఉద్యోగిణిగి నిలిచింది. అత్యంతం కష్టమైనదక్షిణ ఆఫ్రికా ఖండంలోని టాంజానీయా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతాలను అధిరోహించి దేశం ఖ్యాతిని చాటింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పర్వత శ్రేణి కిలీమాంజారో పర్వతాలు. సముద్రమట్టానికి 5895మీటర్ల ఎత్తులో ఉంది. ఎన్నో శారీరిక, మానసికి సమస్యలను తట్టుకుని ధృడ సంకల్పంతో పర్వతాన్ని అధిరోహించడం ఓ అద్భుత సాహసం. 2017 డిసెంబర్ 22 న పర్వతారోహణ ప్రారంభించిన జ్యోతి కఠిన పరిస్థితుల్లోను ముందుగా మందార, హురంభో, కిబో పర్వతాలను రెండు రోజుల్లో అధిరోహించింది.25 న అత్యంత క్షిష్టమైన గిల్మస్, స్టెల్లా,హురు పర్వత శిఖరాలను అధిరోహించి కిలీమంజారో యాత్రను విజయవంతం చేసింది. కిలీమంజారోను అధిరోహించిన మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగిగా జ్యోతి నిలిచింది. అంత ఎత్తులో ఎత్తులో భారత జాతీయ పతాకాన్ని, తెలంగాణ చిత్ర పటం, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించింది. పీఈటీ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో నాయీబ్రాహ్మణ కుటుంబం ఏల్దీ గంగయ్య పద్మ దంపతులకు కూతురు జ్యోతి. పేదకుటుంబంకావడంతో తల్లిదండ్రులకు అండగా ఉంటూ చదువుకుంటూ బడిలో పీఈటీ ఏర్వ అశోక్ ప్రోత్సాహంతో క్రీడల్లో రాణించింది. 2012 డీయస్సీలో మంచి ర్యాంక్ సాధించి వ్యాయామ ఉపాధ్యాయురాలుగా నియమితురలైంది. ప్రస్తుతం జ్యోతి దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ హైస్కూల్లో పీఈటీగా సేవలందిస్తుంది. -
అందరి దృష్టిని ఆకర్షించిన రకూన్
-
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన విద్యార్థులు
-
తల్లి ఎలుగుబంటు తాపత్రయం
-
కిలిమంజారో అధిరోహణకు దరఖాస్తులు
కర్నూలు(హాస్పిటల్): ఆఫ్రికా ఖండంలో అత్తి ఎత్తయిన కిలిమంజారో శిఖర అధిరోహణ యాత్ర కోసం రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ యువతీయువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌వలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 10 మంది ఔత్సాహికులను ఎంపిక చేస్తారు. 13 జిల్లాల నుంచి ఎంపికైన 130 మందికి పర్వతారోహణ, ఆరోగ్యపరీక్షలు, ప్రవర్తన మొదలైన వాటిపై నాలుగురోజులపాటు విజయవాడలో శిక్షణ ఇస్తారు. అనంతరం అందులో 60 మందిని ఎంపిక చేస్తారు. ఈ 60 మంది నుంచి ఆరోగ్యం, నడవడికల ఆధారంగా 20 మంది ఎస్సీ, 20 మంది ఎస్టీ వారిని ఎంపిక చేసి ఏప్రిల్, జూన్ మధ్యలో శిఖర అధిరోహణకు పంపిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి కల్గినవారు ఈ నెల 30వ తేదీలోగా సెట్కూరు కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు తీసుకుని పూర్తి చేసి సమర్పించాలి. వివరాలకు సెట్కూరు కార్యాలయంలో నేరుగా గానీ, ఫోన్(08518230140/229146)లో కాని సంప్రదించవచ్చు. -
పైకెగిసిన ఆయిల్ ధరలు
సింగపూర్ : వరుసగా రెండో రోజు క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగిశాయి. ఒపెక్, ఇతర దిగ్గజ ఉత్పత్తిదారుల మధ్య ఆయిల్ ఉత్పత్తిలో కోతపై సమావేశం జరుగనున్న నేపథ్యంలో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలోనే బంగారం ధరలు కిందకి పడిపోయాయి. వియెన్నాలో శనివారం ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ 14 దేశాల మధ్య భేటీ జరుగబోతోంది. వీరిమధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యారెల్ క్రూడ్ ధర సమారు 51 డాలర్లకు ఎగిసినట్టు విశ్లేషకులు చెప్పారు.. ఇప్పటికే ఒపెక్ సభ్యులు ఉత్పత్తికోతలో ఓ అంగీకారానికి రాగా, నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో 0.6 మిలియన్ బ్యారెళ్లు కోత విధించనున్నట్టు తెలుస్తోంది. ఆయిల్ మార్కెట్ సమతుల్యం కోసం ఒపెక్ సభ్యులు 2008 తర్వాత మొదటిసారి ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు ప్రకటించారు. ఒకవేళ నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు చెబితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ధరలు 60 డాలర్లకు వచ్చిన సందేహం లేదని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి మంచి వారంగా నమోదవుతున్న ఆసియా ఈక్విటీ స్టాక్స్ చివరిలో హెచ్చుతగ్గులకు గురయ్యాయి. బాండ్లు, కొరియన్ ఓన్ పడిపోగా, డాలర్ బలపడింది. -
వెండి ధరలు ఒక్కసారిగా జూమ్
ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ లో వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో వెండి కిలో రూ 602 లు పెరిగింది. ఫెడ్ అంచనాల నేపథ్యంలో ఇటీవల విలువలైన మెటల్స్ బంగారం, వెండి ధరలు నేల చూపులు చూశాయి. 40వేల దిగువకు పడిపోయాయి. అయితే గ్లోబల్ సానుకూల అంచనాలతో మదుపర్ల భారీ కొనుగోళ్లకు దిగారు. ప్రస్తుతం కిలో వెండి రూ 41.100 పలుకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ డిసెంబర్ డెలివరీ (511 లాట్ల బిజినెస్ టర్నోవర్) వెండి కిలో 1.49 శాతం పెరిగి రూ 41,100 వద్ద ఉంది. మార్చి 2017 లో డెలివరీ (69 లాట్ల) 1.44 శాతం పెరిగివరూ రూ 41,672 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ,వెండి 2.91 శాతం పెరిగింది. సింగపూర్ లో ఔన్స్ సిల్వర్ ధరలు 16. 79 డాలర్లుగా ఉంది. అటు డాలర్ కొద్దిగా వెనక్కి తగ్గడంతో బంగారం ధరలు కూడా పుంజుకున్నాయి. ఇటీవల తొమ్మిదిన్నర నెలల కనిష్టానికి పతనమైన పసిడి ధరలు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ.204 లాభంతో రూ.28,802గా వుంది. కాగా నష్టాలతో మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల జోరుతో క్రమంగా లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ 67, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో కీలకమైన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. -
చైనా మార్కెట్లు జూమ్.. ట్రంప్ ఎఫెక్ట్?
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ స్టన్నింగ్విక్టరీ చైనామార్కెట్లకు మాంచి బూస్ట్ ఇచ్చింది. గురువారం షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ గురువారం రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. చైనా మార్కెట్లు 1.4 శాతం లాభపడగా, చైనా స్టాక్స్ 10 నెలల గరిష్ఠానికి చేరాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.4 శాతం జంప్ చేసి 3,171 పాయింట్లకు చేరింది. ఈ ఏడాది జనవరి8 తరువాత ఇదే అత్యధికమని ఎనలిస్టుల అంచనా. బ్లూచిప్ షేర్ల ఇండెక్స్ సీఎస్ఐ ఇండెక్స్ కూడా1.1శాతం ఎగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఆర్థిక, పరిశ్రమ రంగ షేర్లతోపాటు చైనా ప్రాపర్టీ డీలర్ జెయింట్ వాంటే 7.5 శాతం ఎగిసింది. దీంతో మరో రియల్ ఎస్టేట్ బహుళజాతి సంస్థ ఎవర్ గ్రాండ్.. వాంటే లో మరో 8.3 వాటాను పెంచింది. కాగా ఒకవైపు ట్రంప్ అనూహ్య విజయంతో ప్రపంచం షాక్ లో ఉండగా, ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా స్పందించాయి. మరోవైపు చైనా మార్కెట్లు కఠినమైన మూలధన నియంత్రణ కారణంగా సాధారణంగా అంతర్జాతీయ ట్రెండ్ కు పెద్దగా స్పందించవు. కానీ లోయర్ లెవల్స్‌లో మదుపర్ల కొనుగోళ్లు స్థిరపడుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు నిదర్శమని తెలుస్తోంది. కాగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా సుమారు 500 పాయింట్ల లాభానికి చేరువలో ఉన్నాయి. బుధవారం వెయ్యిపాయింట్లకు పైగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ధోరణి భారీగా నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ రంగాలు భారీగా లాభపడుతున్నాయి. అయితే నిన్న భారీగా దూసుకుపోయిన బంగారం నేడు స్థిరంగా ట్రేడవుతోంది. -
తిరుపతి సెల్‌టవరెక్కి యువకుడు హల్చల్
-
అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..
షాంఘై: సహజంగా ఓ పెద్ద భవంతి పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూడాలంటేనే గుండెలు జారీ పడినట్లు అనిపిస్తుంది. అలాంటిది వందల మీటర్లు ఎత్తున్న భవనం.. దానిపైన ఓ సన్నటి పిల్లర్ లాంటి నిర్మాణంపైకి ఎక్కి దానిపైన నిల్చోవడమే కాకుండా తాపీగా కూర్చుని కాళ్లు ఊపుకుంటూ కింద చీమల్లాగా కదులుతున్న బస్సులను, పిట్టగూళ్లలా కనిపిస్తున్న ఇళ్లను చూసి ఓ వీడియోకు ఫోజిస్తే.. షాంఘైలో ఓ యువకుడు ఇలాగే అదిరిపడే సాహసం చేశాడు. షాంఘైలోని పెద్ద భవనంపైకి ఎక్కి దానిపైన ఉన్న ఓ పిల్లర్ లాంటి నిర్మాణం చివర వరకు ఎలాంటి సహాయం రక్షణ కవచాలు లేకుండానే పాకేసి హాయిగా కూర్చున్నాడు. అనంతరం ఓ వీడియోకు పోజిచ్చాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. అయితే, అతడు అంత ఎత్తు ఎక్కిన తర్వాత కూడా అతడికి ఇంకా సంతోషంకలగలేదంట. అందుకే అతడు మరో ఎత్తయిన నిర్మాణం ఎక్కబోతున్నాడంట. -
భార్య పుట్టింటికి వెళ్లిందని..
నవీపేట : భార్య పుట్టింటికి వెళ్లిందని ఆవేదనతో భర్త సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట మండలం అభంగపట్నం గ్రామ పరిధిలోని స్టేషన్ ఏరియాకు చెందిన సుమన్.. రెండు రోజుల కిందట తన భార్య నందినితో గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన నందిని తన పది నెలలల కూతురుతో పాటు మహారాష్ట్రలోని పర్భణిలో గల తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండు రోజులుగా మద్యం సేవిస్తున్న సుమన్ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం స్థానిక వెంకటేశ్వర్ కాలనీలోని సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. స్థానికులు గమనించి సమాచారం అందివ్వగా ఎస్సై రవీందర్‌నాయక్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై మైక్సెట్లో సుమన్‌తో మాట్లాడారు. అతని భార్యను ఒప్పించి తీసుకు వస్తానని చెప్పడంతో చివరకు కిందికి దిగాడు. -
ఈ మెట్లు ఎక్కగలవా...ఓ నరహరి!
బీజింగ్: సాహసం చేస్తే పోయేదేమీ లేదు ప్రాణాలు తప్పా! అన్నట్లుగా ఉంది ఆ దారి. దక్షిణ చైనా, గ్వాంగ్డాంగ్లోని గోల్డ్ మౌంటేన్ పర్వత శిఖరాగ్రంను చేరుకునేందుకు అత్యంత ప్రమాదకర మెట్లదారిని నిర్మించింది చైనా ప్రభుత్వం. సముద్ర మట్టానికి 4,650 అడుగుల ఎత్తులోవున్న పర్వత శిఖరాగ్రంను చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మెట్లదారిలో 1640 అడుగుల మేర మెట్లు మాత్రం అచ్చం నిచ్చెనలానే ఉంటాయి. ముందు వెళుతున్న వ్యక్తి పట్టుతప్పి పడిపోతే...ఆ వెనకాలే మెట్లు ఎక్కుతున్నవారంతా పడిపోవడం ఖాయమని చెప్పొచ్చు. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ మెట్ల దారిని పర్యాటకుల కోసం సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభించారు. కొద్ది రోజులు మాత్రమే పర్యాటకుల కోసం తెరచి ఉంచుతామని, ప్రమాదాలను అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చైనా పర్యాటక శాఖ ప్రకటించింది. దీనిపై చైనాలో ట్విట్టర్‌కు సమానమైన ‘వీబో’ సోషల్ వెబ్సైట్లో కామెంట్స్ విరివిగా వచ్చి పడుతున్నాయి. సాహసం సేయరా డింబకా! అంటూ ట్వీట్ల ద్వారా ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అది ఎంత సురక్షితమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర దారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సాహసం చేస్తే రాజకుమారి దక్కుతుందో, లేదోగానీ జీవితానికి సరిపడా ఓ అత్యద్భుత అనుభూతి మాత్రం మిగులుతుంది. అందమైన పర్వతాలకు, లోయలకు, వాటర్ ఫాల్స్‌కు నెలవైన గోల్డ్ మౌంటేన్ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.