పైకెగిసిన ఆయిల్ ధరలు
పైకెగిసిన ఆయిల్ ధరలు
Published Fri, Dec 9 2016 4:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
సింగపూర్ : వరుసగా రెండో రోజు క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగిశాయి. ఒపెక్, ఇతర దిగ్గజ ఉత్పత్తిదారుల మధ్య ఆయిల్ ఉత్పత్తిలో కోతపై సమావేశం జరుగనున్న నేపథ్యంలో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలోనే బంగారం ధరలు కిందకి పడిపోయాయి. వియెన్నాలో శనివారం ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ 14 దేశాల మధ్య భేటీ జరుగబోతోంది. వీరిమధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యారెల్ క్రూడ్ ధర సమారు 51 డాలర్లకు ఎగిసినట్టు విశ్లేషకులు చెప్పారు.. ఇప్పటికే ఒపెక్ సభ్యులు ఉత్పత్తికోతలో ఓ అంగీకారానికి రాగా, నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో 0.6 మిలియన్ బ్యారెళ్లు కోత విధించనున్నట్టు తెలుస్తోంది.
ఆయిల్ మార్కెట్ సమతుల్యం కోసం ఒపెక్ సభ్యులు 2008 తర్వాత మొదటిసారి ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు ప్రకటించారు. ఒకవేళ నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు చెబితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ధరలు 60 డాలర్లకు వచ్చిన సందేహం లేదని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి మంచి వారంగా నమోదవుతున్న ఆసియా ఈక్విటీ స్టాక్స్ చివరిలో హెచ్చుతగ్గులకు గురయ్యాయి. బాండ్లు, కొరియన్ ఓన్ పడిపోగా, డాలర్ బలపడింది.
Advertisement