OPEC meet
-
స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు, 14 రోజులుగా
దేశీయ మార్కెట్లో చమురు ధరలు 14రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల క్రితం పెరిగిన చమరు ధరలు ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది. శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
చమురు ఉత్పత్తి కోతకు డీల్...
లండన్: డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. రేట్ల పతనానికి అడ్డు కట్ట వేసే దిశగా ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉత్పత్తి దేశాలన్నీ దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్లు సుదీర్ఘంగా సాగిన వర్చువల్ సమావేశం అనంతరం పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోనున్నాయి. ఆ తర్వాత నుంచి డిసెంబర్ దాకా 8 మిలియన్ బీపీడీకి, 2021 నుంచి 16 నెలల పాటు 6 మిలియన్ బీపీడీకి పరిమితం చేయనున్నాయి. తొలుత ఈ డీల్‌కు ఒప్పుకోకపోయినప్పటికీ ఉత్పత్తి కోతతో తమకు వాటిల్లే నష్టాలను భర్తీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇవ్వడంతో మెక్సికో కూడా అంగీకారం తెలిపింది. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలను పరిశీలిస్తున్నాయి. తాజా డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడవచ్చని విశ్లేషకుల అంచనా. ఇటు పరిమాణంపరంగాను, అటు ఉత్పత్తి కోతలో భాగమవుతున్న దేశాల సంఖ్యాపరంగాను ఇది అసాధారణమని తెలిపారు. ఇంధన రంగంలో బద్ధవిరోధులైన దేశాలు కూడా ఇందులో పాలు పంచుకోవడం విశేషమని పేర్కొన్నారు. ఇది సరిపోదు.. అయితే, భారీగా పడిపోయిన క్రూడాయిల్ డిమాండ్‌పరమైన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రతిపాదిత కోతలేమీ సరిపోయే అవకాశాలు లేవని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయాయని, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని అంచనా. ఏప్రిల్‌లో సరఫరా, డిమాండ్ మధ్య 27.4 మిలియన్ బీపీడీ స్థాయిలో అసమతౌల్యత ఉంటుందని రీసెర్చ్ సంస్థ రైస్టాడ్ ఎనర్జీ అంచనా. డిమాండ్‌కి మించి సరఫరా! కరోనా వైరస్ వ్యాప్తితో చమురు డిమాండ్, ధరలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఉత్పత్తి తగ్గించుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, దీని వల్ల అమెరికన్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో, తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు రష్యా అంగీకరించలేదు. ఇది సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉత్పత్తిని భారీగా పెంచేసి రేట్లను తగ్గించేయడం ద్వారా ధరలపరమైన పోరుకు తెరతీసింది. అప్పట్నుంచి రేట్ల పతనం మొదలైంది. రేట్లు పడిపోవడంతో చాలా దేశాలు చౌకగా చమురు కొనుగోళ్లకు ఎగబడి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీలో సగటున 79 శాతం దాకా నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 2020లో గరిష్ట.. కనిష్టాలు... నిజానికి 2020 తొలి మూడు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీ ఎగువ, దిగువ స్థితులను చూడ్డం గమనార్హం. అంతక్రితం మూడు నెలల నుంచీ క్రూడ్ ధర అప్‌ట్రెండ్‌లోనే ఉంది. జనవరిలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకోవడంతో ముడిచమురు రేటు ఒక్కసారిగా ఎగిసింది. అప్పటికి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ వెంటనే.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, క్రూడ్ ఉత్పత్తికి భయంలేదన్న సంకేతాలు.. తత్సబంధ పరిణామా లతో క్రమంగా చల్లారింది. అటు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో క్రూడ్ ధర మరికొంత చల్లారగా, రష్యా–సౌదీ అరేబియాల మధ్య మార్చి మొదటి వారంలో చోటుచేసుకున్న ‘ధరల యుద్ధం’తో 19 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ధరల పరిస్థితిని చూస్తే, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.6–19.27 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను చూడగా, బ్రెంట్ క్రూడ్ ధర 75.6–21.65 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో తిరుగాడాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కాగా, గురువారం ట్రేడింగ్‌లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర 23.21 డాలర్ల వద్ద ముగియగా, బ్రెంట్ 31.82 డాలర్ల వద్ద ఉంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సందర్భంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉత్పత్తి కోత ఆశలతో పుంజుకున్న చమురు ధర
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పుంజుకున్నాయి. కరోనా సంక్షోభం, ప్రపంచ దేశాలు ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు సమ్మతించవచ్చనే అంచనాలమధ్య బుధవారం చమురు ధరలు ఎగిసాయి. ఒపెక్ సభ్య దేశాలు, రష్యా మధ్య ఉత్పత్తి తగింపునకు నిర్ణయించనున్నారనే ఆశలమధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తిగా చూపిస్తున్నారు. దీంతో ఇవాళ బ్రెంట్ క్రూడ్ 75 సెంట్లు (2.5శాతం) పెరిగి బ్యారెల్ ధర 32.62 డాలర్లకు చేరింది. నైమెక్స్ కూడా 5 శాతం ఎగిసింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ 3.6 శాతం క్షీణించింది. అంతకుముందు సెషన్లో క్రూడాయిల్ ధర దాదాపు తొమ్మిదిన్నర శాతం తగ్గింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ముడి చమురు ధరలు గత కొంతకాలంగా భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్ దేశాలు, రష్యాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గురువారం ఒపెక్ సభ్యులు, రష్యాలు సమావేశం కానున్నాయి. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి తగ్గింపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా సమావేశంలో తీసుకోబోయే నిర్ణయంతో సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల యుధ్దానికి తెరపడే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా, ఒపెక్ సభ్యదేశాలు, రష్యాలు చమురు ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశముందని చెబుతున్నారు. అయితే ఉత్పత్తి కోత నిర్ణయంలో అమెరికా పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా ముడి ఉత్పత్తి 4.70 లక్షల బీపీడీ తగ్గిందని, 2020లో మరో 1.3 మిలియన్ బీపీడీ తగ్గుతుందని ఇటీవలే అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఏపీఐ) గణాంకాల ప్రకారం అమెరికాలో పెట్టుబడులు ఏప్రిల్ 3 వరకు 11.9 మిలియన్ బారెల్స్ మేర పెరిగి 473.8 మిలియన్ బారెల్స్ కు చేరుకున్నాయి. వైరస్ వ్యాప్తి భయాలతో చమురుకు డిమాండ్ తగ్గడంతో,ఆయిల్ రంగ షేర్లు 9.4 మిలియన్ బారెల్స్ పెరిగాయి. ఇది జనవరి 2017తరువాత ఒక వారంలో అతిపెద్ద లాభంమిదేనని ఏపీఐ తెలిపింది. -
పైకెగిసిన ఆయిల్ ధరలు
సింగపూర్ : వరుసగా రెండో రోజు క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగిశాయి. ఒపెక్, ఇతర దిగ్గజ ఉత్పత్తిదారుల మధ్య ఆయిల్ ఉత్పత్తిలో కోతపై సమావేశం జరుగనున్న నేపథ్యంలో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలోనే బంగారం ధరలు కిందకి పడిపోయాయి. వియెన్నాలో శనివారం ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ 14 దేశాల మధ్య భేటీ జరుగబోతోంది. వీరిమధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యారెల్ క్రూడ్ ధర సమారు 51 డాలర్లకు ఎగిసినట్టు విశ్లేషకులు చెప్పారు.. ఇప్పటికే ఒపెక్ సభ్యులు ఉత్పత్తికోతలో ఓ అంగీకారానికి రాగా, నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో 0.6 మిలియన్ బ్యారెళ్లు కోత విధించనున్నట్టు తెలుస్తోంది. ఆయిల్ మార్కెట్ సమతుల్యం కోసం ఒపెక్ సభ్యులు 2008 తర్వాత మొదటిసారి ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు ప్రకటించారు. ఒకవేళ నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు చెబితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ధరలు 60 డాలర్లకు వచ్చిన సందేహం లేదని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి మంచి వారంగా నమోదవుతున్న ఆసియా ఈక్విటీ స్టాక్స్ చివరిలో హెచ్చుతగ్గులకు గురయ్యాయి. బాండ్లు, కొరియన్ ఓన్ పడిపోగా, డాలర్ బలపడింది.