అనుకున్నది చేయాలన్న కృత నిశ్చయం, తపన ఉంటే చాలు. అందుకు వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది లేటు వయసులో చదువుకుని పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఉన్నారు. మరికొద్దిమంది కాస్త ముందడుగు వేసి వృద్ధాప్యలో ఉండి కూడా మారథాన్, బాక్సింగ్ వంటివి నేర్చుకుని శభాష్ అని ప్రశంసలు అందుకున్నారు. అలాంటివారి కోవకు చెందినవారే కేరళలోని 62 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఆమె ఏం సాహసం చేసిందో తెలుసా!.
వివరాల్లోకెళ్తే...బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) - అగస్త్యర్‌కూడమ్‌ను అధిరోహించింది. ఆమె ఈ పర్వతారోహణ చేసేందుకు తన కొడుకు, స్నేహితులతో కలిసి బెంగుళూరు నుంచి కేరళకు వచ్చినట్లు తెలిపింది. అంతేకాదు నాగరత్నమ్మ గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోయానని పేర్కొంది.
ఇప్పుడు తన పిల్లలందరూ స్థిరపడ్డారు కాబట్టి పర్వతారోహణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్‌కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ అగస్త్యర్‌కూడమ్‌కు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారిపై లింగ ఆధారిత పరిమితులు విధించబడదని కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది.
దీంతో రాష్ట్ర అటవీ శాఖ మహిళలు పర్వత శ్రేణి ట్రెక్కింగ్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. పైగా అగస్త్యర్‌కూడం కేవలం ట్రెక్కింగ్ శ్రేణి మాత్రమే కాదు, నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన పుణ్యక్షేత్రం కూడా. ఈ మేరకు ఆ బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ని చూసి ఫిదా అవుతున్నారు.
(చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!)
Comments
Please login to add a commentAdd a comment