Kerala HC
-
62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు
అనుకున్నది చేయాలన్న కృత నిశ్చయం, తపన ఉంటే చాలు. అందుకు వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది లేటు వయసులో చదువుకుని పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఉన్నారు. మరికొద్దిమంది కాస్త ముందడుగు వేసి వృద్ధాప్యలో ఉండి కూడా మారథాన్, బాక్సింగ్ వంటివి నేర్చుకుని శభాష్ అని ప్రశంసలు అందుకున్నారు. అలాంటివారి కోవకు చెందినవారే కేరళలోని 62 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఆమె ఏం సాహసం చేసిందో తెలుసా!. వివరాల్లోకెళ్తే...బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) - అగస్త్యర్కూడమ్ను అధిరోహించింది. ఆమె ఈ పర్వతారోహణ చేసేందుకు తన కొడుకు, స్నేహితులతో కలిసి బెంగుళూరు నుంచి కేరళకు వచ్చినట్లు తెలిపింది. అంతేకాదు నాగరత్నమ్మ గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోయానని పేర్కొంది. ఇప్పుడు తన పిల్లలందరూ స్థిరపడ్డారు కాబట్టి పర్వతారోహణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ అగస్త్యర్కూడమ్కు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారిపై లింగ ఆధారిత పరిమితులు విధించబడదని కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ మహిళలు పర్వత శ్రేణి ట్రెక్కింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. పైగా అగస్త్యర్కూడం కేవలం ట్రెక్కింగ్ శ్రేణి మాత్రమే కాదు, నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన పుణ్యక్షేత్రం కూడా. ఈ మేరకు ఆ బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ని చూసి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Vishnu (@hiking_._) (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
విరాట్ కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు
సాక్షి, తిరువనంతపురం : ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, టాలీవుడ్ నటి తమన్నా భాటియాకు మరోసారిఎదురు దెబ్బ తగిలింది. వీరితోపాటు మాలీవుడ్ నటుడు అజు వర్గీస్‌కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వున్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది. త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్ ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతో హైకోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ కోర్టు కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ వివాదంలో పలువురు నటులుతోపాటు, క్రికెట్ సెలబ్రిటీలపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, హీరోయిన్ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు గత ఏడాది మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ఎందుకు వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. Kerala HC sends notices to Virat Kohli and actors Tamannaah Bhatia & Aju Varghese, who are the brand ambassadors of Online Rummy games, in connection with a petition seeking legal prohibition on online rummy games. Court also asks for a reply from the State Govt on this. pic.twitter.com/TNYHdw2cF8 — ANI (@ANI) January 27, 2021 -
నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ
తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసును సీబీఐ ఛేదించనుంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐబీకి బదిలీ చేశారు. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు అంతకుముందు సీబీఐ నిరాకరించడంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. -
నటుడి మృతిపై సీబీఐ దర్యాప్తు
తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై ఏడాదిగా మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు సూచించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు వారం రోజుల క్రితం సీబీఐ నిరాకరించింది. దీంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్ట్టారు. సీఎం పినరయి విజయన్ కూడా సీబీఐ విచారణకు మొగ్గు చూపారు. అయితే దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ నిరాకరిచింది. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.