Western Ghats
-
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు
‘ప్రాణదాత’ అనే మాట మనుషులకు సంబంధించే ఎక్కువగా వినబడుతుంది. ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు మాత్రం పశ్చిమ కనుమల అరణ్యాలలోని మొక్కల ప్రాణదాతలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కలు, చెట్లను కాపాడడానికి ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ ద్వారా మొక్కవోని కృషి చేస్తున్నారు. పచ్చటి అడవి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా కష్టపడుతున్నారు... పశ్చిమ కనుమల అడవులు అపూర్వమైన చెట్లజాతులు, జంతుజాలం, పక్షి, చేప జాతులకు ప్రసిద్ధి పొందాయి. అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) పశ్చిమ కనుమల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల మన దేశంలోని పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవులను రక్షించుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కేరⶠలోని పెరియాలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైన ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ లోని ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ కృషి చేస్తోంది. 27 మంది మహిళలు ఉన్న ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లో అరుదైన మొక్కలను సంరక్షిస్తోంది. ‘మొక్కలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్న మొక్కలకు ఈ గురుకులం శరణార్థి శిబిరంలాంటిది. ఆస్పత్రి కూడా అనుకోవచ్చు. మొక్కలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మట్టిపాత్రలతో ఉంటుంది’ అంటుంది ఎకోసిస్టమ్ గార్డెనర్ సుప్రభా శేషన్. తొంభై శాతం అడవులు మాయమైన పరిస్థితిని ‘పర్యావరణ మారణహోమం’గా అభివర్ణిస్తుంది సుప్రభా శేషన్. అడవులనే ఇల్లుగా భావిస్తున్న సుప్రభ శేషన్ ‘గ్రీన్ ఆస్కార్’గా గుర్తింపు పొందిన యూకేలోని టాప్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ‘విట్లీ’కి ఎంపికైంది. గురుకుల బొటానికల్ శాంక్చువరీ (జీబిఎస్) అరుదైన మొక్కల ‘స్వర్గధామం’గా పేరు తెచ్చుకుంది పశ్చిమ కనుమల ప్రాంతాలలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నందున అడవులు ప్రమాదం అంచున ఉన్నాయి. 28 ఏళ్లుగా ‘జీబిఎస్’లో పనిచేస్తున్న సుప్రభా శేషన్ అరణ్యాలకు సంబంధించిన పరిస్థితులు విషమించడాన్ని ప్రత్యక్షంగా చూసింది. ‘అరుదైన మొక్కలను కాపాడడంలోని ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది సీనియర్ గార్డెనర్ లాలీ జోసెఫ్. పాతిక సంవత్సరాలుగా ఈ అభయారణ్యంలో పనిచేస్తున్న జోసెఫ్ ‘మొక్కలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం’ అంటోంది. ‘నేను చూస్తుండగా అడవిలో ఒక చెట్టు నేల కూలిపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు’ అంటుంది లాలీ జోసెఫ్. కీటకాలు, పాముల నుంచి రక్షణగా పెద్ద బూట్లు ధరించిన ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు అడవులలో తిరుగుతుంటారు. ప్రమాదంలో ఉన్న మొక్కలు, చెట్లను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. సహజ పదార్థాల నుంచి పురుగు మందులను తయారుచేస్తుంటారు. అడవి గుండె చప్పుడు విని... దిల్లీలో పెరిగిన సుప్రభా శేషన్... కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రోక్వుడ్ పార్క్ సెంటర్ (యూకే)లో చదువుకుంది. అక్కడ ఉన్నప్పుడు తొలిసారిగా కేరళలోని ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ గురించి విన్నది. ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, పార్క్ ల్యాండ్ల చరిత్రపై ప్రాజెక్ట్ చేస్తున్న సుప్రభ శేషన్‌ని కేరళలోని ‘గురుకుల’ ఆకర్షించింది. అమెరికాలోని ల్యాండ్ ఇనిస్టిట్యూట్‌లో ఒక సంవత్సరం పాటు అధ్యయన కార్యక్రమాల్లో భాగం అయిన సుప్రభ ఆ తరువాత మన దేశంలోని ఆదివాసీ గూడేలలో మకాం వేసి అడవుల గుండె చప్పుడు విన్నది. తన ప్రయాణంలో భాగంగా ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ (జీబిఎస్) వ్యవస్థాపకుడు వోల్ఫ్ గాంగ్‌ను కలిసింది. ‘జీబీఎస్’ ద్వారా అడవులను రక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుంది. అలా లాలీ జోసెఫ్, సుమ కెలోత్లాంటి ఇతర ‘జీబియస్’ సభ్యులతో కలిసి అడవిబాట పట్టింది. పశ్చిమ కనుమలలోని పర్వతాలను అధిరోహించింది. అంతరించిపోతున్న మొక్కల జాతుల గురించి తెలుసుకోవడమే కాదు వాటి పరిరక్షణలో భాగంగా ‘జీబియస్’గా గార్డెనర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నల్లని రాళ్లలో.. ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లోని సీనియర్ గార్డెనర్ అయిన లాలీ జోసెఫ్, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కల కోసం అన్వేషిస్తుంటుంది. గురుకులంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ద్వారా వాటిని బతికించే ప్రయత్నం చేస్తుంది. కొండ, కోనలు తిరుగుతూ మొక్కల యోగక్షేమాలు తెలుసుకుంటుంది. -
ఆ కోట ఎక్కాలని ఉంది.. ఆనంద్ మహీంద్ర ఆసక్తికర పోస్టు..
మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపారంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ తనను ఆలోచింపజేసిన ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూనే ఉంటారు. తన ఆలోచనలను పంచుకుంటూ ఫాలోవర్స్నూ ఆలోచింపజేస్తారు. తాజాగా ఆయన మహారాష్ట్రలోని కళావంతి కోట గురించి పోస్టు చేశారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ కోటను ఎక్కాలని ఉందంటూ తన అభీష్టాన్ని పంచుకున్నారు. కలావంతీ కోట మహారాష్ట్రలో ఉన్న అతి దుర్భేద్యమైన కోట. శత్రువులు చేరలేని స్థితిలో దాన్ని నిర్మాణం జరిగింది. దాదాపు 60 డిగ్రీల ఏటవాలులో ఉండే కొండపై ఈ దుర్గాన్ని నిర్మించారు. యువకులు ఛాలెంజ్‌గా ఈ కోటను ఎక్కుతారు. ఇన్ని రోజుల నుంచి ఈ కోట గురించి తనకు తెలియదని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ కోటను ఎక్కాలని ఉందని నెటిజన్లతో తన అభీష్టాన్ని పంచుకున్నారు. ఓ వ్యక్తి ఈ కోట నుంచి వేగంగా దిగుతున్న వీడియోను షేర్ చేశారు. I confess I had no clue about this spot. Have to figure out whether I’m up to this challenge! The trek to the top of the Kalavantin Durg is considered one of the most daunting in the Western Ghats. A roughly 60-degree incline. pic.twitter.com/mbgJ498ECy — anand mahindra (@anandmahindra) July 22, 2023 ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్ర ఫాలోవర్లు తమ స్పందనలతో కామెంట్ బాక్స్‌ను నింపేశారు. కోట మార్గం నిటారుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే మంచి షూ ధరించి వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కుదిరితే ఈ కోటకు వెళ్లడానికి మీరూ ట్రై చేస్తారా మరి..? ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
వయసు 62.. పర్వతారోహణ.. ఉన్నతమైన కల
‘కల ఉంటే చాలు అదే వయసును తగ్గిస్తుంది. లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది’ అనడానికి నాగరత్నమ్మ అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నారు. బెంగుళూరులో ఉంటున్న నాగరత్నమ్మ వయసు 62. గృహిణిగా బాధ్యతలు తీరి, విశ్రాంతి తీసుకుంటున్న వయసు. కానీ, పశ్చిమ కనుమల్లో ఎత్తైన, అత్యంత కష్టతరమైన పర్వతాన్ని.. అదీ చీరకట్టుతో అధిరోహించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారామె. సంకల్పం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని చాటుతున్నారు. ఇంటి గడప దాటి ఎన్నడూ పర్యటనలు కూడా చేయలేదనే నాగరత్నమ్మను ‘ఈ వయసులో టీవీ చూస్తూ, మనవలు– మనవరాండ్రతో కాలక్షేపం చేయకుండా ఏంటీ సాహసం’ అని తెలిసినవాళ్లు, తెలియనివాళ్లూ అడుగుతుంటే హాయిగా నవ్వేస్తుంది. ఆ తర్వాత తాను ఎందుకు ఈ సాహసానికి పూనుకున్నదో వివరిస్తుంది. ఏళ్ల నాటి తపన పర్వతాలను అధిరోహించాలని తనకు ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే కలగన్నదట నాగరత్నమ్మ. కానీ, పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల నడుమ ఆ కల కళ్ల వెనకే దాగిపోయిందని చెబుతుంది. ‘‘కాలప్రవాహంలో నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. బాధ్యతలేవీ లేకపోవడంతో నా కల ముందుకు వచ్చింది. మా అబ్బాయితో చెప్పాను. ముందు సంశయించాడు. ‘ఈ వయసులో పర్వతారోహణ.. అంటే మోకాళ్ల నొప్పులు వస్తాయి, భరించలేవు’ అన్నాడు. ‘నా కల నాలో ఉత్సాహాన్ని, శక్తిని పెంచుతుంది. నేనిలా పర్వతారోహణ చేయడం నా వయసు వాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, కాదనకు’ అని చెప్పాను. అలా 40 ఏళ్ల తర్వాత నా కల నెరవేర్చుకోవడానికి మా అబ్బాయి, అతని మిత్రులతో కలిసి పశ్చిమ కనుమలకు చేరుకున్నాను. ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అంటారు నాగరత్నమ్మ. ఆమె చేసిన ట్రెక్కింగ్‌కి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. సాహసం నాగరత్నమ్మ వయసును తగ్గించింది. ఇప్పుడీ పర్వతారోహణ ఆమెలో మరింత శక్తిని నింపింది. దీంతో ‘మరిన్ని పర్వతారోహణలు చేసి, నా కలను సుసంపన్నం చేసుకుంటాను’ అంటూ తన లక్ష్యాన్ని వివరించే నాగరత్నమ్మను తప్పక అభినందించాల్సిందే! ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. – నాగరత్నమ్మ -
62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు
అనుకున్నది చేయాలన్న కృత నిశ్చయం, తపన ఉంటే చాలు. అందుకు వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది లేటు వయసులో చదువుకుని పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఉన్నారు. మరికొద్దిమంది కాస్త ముందడుగు వేసి వృద్ధాప్యలో ఉండి కూడా మారథాన్, బాక్సింగ్ వంటివి నేర్చుకుని శభాష్ అని ప్రశంసలు అందుకున్నారు. అలాంటివారి కోవకు చెందినవారే కేరళలోని 62 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఆమె ఏం సాహసం చేసిందో తెలుసా!. వివరాల్లోకెళ్తే...బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) - అగస్త్యర్కూడమ్ను అధిరోహించింది. ఆమె ఈ పర్వతారోహణ చేసేందుకు తన కొడుకు, స్నేహితులతో కలిసి బెంగుళూరు నుంచి కేరళకు వచ్చినట్లు తెలిపింది. అంతేకాదు నాగరత్నమ్మ గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోయానని పేర్కొంది. ఇప్పుడు తన పిల్లలందరూ స్థిరపడ్డారు కాబట్టి పర్వతారోహణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ అగస్త్యర్కూడమ్కు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారిపై లింగ ఆధారిత పరిమితులు విధించబడదని కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ మహిళలు పర్వత శ్రేణి ట్రెక్కింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. పైగా అగస్త్యర్కూడం కేవలం ట్రెక్కింగ్ శ్రేణి మాత్రమే కాదు, నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన పుణ్యక్షేత్రం కూడా. ఈ మేరకు ఆ బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ని చూసి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Vishnu (@hiking_._) (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
డేంజరస్ బట్ బ్యూటిఫుల్.. స్వర్గంలో ఉన్నట్లుగా..
-
భారీ వర్షం.. దూకుతున్న జలపాతం.. మధ్యలో రైలు!
Train Passing Through Goa Waterfall In Heavy Rain: గోవా- బెంగళూరు రైలు మార్గంలో ప్రకృతి రమణీయ దృశ్యం చోటుచేసుకుంది. భారీ వర్షాల దాటికి దూద్‌సాగర్ జలపాతం వెల్లువలా దూకుతున్న వీడియో కనువిందు చేసింది. అయితే, ఈ ఘటన కారణంగా రైలును మధ్యలోనే నిలిపివేయాల్సి రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు... పశ్చిమ కనుమలలోని మొల్లెం జాతీయ పార్కు, భగవాన్ మహవీర్ సాంక్చురీ మధ్య గల ప్రదేశాలు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడే దూద్‌సాగర్ జలపాతం ఉంది. కర్ణాటకలోని బెలగావి జిల్లా నుంచి మొదలయ్యే మాండవీ నది పశ్చిమ కనుమల నుంచి గోవా రాజధాని పనాజీ, ఆపై అరేబియా సముద్రంలో కలిసేందుకు ప్రయాణం చేసే క్రమంలో ఈ వాటర్‌ఫాల్స్ రూపుదిద్దుకుంది. భారత్‌లోని పొడవైన(సుమారు 310 మీటర్లు) జలపాతంగా ఇది పేరొందింది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం పెరగడంతో ఉవ్వెత్తున దూకుతుండటంతో గోవా- బెంగళూరు రైలు ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. దీంతో కాసేపు రైలును అక్కడే నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీబీఎన్ఎస్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘అత్యంత ప్రమాదకరం.. కానీ ఎంతో అందంగా ఉంది. నిజంగా స్వర్గమే భూమి మీదకు దిగినట్లు ఉంది. పాల సముద్రాన్ని చూస్తున్నట్లు ఉంది. కానీ పాపం ఆ రైలులో ఉన్న వారి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కదా’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరో మూడు రోజుల పాటు కొంకణ్ తీరంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. -
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది కూడా కృష్ణమ్మ ముందే కదిలింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవా హం పెరిగింది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 1.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూన్ మూడో వారంలో ఆల్మట్టి జలాశయంలోకి ఈ స్థాయి వరద రావడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. కృష్ణా నది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో శనివారం 200 మి.మీ. భారీ వర్షం కురిసింది. కోయినా డ్యామ్ వద్ద 143, అగుంబే వద్ద 71.12, వర్ణ డ్యామ్ వద్ద 52 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆల్మట్టిలోకి వచ్చే వరద ప్రవాహం 1.41 లక్షల క్యూసెక్కులకు పె రుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఆది, సోమవారాలు భారీ వర్షా లు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర బేసిన్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చే వరద ప్రవాహం 35 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని సీడబ్ల్యూసీ పేర్కొంది. -
కొత్త రకం చేపను కనిపెట్టిన సీఎం తనయుడు!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన కొత్తరకం చేపను కనుగొన్నారు. ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. చాలా చిన్న అందంగా, బంగారపు రంగులో పైన కొద్దిగా వెంట్రుకలు కలిగి చాలా చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇవి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండే మంచి నీటి చెరువులతోనే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. దీనిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు తేజస్ థాక్రే, ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్ పోర్టుబ్లెయర్కు చెందిన జయసింహన్ ప్రవీణ్‌రాజ్, అండన్ వాటర్ ఫోటోగ్రాఫర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ కలిసి పశ్చిమ కనుమలలో కనుగొన్నారు. దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామకరణం చేశారు. ఇది హిరణ్యాక్షి అనే నదిలో లభించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురించారు. హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు కలది అనే అర్థం కూడా వస్తుండటంతో ఈ పేరు చేపను వర్ణించడానికి కూడా సరిపోతుంది. ఇక ఈ చేపను తేజస్‌థాక్రే 2012లోనే కనుగొన్నారని ప్రవీణ్ రాజ్ తెలిపారు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను కనుగొన్నట్లు ప్రవీణ్ చెప్పారు. దీంతో దీని మీద మరింత రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన వివరాలను జర్నల్‌లో పొందుపర్చారు. చదవండి: నేను మోదీ హనుమాన్‌ని! -
రైలు మార్గం కోసం 2.2 లక్షల చెట్లు హరి!
సాక్షి, న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన ‘హుబ్బలి–అంకోలి రైల్వే లైన్ ప్రాజెక్ట్’కు కర్నాటక రాష్ట్ర వైల్డ్‌లైవ్ బోర్డు మార్చి 20వ తేదీన అనుమతిచ్చింది. ప్రజలతోపాటు కొంత మంది బోర్డు సభ్యుల అభ్యంతరాలను కూడా ఖాతరు చేయకుండా అనుమతివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన వెస్టర్న్ ఘాట్‌లో 164.44 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని ఈ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 2.2 లక్షల చెట్లను కొట్టివేయాల్సి వస్తోంది. దీనికోసం మొత్తం 995.64 హెక్టార్ల స్థలం అవసరం కాగా, అందులో 595.64 హెక్టార్లు పూర్తిగా అడవిలోనిదే. 184.6 హెక్టార్లు చిత్తడి నేల కాగా, 190 హెక్టార్లు మాత్రమే బీడు భూమి. వర్షాకాలంలో రవాణా సంబంధాలు తెగిపోతున్న ఉత్తర, హైదరాబాద్–కర్ణాటక ప్రాంతం సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగుతాయని బోర్డులో సభ్యుడైన కర్ణాటక అడవుల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సంజయ్ మోహన్ తెలిపారు. చదవండి: కేంద్ర మంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ ఇది అందరికి చెప్పే కారణం. అసలు ప్రాజెక్ట్ ఉద్దేశం కర్ణాటకలోని బళ్లారి, హోస్పేట్ నుంచి బొగ్గును రాష్ట్రంలోని అంకోలా, కర్వోర్ ప్రాంతాలకు, గోవాలోని వాస్కో, మడ్గావ్ రేవులకు తరలించేందుకని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 1.8 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన వెస్టర్న్ ఘాట్స్ (పడమటి కనుమలు) 30 శాతంపైగా అన్ని రకాల మొక్కలు, చేపలు, పక్షులతోపాటు పలు జీవరాశులున్నాయి. అందుకని వీటిని జీవ వైవిద్యానికి ప్రతీకలు అంటారు. ఈ కనుమల గుండా 38 నదులు తూర్పునకు ప్రవహిస్తుండగా వాటిలో 27 నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి, కృష్ణ, మాండవి, కావేరి, జౌరి లాంటి ప్రధాన నదులు పశ్చిమ కనుమల్లోనే పుట్టి ప్రవహిస్తున్నాయి. భారత్ ద్వీపకల్ప రాష్ట్రాల్లో నివసిస్తోన్న దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నవి ఈ నదులే. చదవండి: భారత సైన్యం కీలక నిర్ణయం..! ఈ కనుమల్లో 2,500 రకాల మొక్కలు, జంతువులు, ఉభయచరాలు, క్రిమికీటకాలతో విరాజిల్లుతూ ప్రపంచంలో ప్రముఖ జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందిందని, అభివృద్ధి పేరిట రైల్వే ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లయితే అనేక జాతుల జీవ వైవిధ్యం నశించి పోతాయని బెంగళూరు మహానగర పాలిక అటవీ విభాగానికి చెందిన జీవవైవిధ్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు విజయ్ నిశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రాజెక్ట్ వర్షపాతాన్ని దెబ్బతీయడంతోపాటు వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెంటర్ ఫర్ ఎకాలోజికల్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్త టీవీ రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో -
కృష్ణమ్మకు కష్టం.. గోదారమ్మకూ నష్టం
సాక్షి, అమరావతి : పశ్చిమ కనుమల్లో అడ్డగోలుగా అడవుల నరికివేత గోదావరి, కృష్ణా నదుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా.. నైరుతి రుతు పవనాల గమనాన్ని మార్చేస్తుందా.. ఈ పరిస్థితి ద్వీపకల్ప భారతావనిని దుర్భిక్షంలోకి నెడుతుందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలు. పశ్చిమ కనుమల్లోని అడవులను ఇష్టారాజ్యంగా నరికివేయడం వల్లే గతేడాది కేరళ, ఈ ఏడాది కర్ణాటకలో జల విలయాలు సంభవించాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల గ్రీన్హౌస్ వాయువుల ప్రభావం పెరగటం ప్రమాదకరంగా పరిణమించిందనే వాస్తవాన్ని చాటుతున్నాయి. పశ్చిమ కనుమల్లో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1.15 డిగ్రీలకు పెరుగుతున్నాయని.. దీనివల్లే ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. మూడు నాలుగు రోజుల్లోనే కుండపోతలా కురుస్తోందని.. ఈ పరిస్థితి వరదలకు దారి తీస్తోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాలు బలహీనపడే అవకాశం ఉందని.. ఇది ద్వీపకల్ప భారతదేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో పశ్చిమ కోస్తా తీరానికి 1,621 కిలోమీటర్ల పొడవున గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పశి్చమ కనుమల్లో పచ్చటి అడవులు విస్తరించి ఉన్నాయి. నైరుతి రుతు పవనాలు పశ్చిమ కనుమల మీదుగానే కేరళలో ప్రవేశించి.. దేశమంతటా విస్తరిస్తాయి. వర్షాలు కురిపిస్తాయి. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధానమైన గోదావరి, కృష్ణ, పెరియర్, పంబా తదితర జీవ నదులకు పుట్టినిల్లు పశ్చిమ కనుమలే. అక్కడ సమృద్ధిగా వర్షాలు కురిస్తే గోదావరి, కృష్ణ, పెరియర్ వంటి నదులు ఉరకలెత్తి ద్వీపకల్పాన్ని సస్యశ్యామలం చేస్తాయి. ప్రపంచం విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువుల్లో ఏటా 37.5 మిలియన్ టన్నుల బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డైయాక్సైడ్)ను పశ్చిమ కనుమల్లో అడువులు పీల్చుకుని.. అంతే స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేసి పర్యావరణ సమతౌల్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇది 100 బిలియన్ డాలర్ల (రూ.2,142 కోట్లు)కు సమానం. వరదలు.. లేకుంటే ఎడారులు పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం తగ్గుదల వల్ల ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. రెండు మూడు రోజుల్లోనే కుండపోతగా కురుస్తోందని ఐఐఎస్సీ, సీడబ్ల్యూసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కుండపోతలా కురిసిన వర్షపు నీటిని అడ్డగించేందుకు అడవులు లేవు. దీనివల్ల పశ్చిమ కనుమల్లో వాగులు, వంకలు ఉప్పొంగి.. నదులు వరదెత్తేలా చేస్తున్నాయి. ఈ వరదల దెబ్బకు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. గతేడాది కేరళను వరదలు అతలాకుతలం చేయడానికి పశ్చిమ కనుమల్లో అడవుల అడ్డగోలు నరికివేతే కారణమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది కర్ణాటకను, కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహించడానికి కూడా అదే కారణమని ఐఐఎస్సీ వెల్లడించింది. పశ్చిమ కనుమల్లో ఒక్కసారిగా కుండపోత కురిసి.. ఆ తర్వాత వర్ష విరామం (డ్రై స్పెల్) వస్తే వరదతో ఉప్పొంగిన నదులు.. నీటి చుక్క లేక ఎడారులను తలపిస్తాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా నదులే ఆధారం. పశ్చిమ కనుమల్లో అటవీ క్షయం గోదావరి, కృష్ణా నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని, ఇది ద్వీపకల్ప భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఐఎస్సీ కేంద్రానికి నివేదిక ఇచి్చంది. ద్వీపకల్పానికి గొడ్డలిపెట్టు.. ప్రపంచానికి, ద్వీపకల్ప భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పశ్చిమ కనుమల్లో అడవులను వ్యవసాయం, రహదారులు, ఖనిజ నిక్షేపాల వెలికితీత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. దీనివల్ల గత రెండు దశాబ్దాల్లో పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం ఐదు శాతం తగ్గిపోయిందని ఐఎల్పీసీ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ డైరెక్టర్ టీవీ రామచంద్ర నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 1985 అటవీ లెక్కల ప్రకారం పశ్చిమ కనుమల్లో 16.21 శాతం హరితారణ్యాలు ఉంటే 2019 నాటికి ఆ అడవుల విస్తీర్ణం 11.3 శాతానికి తగ్గిపోయింది. అంటే ఏడాది పొడవునా పచ్చగా ఉండే అటవీ విస్తీర్ణం 4.91 శాతం తగ్గిపోయిందని ఐఐఎస్సీ వెల్లడించింది. దీనివల్ల గ్రీన్హౌస్ వాయువులను గ్రహించే సామర్థ్యం పశ్చిమ కనుమలు 11 శాతం కోల్పోయాయి. ఇది భూతాపం పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ తీరం వెంబడి సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 నుంచి 1.15 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ కనుమల్లోనూ అదే రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాల ప్రవేశంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఐఐఎస్సీ పరిశోధనలో మరోమారు వెల్లడైంది. నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించినా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏకరీతిగా వర్షాలు కురవడం లేదు. ఇది ద్వీపకల్ప భారతదేశంలో ఖరీఫ్ పంటలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తీవ్ర దుర్భిక్షానికి దారి తీస్తోంది. ►పశ్చిమ కనుమల పొడవు 1,621కి.మీ ►అడవుల విస్తీర్ణం 1.40 లక్షల చ.కి.మీ. ►దీని పరిధిలో గల రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ►ఇక్కడి అడవులు పీల్చుకునే కార్బన్ డైయాక్సైడ్ 37.50 మిలియన్ టన్నులు ►ఇవి విడుదల చేసే ఆక్సిజన్ విలువకు సమానమైన మొత్తం రూ.2,142 కోట్లు ►1985 నాటికి పశ్చిమ కనుమల్లో గల హరితారణ్యాలు 16.21% ►2019 నాటికి వీటి విస్తీర్ణం 11.3% -
పోటెత్తుతున్న కృష్ణా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో కృష్ణా నది మళ్లీ పోటెత్తుతోంది. గత పది రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు 1.60 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండటంతో వచి్చన నీటిని వచి్చనట్లుగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 1.82 లక్షల క్యూసెక్కులను నదిలో వదులుతుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. 76,468 క్యూసెక్కుల వరద వస్తుండగా 86,166 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇది మంగళవారానికి జూరాల, శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోకి 44 వేలు, శ్రీశైలంలోకి 57,012, సాగర్‌లోకి 48,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డు లు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయినీ నదులు ఉప్పొంగడంతో బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్, జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో 2009–10లో 1,218 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం ఏకంగా 1,420 టీఎంసీల మేర వరద వచి్చంది. ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం సైతం 130 టీఎంసీలను దాటింది. ఇక జూరాలకు 2010–11లో గరిష్టంగా 787 టీఎంసీల వరద రాగా ఆ మార్కును ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ ఏకంగా 1,190 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్‌కు సైతం ఈ ఏడాది 968 టీఎంసీల మేర వరద రాగా, అది ఇంకా కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుల కింది ఆయకట్టుతో పాటు వీటిపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కనిష్టంగా 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలోనూ నీరందించే అవకాశం ఏర్పడింది. అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా నది పరీవాహకం, దాని ఉప నదుల పరిధిలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. శ్రీశైలానికి భారీ వరద పోటెత్తవచ్చని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు సూచించింది. -
‘కేరళ వరదలకు కారణం అదే’
కొచ్చి: వాతావరణ మార్పుల కారణంగానే ఇటీవల కేరళలో భారీ వర్షాలు, వరదలు పెను విధ్వంసం సృష్టించాయని ప్రముఖ పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్ర భూషణ్ తెలిపారు. గత కొన్నేళ్లలో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, చెన్నైలో కుంభవృష్టితో పాటు అకస్మాత్తుగా భారీ వరద పోటెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న డ్యాముల నిర్వహణ వ్యవస్థను పునఃసమీక్షించాల్సిన అవసరముందని భూషణ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులతో పశ్చిమ కనుమల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగానే కేరళలో కుంభవృష్టి సంభవించిందనీ, కాంక్రీటు నిర్మాణాలు, ఇతర మానవ చర్యల కారణంగా వరద పోటెత్తి అపార నష్టం సంభవించిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా పశ్చిమ కనుమల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిటీ లేదా కస్తూరిరంగన్ కమిటీ చేసిన సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) సంస్థ భూషణ్‌కు గతేడాది ఓజోన్ అవార్డును అందజేసింది. మాంట్రియల్ ప్రోటోకాల్‌ను సవరిస్తూ కిగాలీలో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం చర్చల సందర్భంగా చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. -
నా తీరాన... తొలి తెలుగు రాజ్యం...
గమనం నదుల స్వగత కథనం అవి పశ్చిమ కనుమలలో మహేబలేశ్వర్ పర్వత శ్రేణులు. కనుచూపు మేరలో అరేబియా సముద్రం మంద్రమైన చిరు అలలతో పలకరిస్తోంది. ఆ వైపుగా ప్రయాణిస్తే ఒక్క ఘడియలో సాగరాన్ని చేరుతాను. కానీ, ఉరకలెత్తే నా ప్రయాణానికి... నిలువెత్తు అలలతో తీరాన్ని కల్లోలపరిచే బంగాళాఖాతమే బావుంటుందనిపించింది. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరి ఇంద్రకీలాద్రి మీదున్న కనకదుర్గమ్మను చూస్తూ హంసలదీవి దగ్గర సాగరంలో కలుస్తాను. నా లక్ష్యం, గమ్యం తూర్పుగా ఉండడంతో పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రాన్ని పలకరింపుగా ఓ చూపు చూసి ప్రయాణ దిశను మార్చుకున్నాను. నేను పుట్టిన ప్రదేశం మీద నాకున్నంత మక్కువ దేవగిరి రాజు సింఘన్కి కూడా ఉండేది. అందుకే ఇక్కడ 13వ శతాబ్దంలో నాకు ‘కృష్ణబాయి’ ఆలయాన్ని కట్టాడు. పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ప్రతాప్‌ఘడ్ కోటను కట్టాడు. బ్రిటిష్ పాలకులు (బాంబే ప్రావిన్స్) వేసవి రాజధానిగా చేసుకున్నారు. నాతోపాటు ‘కొయ్నా, వెన్నా (వేణి), సావిత్రి, గాయత్రి అనే మరో నాలుగు నదులకు కూడా మహాబలేశ్వర్ పర్వతాలే పుట్టిల్లు. మా అయిదుగురం కలిసే ప్రదేశాన్ని పంచగంగ అంటారు. అక్కడ నన్ను కృష్ణమాత అని కొలుస్తారు. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది.‘ఛత్రపతి శివాజీ మీద విజయం సాధించడానికి అఫ్జల్ ఖాన్ ‘వాయి’ దగ్గర వ్యూహాన్ని పన్నాడట. దాన్ని తిప్పికొట్టే శక్తినిమ్మని శివాజీ అనుచరుడు నన్ను మొక్కాడు. ఆ పోరులో శివాజీ విజయం సాధించాడు. అందుకు నా ఆశీస్సులే కారణమని నమ్ముతూ కృతజ్ఞతగా ఏటా ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఆలయంలో నా ప్రవాహానికి అనుగుణంగా ఓ తటాకాన్ని తవ్వి ఆవు ముఖాకృతిని చెక్కారు. అలా నేను గోముఖం నుంచి బయటపడతానన్నమాట. వారణ, భీమ, దిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర నదులు నాలో కలుస్తూ నన్ను జీవనదిని చేస్తున్నాయి. సారవంతమైన నేలలున్న నా తీరంలో ఎందరు నివాసం ఏర్పరుచుకున్నారో లెక్కేలేదు. చరిత్రలో సూర్యప్రభలా వెలిగిన శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాలు నా తీరంలోనే రాజ్యాలను విస్తరించుకున్నాయి. మౌర్యుల నుంచి స్వాతంత్య్రం పొందిన శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినప్పుడు తొలి తెలుగు రాజ్యం నా తీరానే వెలిసినందుకు నేనే అందలమెక్కినంత పులకింత. నా తీరాన దినదినాభివృద్ధి సాధించిన నగరాలు మహారాష్ట్రలో సంగ్లీ, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలే. సంగ్లీ దగ్గరున్న ఇర్విన్ బ్రిడ్జి మనదేశంలో వలసపాలకులు కట్టిన పురాతన వంతెన. ఎర్ర రాతితో బ్రిటిష్ నిర్మాణాలను పోలిన ఈ బ్రిడ్జి మధ్యలో రెండు దారులున్నాయి. నా ప్రవాహాన్ని ఏదో ఒక తీరం నుంచి కాకుండా మధ్యలో చూడాలంటే ఆ దారుల నుంచి నన్ను దగ్గర నుంచి చూడవచ్చు. మరో సంగతి... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ పశ్చిమ మహారాష్ట్రలో స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించాడు. ఒకసారి బ్రిటీష్ సైనికుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక్కసారిగా నా ఒడిలో దూకేశాడు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి రక్షించే ప్రయత్నంలో ఉన్న ఒక మిత్రుడిని ఆపత్కాలంలో నా కొంగు చాటున దాచేసి రక్షించానన్న తృప్తి ఇప్పటికీ ఈ వంతెన కింద నుంచి వెళ్లేటప్పుడు గుర్తొస్తుంటుంది. సంగ్లీ మీదనే ‘అంకాలి’ అని మరో వంతెన... హైదరాబాద్- సికింద్రాబాద్ నగరాలను కలిపే ట్యాంక్‌బండ్‌లాగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను కలుపుతుంది. నాపై కర్నాటకలో బసవ సాగర్, ఆలమట్టి, నారాయణపూర్ ఆనకట్టలు, రిజర్వాయర్లు కట్టారు. బీజాపూర్- భాగల్‌కోట్ జిల్లాల మధ్య కట్టిన ఆలమట్టి సృష్టించిన వివాదం చిన్నది కాదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినప్పుడూ నా నీటి పంపకం ప్రధానమైన అంశంగా మారింది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ మీదుగా తెలంగాణలో అడుగుపెడితే అక్కడ నిజాం ప్రతిపాదించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పలకరిస్తుంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్లు వివాదాలను తీర్చడమే పనిగా పెట్టుకోవాల్సి వచ్చింది. నల్గొండ -గుంటూరు జిల్లాల మధ్య నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రధాని నెహ్రూ అంకితభావంతో కట్టిన దేవాలయం. నెహ్రూ పునాది వేస్తే ఇందిరా గాంధీ నీటిని విడుదల చేసిన ఈ ఆనకట్టకు అతిపెద్ద మానవ నిర్మిత రాతి ఆనకట్ట అనే బిరుదును ప్రదానం చేసి మరీ ప్రాధాన్యం కల్పించారు. హరిత విప్లవంలో నేను సైతం నా వంతు నీటిచుక్కనందించాననే సంతృప్తితో కర్నూలులో సంగమేశ్వరుడిని పలకరించి నల్లమల అడవులలో పులిని సగౌరవంగా ప్రణమిల్లి శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుని నాకు మోక్షం సిద్ధింస్తుందని సంతోషిస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాక తుంగభద్ర, భావనాసి నదులు కర్నూలు జిల్లాలో నాకు తోడవుతున్నాయి. నాకు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు సంగమేశ్వరునికి అభిషేకం చేస్తున్నా. నా తీరాన్ని ఆసరా చేసుకుని పరిఢవిల్లిన బౌద్ధానికి ఆనవాళ్లుగా స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు వెలిశాయి. కానీ రిజర్వాయర్ ముంపులో మునిగి పోయి శిఖరం మాత్రం ఒక దీవిలా కనిపిస్తోంది. స్థానభ్రంశం చెందిన బౌద్ధ ప్రతీకలు నా మీద అలకబూనినట్లే కనిపిస్తుంటాయి. మౌనంగా అమరావతి స్తూపాన్ని చూస్తూ సాగిపోతుంటే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఇక్కడే కృష్ణవేణి కొప్పున పూలు చుట్టుకుని తెలుగింటి విరిబోణిలా నాకు ప్రతీకగా నిలుచుని ఉంటుంది. కృష్ణ, వేణి నదుల కలయిక అని కృష్ణవేణి అన్నారు. ఇంతకీ ‘కృష్ణ’ అనే స్థిరపడడానికి నేను నల్లగా ఉండడమే కారణం. కృష్ణుడికీ, ద్రౌపదికీ అలాగే వచ్చింది ఆ పేరు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నా గమనంలో నాకు తోడయ్యే ఉపనదులకు, వాటి ఉప నదులకు, వాటి మీద కట్టిన ప్రాజెక్టులను లెక్కపెట్టడం, గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే మరి. వీటితోపాటుగా ఆకేరు, పాలేరు, వేదవతి, స్వర్ణముఖి, వేద, అవంతి, వరద, సిన, నిర, ముల, ముథ, చందాని, కామిని, మోషి, బోరి, మన్, భోగవతి, ఇంద్రావతి, కుండలి, కుమండల, ఘోడ్, భామా, పవ్నా వంటి చిన్న చిన్నవి నా ఉపనదుల్లో కలిసేవి, నాలో కలిసేవి కూడా ఉన్నాయి. పుట్టింది: పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ దగ్గర (మహారాష్ట్ర), జోర్ గ్రామంలో, సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో. అరేబియా సముద్రతీరానికి 64 కి.మీల దూరంలో. ప్రవాహదూరం: 1400 కి.మీ.లు సాగరసంగమం: కృష్ణాజిల్లా హంసలదీవికి సమీపంలో పాలకాయి తిప్ప దగ్గర (బంగాళాఖాతంలో) -
వీరప్పన్ ఇలాకాలో మావోయిస్టులు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల ద్వారా నల్లమల అడవుల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మూడు కూడళ్లలో విస్తరించిన సత్యమంగళం అడవులను తమ ఉద్యమ విస్తరణకు మావోయిస్టులు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. ఈ అంశాన్ని నిఘా వర్గాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ హెచ్చరించింది. గంధపు చెక్కలస్మగ్లర్ వీరప్పన్ ఒకప్పుడు మకాం వేసిన సత్యమంగళం అడవులను గెరిల్లా జోన్‌గా మార్చుకుని దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు మావోయిస్టులు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. తమిళనాడులోని నీలగిరి, కృష్ణగిరి, కేరళలోని సకిలేశ్వపూర్, మాలెమహాదేశ్పూర్ కొండల మీదుగా సత్యమంగళం అటవీ ప్రాంతాలలో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతం అయినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడ నుంచి దక్షిణ కర్ణాటకలోని ఉడిపి, షిమోగ, చిక్మగళూర్ జిల్లాలకు ఉద్యమాలను విస్తరిస్తున్నారు. సత్యమంగళం అడవుల్లో మావోయిస్టులు వరుసగా సమావేశాలు నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. మన రాష్ట్రానికి చెందిన మల్లా రాజిరెడ్డి సౌత్ వెస్ట్ రీజినల్ బ్యూరో(ఎస్డబ్ల్యూఆర్బీ) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కుప్పుస్వామి పేరుతో దక్షిణాది రాష్ట్రాలలో ఉద్యమ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దక్షిణాది రాష్ట్రాల ఉద్యమంతో రాజిరెడ్డికి మంచి సంబంధాలుండటంతో పార్టీ ఆయనకే ఆ బాధ్యతలను అప్పగించింది.