Anand Mahindra Posts Video of Maharashtra's Kalavantin Durg - Sakshi
Sakshi News home page

ఆ కోట ఎక్కాలని ఉంది.. ఆనంద్ మహీంద్ర ఆసక్తికర పోస్టు.. వీడియో వైరల్..

Published Sun, Jul 23 2023 7:43 PM | Last Updated on Mon, Jul 24 2023 12:11 PM

Anand Mahindra Post On Kalavantin Durg Maharastra - Sakshi

మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపారంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప‍్పటికీ తనను ఆలోచింపజేసిన ఏదో ఒక పోస్టు షేర్ చేస్తూనే ఉంటారు. తన ఆలోచనలను పంచుకుంటూ ఫాలోవర్స్‌నూ ఆలోచింపజేస్తారు. తాజాగా ఆయన మహారాష్ట్రలోని కళావంతి కోట గురించి పోస్టు చేశారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ కోటను ఎక్కాలని ఉందంటూ తన అభీష్టాన్ని పంచుకున్నారు. 

కలావంతీ కోట మహారాష్ట‍్రలో ఉన్న అతి దుర్భేద్యమైన కోట. శత్రువులు చేరలేని స్థితిలో దాన్ని నిర్మాణం జరిగింది. దాదాపు 60 డిగ్రీల ఏటవాలులో ఉండే కొండపై ఈ దుర్గాన్ని నిర్మించారు. యువకులు ఛాలెంజ్‌గా ఈ కోటను ఎక్కుతారు. ఇన్ని రోజుల నుంచి ఈ కోట గురించి తనకు తెలియదని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ కోటను ఎక్కాలని ఉందని నెటిజన్లతో తన అభీష్టాన్ని పంచుకున్నారు. ఓ వ్యక్తి ఈ కోట నుంచి వేగంగా దిగుతున్న వీడియోను షేర్ చేశారు.

ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్ర ఫాలోవర్లు తమ స్పందనలతో కామెంట్ బాక్స్‌ను నింపేశారు. కోట మార్గం నిటారుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే మంచి షూ ధరించి వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కుదిరితే ఈ కోటకు వెళ్లడానికి మీరూ ట్రై చేస్తారా మరి..? 

ఇదీ చదవండి: సినిమా రేంజ్‌లో.. దంపతుల పక్కా స్కెచ్‌.. టమాటా లారీ హైజాక్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement