ముంబై: అదృష్టం అంటే అతడిదే అని చెప్పుకోవాలి. రోడ్డు పక్కన దర్జాగా తన ద్విచక్ర వాహనంపై కూర్చున్న ఓ వ్యక్తికి భయంకరమైన అనుభవం ఎదురైంది. అదుపు తప్పిన జేసీబీ అతడి మీదకు మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. ఆ సమయంలో అతడికి ఏం చేయాలో తోచక షాక్‌లో ఉండిపోయాడు. ఇక అతడు ఆ జేసీబీకి బలవ్వాల్సిందే అని అనుకుంటున్న సమయంలో క్షణంలో అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో క్షణాల్లో మరో వాహనం.. జేసీబీకి అడ్డుగా వచ్చి అతడికి ప్రాణం పోసింది. ఒళ్లు గగుర్పోడిచే ఈ దృశ్యం మహరాష్ట్రలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో మోటర్ సైకిల్‌పై ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చోని ఉన్నాడు. అదుపుతప్పిన జేసీబీ అతి వేగంతో అతడి మీదకు వస్తోంది. అదే సమయంలో మహీంద్రా బొలెరో రోడ్డుపై అటుగా వెళుతూ జీసీబీని ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో ద్విచక్ర వాహనదారుడు ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు చిన్న గాయం కాకుండా బయటపడ్డాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. అతడు, ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో బ్రతుకు జీవుడా అంటూ మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఈ వ్యక్తితో సహా బొలెరో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. బొలెరో కారు ముందు భాగం ధ్వంసమైంది. (చదవండి: సింహాల కొట్లాట చూశారా?)
#NDTVBeeps | A biker narrowly avoided being crushed between a JCB and SUV as they collided. His incredible escape was caught on CCTV pic.twitter.com/3527JNRPn8
— NDTV (@ndtv) July 27, 2020
ఈ ఘటనపై నెటిజన్లు మాత్రమే గాక ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా సైతం స్పందించారు. ‘‘బోలేరో ప్రాణం పోసుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే మోటరు సైకిల్ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటమే దాని ఏకైక లక్ష్యం’’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘‘ఇంతకంటే దారుణమైన కారు ప్రమాదం మరొకటి ఉండదేమో. కానీ ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు, బొలెరో డ్రెవరు అదృష్టవంతులు. వారిని మహింద్ర బొలెరోనే కాపాడింది. దానికి ధన్యవాదాలు’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment