వీడియో: సెల్ఫీ తెచ్చిన తంటా.. యువతి పరిస్థితి విషమం! | Pune Girl Taking Selfie Fall Into 60 Foot Gorge In Satara, Watch Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: సెల్ఫీ తెచ్చిన తంటా.. యువతి పరిస్థితి విషమం!

Published Sun, Aug 4 2024 12:40 PM | Last Updated on Sun, Aug 4 2024 7:36 PM

Pune Girl Taking Selfie Fall Into Gorge Video Viral

ముంబై: సెల్‌ఫోన్లలో సెల్ఫీలు తీసుకునే సందర్భంగా ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయ్యేందుకు తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తాజాగా ఓ యువతి సెల్ఫీ తీసుకునే క్రమంలో లోయలో పడిపోయింది. దీంతో, అతి కష్టం మీద ఆమెను కాపాడారు.

కాగా, పూణేకు చెందిన ఒక టీమ్‌ థోస్‌గర్‌ జలపాతాన్ని చూసేందుకు అక్కడకి చేరుకున్నారు. ఈ క్రమంలో వారిలో ఒక్కరైన నస్రీన్‌ అమీర్‌ ఖురేషీ(29) సెల్ఫీ దిగుతున్నారు. ఈ క్రమంలో కొండ చివరన సెల్ఫీ దిగే ప్రయత్నం చేయడంతో ఆమె 60 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. దీంతో, అప్రమత్తమైన హోంగార్డ్‌, స్థానికులు ఆమెను రక్షించారు. ఇక, నస్రీన్‌ లోయలో పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కింద నుంచి ఆమెను పైనకి తీసుకువస్తున్న సమయంతో గాయాల కారణంగా పెద్దగా అరుస్తూ కన్నీరుపెట్టుకుంది.

 ఆమెకు గాయాలు కావడంతో సతారాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా సతారా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, థేఘర్ సహా జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజా ప్రమాదం సందర్బంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను కొద్దిరోజులు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఆదేశించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement