సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది కూడా కృష్ణమ్మ ముందే కదిలింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవా హం పెరిగింది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 1.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూన్ మూడో వారంలో ఆల్మట్టి జలాశయంలోకి ఈ స్థాయి వరద రావడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. కృష్ణా నది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో శనివారం 200 మి.మీ. భారీ వర్షం కురిసింది.
కోయినా డ్యామ్ వద్ద 143, అగుంబే వద్ద 71.12, వర్ణ డ్యామ్ వద్ద 52 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆల్మట్టిలోకి వచ్చే వరద ప్రవాహం 1.41 లక్షల క్యూసెక్కులకు పె రుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఆది, సోమవారాలు భారీ వర్షా లు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర బేసిన్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చే వరద ప్రవాహం 35 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని సీడబ్ల్యూసీ పేర్కొంది.
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
Published Sun, Jun 20 2021 3:54 AM | Last Updated on Sun, Jun 20 2021 3:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment