
Upcoming Theater OTT Movies Web Series In June 1st Week 2022: థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ 'అఖండ'తో మొదలైన మూవీ పండుగ మే 27న విడుదలైన 'ఎఫ్ 3' (F3)తో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలో 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' విజయంగా దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓ కొత్త సినిమా ప్రేక్షకులను కచ్చితంగా పలకిస్తుండంగా.. జూన్ మొదటి వారంలో అలరించే సినిమాలు, సిరీస్‌లు ఏంటో లుక్కేద్దామా !
1. మేజర్
డిఫరెంట్ కథలు, సినిమాలతో అలరించే అడవి శేష్ మేజర్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 36/11 ఉగ్రదాడుల్లో ప్రజల ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూలు వేసిన విషయం తెలిసిందే.
2. విక్రమ్
ముగ్గురు విలక్షణ నటులందరు కలిసి ఉర్రూతలూగించేందుకు వస్తుంది 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథిగా మెరవబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'విక్రమ్' జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.
3. పృథ్వీరాజ్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాజ్‌పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా రూపొందిన చిత్రం 'పృథ్వీరాజ్'. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజవనుంది.
ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
1. 9 అవర్స్ (వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 2
2. జనగణమన (మలయాళం)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 2
3. అశోకవనంలో అర్జున కల్యాణం- ఆహా, జూన్ 3
4. ది పర్‌ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3
5. సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3
6. ది బాయ్స్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3
7. ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్-సీజన్ 3)- ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3
8. బెల్‌ఫాస్ట్ (హాలీవుడ్)- బుక్ మై షో, జూన్ 3
చదవండి: రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు..
Comments
Please login to add a commentAdd a comment