Marvel Cinematic Universe
-
అదిరిపోయే తెలుగు డైలాగ్స్‌తో 'డెడ్ పుల్ అండ్ వాల్వరిన్' ట్రైలర్
హాలీవుడ్ నుంచి మార్వెల్ మూవీ యూనీవర్స్లో మరో కొత్త సినిమా ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగించేందుకు రెడీ అయింది. 'డెడ్ పుల్' మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా 'డెడ్ పుల్ అండ్ వాల్వరిన్' సినిమా ఈ జూలై 26న విడుదల కానుంది. ఈ సినిమాలో సూపర్ హీరో డెడ్ పుల్తో పాటు మిలీనియమ్ సూపర్ హీరో ఎక్స్ మెన్లో మోస్ట్ ఫెవరేట్ వాల్వరిన్ కూడా సిల్వర్ స్రీన్‌పై ఫైట్లు చేయబోతున్నాడు. దీంతో ఒకేసారి ఇద్దరు హీరోలు చేయబోయే అద్భుతమైన విన్యాసాలను మూవీ లవర్స్ డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ ద్వారా వీక్షించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కు వరల్డ్ వైడ్ విపరీతంగా క్రేజ్ ఏర్పడింది, ఈ నేపథ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాషల్లో ఉన్న సినీ అభిమానులను మరింత అలరించే విధంగా తీర్చిదిద్దేందుకు డబ్బింగ్ వెర్షన్స్ ను సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ ఫ్యాన్స్‌ను అత్యంత ఆకట్టుకుందనే విషయం తెలుగు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. తెలుగులో ఉన్న ట్రెండింగ్ పదాలను, యూత్ మధ్య విపరీతంగా వినిపించే పదాలతో ఉన్న డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ అవ్వనున్నాయి. తెలుగు సినీ అభిమానులు ఇటీవల ఇష్టపడిన కుర్చీమడతపెట్టి, కెవ్వుకేక, రింగ రింగ ఇలా అనేక అన్లైన్ ట్రెండింగ్ కీ వర్డ్స్‌తో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ తెలుగు వెర్షన్ సిద్ధం అయింది. ఈ చిత్రంలో వాల్వరిన్గా హుయ్ జాక్ మెన్, డెడ్ పుల్గా రయన్ రెనాల్డ్స్ కనిపించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. -
మార్వెల్ యూనివర్స్ లేటెస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
రోజుకో స్పెషల్ సర్ప్రైజ్తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్‌ని 'డెడ్ పుల్ & వాల్వరిన్' టీమ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రైన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్రథాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ జూలై 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ వస్తుండటం విశేషం. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మూవీపై హైప్ పెంచగా.. తాజాగా డబుల్ చేసేలా ఫైనల్ ట్రైలర్‌ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)ప్రతి మూవీలో కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని పరిచయం చేసే మార్వెల్.. ఈ ట్రైలర్లో లేడీ డెడ్ పుల్, వాల్వరిన్ కూతుర్ని పరిచయం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలుని ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ లవర్స్.. ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్షన్‌ని కూడా చూడబోతున్నారు. (ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?) -
ఇద్దరు సూపర్ హీరోల సినిమా.. విడుదల ఎప్పుడంటే
హాలీవుడ్ నుంచి మార్వెల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోలు వెండితెరపై కనిపిస్తే సంబరాల్లో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలో మార్వెల్ యూనీవర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్‌లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్తో పాటు వాల్వరిన్ కూడా వెండితెరపై అద్భుత విన్యాసాలు చేయబోతున్నాడు. ఇద్దరు సూపర్ హీరోలు ఒకేసారి అభిమానులు ముందుకు రానున్న నేపథ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మోస్ట్ ఫెవరేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైదరబాద్‌లో మార్వెల్ సినిమాలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే డెడ్ పుల్ & వాల్వరిన్ టికెట్లు బుకింగ్ మొదలైన సందర్భంగా తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఈ సెలబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. డెడ్ పుల్ & వాల్వరిన్లో ప్రధానపాత్రధారులుగా రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ నటిస్తున్నారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. -
సీక్రెట్ వార్స్‌కు చాన్స్ ఇవ్వండి
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమా రానుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ తనకు దక్కితే బాగుంటుందని దర్శక–నిర్మాత, రచయిత శ్యాముల్ ఎమ్ రైమి చేసిన వ్యాఖ్యలు హాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక దర్శకుడిగా ‘ది ఈవిల్ డెడ్’, ‘ది ఈవిల్ డెడ్ 2’, ‘స్పైడర్ మేన్’, ‘స్పైడర్ మేన్ 2’, ‘స్పైడర్ మేన్ 3’ వంటి సినిమాలను తెరకెక్కించారు శ్యాముల్. మరి.. ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ శ్యాముల్ కోరుకున్నట్లు ఆయనకు దక్కుతుందా? అనేది చూడాలి. మరోవైపు ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమాలోని ప్రధాన తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు మార్వెల్ సంస్థ. అయితే టామ్ హాలండ్, క్రిస్ హెమ్వర్త్, ఆంథోనీ మాకీ లీడ్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. -
Deadpool & Wolverine:మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేసింది!
మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ .ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
హైదరాబాద్: ‘దిమార్వెల్స్’ యూనిట్‌తో కలసి సమంత సందడి (ఫొటోలు)
-
ఆ విషయంలో థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నా: సమంత
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్‌తో జతకట్టింది. అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో సమంత స్పెషల్‌గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్ నవంబర్ 10న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత మాట్లాడుతూ..'కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడం థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నా. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.' అని అన్నారు. కాగా.. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్‌లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. Smile, Slay & Pose done ✅ As ever #Samantha stuns us with her stylish looks at an event!!❤️🔥 @Samanthaprabhu2 #TheMarvels #TeluguFilmNagar pic.twitter.com/GU777LnnIU — Telugu FilmNagar (@telugufilmnagar) November 3, 2023 -
గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. మార్వెల్ స్టార్ నటుడు అరెస్ట్
మార్వెల్ స్టార్, హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలిపై దాడి చేసిన కేసులో న్యూయార్క్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బ్రూక్లిన్‌లోని బార్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా టాక్సీలో ఇద్దరి మధ్య గొడవ జరిగనట్లు జోనాథన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది. తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ప్రియురాలి తల, మెడకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. జోనాథన్ తన మొబైల్ ద్వారా మరొక మహిళకు మేసేజ్ పంపడం ప్రియురాలు చూసింది. దీంతో అతని ఫోన్‌ను పరిశీలించాలని ఆమె అడిగింది. దీనికి అతని కోపం కట్టలు తెచ్చుకుంది. ఆమెను చేయి పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. వెంటనే అతని ప్రియురాలు పోలీసులను కాల్ చేసింది. జోనాథన్ మేజర్స్ చివరిగా క్రీడ్-3, యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియాలో కనిపించారు. అతను రెండు వారాల ముందు ఆస్కార్స్‌లో తన క్రీడ్-3 సహనటుడు మైఖేల్ బి. జోర్డాన్‌తో పాటు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. కానీ జోనాథన్ ప్రతినిధి మాట్లాడుతూ అతను ఏ తప్పు చేయలేదని అన్నారు. -
ఇండియన్ మార్వెల్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, వరుసగా 96 గంటలు ప్రదర్శన
పలు హాలీవుడ్ చిత్రాలెన్నో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి. అందులో మార్వెల్ స్టూడియో సీక్వెల్ ఒకటి. ఈ సినిమా అంటే ఎంతోమంది భారత ప్రేక్షకులు చెవి కొసుకుంటారు. అలాంటి వారికి తాజాగా మేకర్స్ శుభవార్త అందించారు. ఈ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఇటీవల థోర్: లవ్ అండ్ థండర్ సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జూలై 7 నుంచి భారత్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాదు అమెరికాలో ఒకరోజు కంటే ముందే ఇక్కడ రిలీజ్ కావడం విశేషం. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలైన రోజు నుంచి 4 రోజుల పాటు ఈ చిత్రాన్ని వరుసగా 96 గంటల పాటు ప్రదర్శించనున్నారు. ఈ నాలుగు రోజులు డే అండ్ నైట్‌లో ఎంపిక చేసిన థియేటర్లలోనే ఈ చిత్రం ప్రదర్శించనున్నారు. జూలై 7న ఉదయం 12:15 గంటల నుంచి జూలై 10, రాత్రి 23:59 గంటల వరకు వరుసగా 96 గంటల ఈ చిత్రం కొనసాగనుంది. మరి ఇంకేందుకు ఆలస్యం థోర్: లవ్ అండ్ థండర్‌ను చూడాలనుకుంటే ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకోండి. ఆస్కార్ విజేత తైకా వెయిటిటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనకు ఇష్టమైన అవెంజర్ థోర్ అకా క్రిస్ హేమ్స్‌వర్త్ తో పాటు భారీ తారాగణం: టెస్సా థాంప్సన్, నటాలీ పోర్ట్మన్, క్రిస్టియన్ బేల్ అతని బిగ్ ఎమ్సీయు(MCU) అరంగేట్రం చేశారు. -
డిస్నీ హాట్‌స్టార్‌లో 6 కొత్త వెబ్ సిరీస్‌లు.. ఎప్పుడంటే ?
These 6 Marvel Series Will Stream On Disney Plus Hotstar: మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎమ్‌సీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే పేరు ఉంది. ఇటీవల మార్వెల్ నుంచి 28వ చిత్రంగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతేకాకుండా మరోవైపు మిస్ మార్వెల్ (Ms Marvel) సిరీస్‌తో బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే తర్వాత వచ్చే ఎమ్‌సీయూ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. వారికోసం మార్వెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శించనున్నారు. ఏకంగా 6 మార్వెల్ సిరీస్‌లు మే 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సిరీస్‌లు ఏంటో చూసేయండి. చదవండి: ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే.. 1. డేర్ డెవిల్ (Daredevil) 2. జెస్సికా జోన్స్ (Jessica Jones) 3. ఐరన్ ఫిస్ట్ (Iron Fist) 4. పనిషర్ (Punisher) 5. ల్యూక్ కేజ్ (Luke Cage) 6. డిఫెండర్స్ (Defenders) -
'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా
KGF Producer Vijay Kiragandur About KGF 3: కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ తెలిపారు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్. ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ కిరంగదూర్. 'కేజీఎఫ్ 3 మూవీ తెరకెక్కించాలనే అనుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం.' అని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు. చదవండి: కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం! సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ తదితరులు కేజీఎఫ్ 2లో నటించారు. ఈ కేజీఎఫ్ 3లో నటీనటుల గురించల విజయ్ను అడగ్గా 'మేము ఒక మార్వెల్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించాలనుకుంటున్నాం. విభిన్న చిత్రాల నుంచి విభిన్న పాత్రలను తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.' అని తెలిపారు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్: లవ్ అండ్ థండర్' టీజర్
Chris HemsworthThor Love And Thunder Teaser Released: మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ (ఎమ్‌సీయూ) నుంచి వచ్చిన చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మార్వెల్ నుంచి వచ్చిన సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. థోర్ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. టీజర్ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్: రాగ్నరోక్' డైరెక్టర్, ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఈ మూవీ కథ 'ది అవేంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత నుంచి కొనసాగడం టీజర్లో చూపించారు. థోర్ (క్రిస్ హేమ్స్‌వర్త్) గార్డియన్స్ అయిన పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్), అతని బృందంతో నివసిస్తుంటాడు. గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్ మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్మన్) లేడీ థోర్‌గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్ నైట్' హీరో క్రిస్టియన్ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రేక్షకులకు కనువిందు.. ఆ సినిమాతో 'అవతార్ 2' ట్రైలర్ !
Avatar 2 Trailer Along With Doctor Strange In The Multiverse Of Madness: 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాల ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అవతార్ 2' రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదో సాధారణంగా అన్ని సినిమాల్లాగా 'అవతార్ 2' ట్రైలర్‌ను విడుదల చేస్తే కిక్ ఏముంటుంది. అందుకే మరొ భారీ చిత్రంతో 'అవతార్ 2' ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. ఆ సినిమా ఏంటంటే.. మార్వెల్ సంస్థలోని 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్'. ఈ సినిమాను మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన థియెటర్లలోనే 'అవతార్ 2' మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. 'అవతార్ 2' సినిమాను ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ ఏడాదిలోపు విడుదల చేస్తామని '20న సెంచరీ స్టూడియోస్ ప్రెసిడెంట్' స్టీవ్ అస్బెల్ ఇటీవల తెలిపారు. 'నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. జిమ్ చేస్తున్న దాన్ని మీరు ఊహించలేరు.' అని ఓ హాలీవుడ్ రిపోర్టర్‌తో పేర్కొన్నారు. ఇక 'డాక్టర్ స్ట్రేంజ్ 2' విషయానికొస్తే ఇటీవల 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' సినిమాలో మల్టీవర్స్ యాంగిల్‌ను చూపించారు. ఇప్పుడు రాబోతున్న 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమాలో 'ఎక్స్ మెన్' సిరీస్ సూపర్ హీరోలు వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ట్రైలర్లో సినిమాలోని ప్రొఫెసర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ అతిథిగా కనిపించినట్లు చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల్లో ఎక్స్ మెన్ హీరోస్ కూడా వస్తారని వార్తలు వినిపించాయి. అవతార్ 2 లాంటి విజువల్ వండర్ ట్రైలర్‌ను డాక్టర్ స్ట్రేంజ్ 2తో ప్రదర్శిస్తే చూస్ అభిమానులకు కనులవిందే. కాగా మార్వెల్ సంస్థలోని మరో భారీ చిత్రం 'థోర్: లవ్ అండ్ థండర్' జులైలో విడుదల కానుంది. -
తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్‌తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్‌ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..