KGF Producer Vijay Kiragandur About KGF 3: కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలీవుడ్‌లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ తెలిపారు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్.
ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ కిరంగదూర్. 'కేజీఎఫ్ 3 మూవీ తెరకెక్కించాలనే అనుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం.' అని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు.
చదవండి: కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్‌ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం!
సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ తదితరులు కేజీఎఫ్ 2లో నటించారు. ఈ కేజీఎఫ్ 3లో నటీనటుల గురించల విజయ్‌ను అడగ్గా 'మేము ఒక మార్వెల్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించాలనుకుంటున్నాం. విభిన్న చిత్రాల నుంచి విభిన్న పాత్రలను తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.' అని తెలిపారు.
చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్..
Comments
Please login to add a commentAdd a comment