Marvel Studios Thor: Love And Thunder Release In India Before Day of US - Sakshi
Sakshi News home page

Marvel Movies: యుఎస్‌ కంటే ఒక రోజు ముందే వస్తున్న మార్వెల్‌ సీక్వెల్‌, 96 గంటల పాటు ప్రదర్శన

Published Thu, Jun 30 2022 3:38 PM | Last Updated on Thu, Jun 30 2022 4:36 PM

Marvel Studios Thor Love And Thunder Release In India Before Day of UD - Sakshi

పలు హాలీవుడ్‌ చిత్రాలెన్నో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి. అందులో మార్వెల్‌ స్టూడియో సీక్వెల్‌ ఒకటి. ఈ సినిమా అంటే ఎంతోమంది భారత ప్రేక్షకులు చెవి కొసుకుంటారు. అలాంటి వారికి తాజాగా మేకర్స్‌ శుభవార్త అందించారు. ఈ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి ఇటీవల థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌ సీక్వెల్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జూలై 7 నుంచి భారత్‌ థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాదు అమెరికాలో ఒకరోజు కంటే ముందే ఇక్కడ రిలీజ్‌ కావడం విశేషం. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.

విడుదలైన రోజు నుంచి 4 రోజుల పాటు ఈ చిత్రాన్ని వరుసగా 96 గంటల పాటు ప్రదర్శించనున్నారు. ఈ నాలుగు రోజులు డే అండ్‌ నైట్‌లో ఎంపిక చేసిన  థియేటర్లలోనే ఈ చిత్రం ప్రదర్శించనున్నారు. జూలై 7న ఉదయం 12:15 గంటల నుంచి జూలై 10, రాత్రి 23:59 గంటల వరకు వరుసగా 96 గంటల ఈ చిత్రం కొనసాగనుంది. మరి ఇంకేందుకు ఆలస్యం థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌ను చూడాలనుకుంటే ఇప్పుడే టికెట్లను బుక్‌ చేసుకోండి. ఆస్కార్ విజేత తైకా వెయిటిటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనకు ఇష్టమైన అవెంజర్ థోర్ అకా క్రిస్ హేమ్స్‌వర్త్‌ తో పాటు భారీ తారాగణం: టెస్సా థాంప్సన్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్ అతని బిగ్ ఎమ్‌సీయు(MCU) అరంగేట్రం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement