'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌' టీజర్‌ | Chris HemsworthThor Love And Thunder Teaser Released | Sakshi
Sakshi News home page

Thor: Love And Thunder Teaser: 'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌' టీజర్‌

Published Wed, Apr 20 2022 6:32 PM | Last Updated on Wed, Apr 20 2022 7:42 PM

Chris HemsworthThor Love And Thunder Teaser Released - Sakshi

Chris HemsworthThor Love And Thunder Teaser Released: మార్వెల్ సినిమాటిక్‌ యూనివర్సిటీ (ఎమ్‌సీయూ) నుంచి వచ్చిన చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మార్వెల్‌ నుంచి వచ్చిన సినిమాల కోసం మూవీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ నటించిన 'థోర్‌: లవ్ అండ్‌ థండర్‌' సినిమా అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. థోర్‌ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. టీజర్‌ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్‌: రాగ‍్నరోక్‌' డైరెక్టర్‌, ఆస్కార్‌ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. 

ఈ మూవీ కథ 'ది అవేంజర్స్‌: ఎండ్‌గేమ్‌' తర్వాత నుంచి కొనసాగడం టీజర్‌లో చూపించారు. థోర్‌ (క్రిస్‌ హేమ్స్‌వర్త్‌) గార్డియన్స్‌ అయిన పీటర్‌ క్విల్‌ (క్రిస్‌ ప్రాట్‌), అతని బృందంతో నివసిస్తుంటాడు. గాడ్‌ ఆఫ్‌ థండర్‌ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్‌ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్‌ మాజీ ప్రేయసీ జేన్‌ ఫోస్టర్‌ (నటాలీ పోర్ట్‌మన్‌) లేడీ థోర్‌గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్‌ నైట్‌' హీరో క్రిస్టియన్‌ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్‌లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement