Natalie Portman
-
'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్: లవ్ అండ్ థండర్' టీజర్
Chris HemsworthThor Love And Thunder Teaser Released: మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ (ఎమ్‌సీయూ) నుంచి వచ్చిన చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మార్వెల్ నుంచి వచ్చిన సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. థోర్ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. టీజర్ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్: రాగ్నరోక్' డైరెక్టర్, ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఈ మూవీ కథ 'ది అవేంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత నుంచి కొనసాగడం టీజర్లో చూపించారు. థోర్ (క్రిస్ హేమ్స్‌వర్త్) గార్డియన్స్ అయిన పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్), అతని బృందంతో నివసిస్తుంటాడు. గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్ మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్మన్) లేడీ థోర్‌గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్ నైట్' హీరో క్రిస్టియన్ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ గౌరవం వద్దు
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చాలామంది హీరోయిన్లలానే తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి నటాలీ పోర్టమన్ చెప్పిన ‘నేను చెప్తే అలాంటివి వంద కథలుంటాయి.’ అన్న మాటలు అందరినీ కలిచివేశాయి. ‘మీటూ’ తర్వాత ఆమె, తను తీసుకునే నిర్ణయాల్లో సామాజిక బాధ్యతను మర్చిపోకూడదనుకుంటున్నారు. తాజాగా ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రభుత్వం అందించే ప్రెస్టీజియస్ అవార్డును కూడా కాదనుకుంది నటాలీ. ఇజ్రాయిల్ పౌరసత్వాన్ని కలిగిఉన్న నటాలీని అక్కడి ప్రభుత్వం జెనెసిస్ ప్రైజ్ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే తాజాగా ఆమె ఆ అవార్డును అందుకునేందుకు నిరాకరించింది. దీనిపై సోషల్ మీడియాలో బాగా విమర్శలు, వాదనలు వినిపించడంతో స్వయంగా నటాలీ ఎందుకు తాను ఈ అవార్డు తీసుకోలేదో తెలియజేసింది. ప్రస్తుతం ఇజ్రాయిలీ పాలస్తీనియన్ సంక్షోభం తారాస్థాయికి చేరిపోయింది. ఇజ్రాయిల్ ప్రభుత్వం కాల్పుల్లో పాలస్తీనియన్లను కాల్చి చంపినట్టు వచ్చిన వార్తలతో ప్రభుత్వంపై విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఈ అవార్డు తీసుకుంటే అది ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని, దాని చర్యలను సమర్థించినట్టు అవుతుందన్న కారణంతో నటాలీ ఈ అవార్డు అందుకోవడానికి దూరం జరిగింది. ఆమె తీసుకున్న డిసిషన్‌పై ఎప్పట్లానే రెండు రకాల వాదనలూ వినిపిస్తున్నాయి! ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అయిన నటాలీ, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోంది. -
వంద కథలున్నాయి...
‘‘నాకు పదమూడేళ్లు ఉన్నప్పుడు ఒకతను రేప్ ఫాంటసీ లెటర్ రాశాడు.’’ ‘‘ఒకసారి ఎవరో నా బాడీని కామెంట్ చేస్తూ అబ్యూజ్ చేశారు.’’ ‘‘ఒక నిర్మాత సినిమా అవకాశం ఇస్తానంటూ నేరుగా నాతో పడుకోవాలన్నాడు.’’ ఇవన్నీ నటి నటాలియా పోర్ట్మన్ చెప్పిన మాటలు. ఆమె అవార్డ్ విన్నింగ్ నటి. ఎప్పుడో కానీ దర్శకత్వ బాధ్యతల్లో ఒక మహిళ పేరు కనిపించని పేరున్న హాలీవుడ్లో దర్శకురాలిగానూ మెప్పించిన స్టార్. పైన చెప్పినటువంటి వంద కథలు తన జీవితంలో ఉన్నాయని చెప్పిందామె. ‘‘మీటూ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. ఇంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్తుంటే నాకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? అని ఆలోచించా. ఎదురవ్వలేదనిపించింది. నిజంగానే లేదా? నేనింతవరకూ లైంగిక వేధింపులకే గురికాలేదా? మళ్లీ ఆలోచించా. ఒక్కో కథ గుర్తొచ్చింది. ఒక్కో కథ. వంద కథలున్నాయి అలాంటివి. ఇలాగే అందరు అమ్మాయిలూ లెక్కలేనన్ని వేధింపులు ఎదుర్కొని ఉంటారు. అవన్నీ మరచిపోయారని కాదు. అలాంటివి ఎదురైనా నిలబడి మళ్లీ లైఫ్‌ని ఫేస్ చేస్తున్నారు. తవ్వితే ఎన్ని కథలు ఉంటాయో! మనం పోరాడుతూనే ఉండాలి. అలా ఎప్పటికీ నిలబడేంతవరకూ..’’ అంటూ మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ తన గురించి చెప్పుకొచ్చింది నటాలియా. ‘మీటూ’ ఓ గొప్ప ఉద్యమం అని చెప్పింది నటాలియా. మార్పు ఇక్కడైనా మొదలవ్వాలని కోరుకుందామె. అందరూ వచ్చి ఇలాంటి కథలు చెబుతూ ఉండడం కూడా మార్పుకోసం వేసే అడుగే! అలాంటి అడుగులో భాగమైన నటాలియా, పదేళ్ల తర్వాత, తన జుట్టును మొదటిసారి చిన్నగా, పిక్సీ హెయిర్‌కట్‌తో అందంగా మార్చేసుకుంది. ఈ పిక్సీ హెయిర్‌కట్‌తో, ఇలా స్టైల్‌గా నడిచొస్తూ చెప్పిందామె.. ‘‘ఆడవాళ్లు ధైర్యంగా నిలబడాలి’’. ∙నటాలియా పోర్ట్మన్ -
ఆమె అలా అనడంతో నా గుండె పగిలింది!
బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అతడంటే దేశంలోని అమ్మాయిలు పడిచస్తారు. ఎందుకంటే అతను మనకు హీరోగా తెలుసు. కానీ ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మన్ కు ఏం తెలుసు. అందుకే అతని ముఖం మీదే 'గెట్ లాస్ట్' అంటూ చిరాకు పడిందంట ఆ ముద్దుగుమ్మ. తాజాగా సీఎన్ఎన్ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ ఈ విషయాన్ని తెలిపాడు. 'ట్రిబెకా చిత్రోత్సవంలో నటాలీ పోర్ట్ మన్ వెనుక నేను పరిగెత్తాను. ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తున్నట్టు అనిపించింది. నేను వెంటనే వెళ్లి 'ఐ లవ్ యువర్..' అని అన్నాను. నేను 'యువర్ వర్క్' అనే లోపే ఆమె తలతిప్పి చూసి.. ఆగ్రహంగా 'గెట్ లాస్ట్' అంది. ఆ క్షణంలో నా హృదయం ముక్కలైంది. ఆ చేదు క్షణాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంటాయి' రణ్ బీర్ చెప్పాడు. అలాగే 'యే దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్వింటిన్ టారంటినోను కలిసి ఫొటో దిగాలని తాను ఉబలాట పడ్డానని, కానీ ఆయన తనను పట్టించుకోకుండానే కారు ఎక్కి వెళ్లిపోయాడని, ఫొటో ప్లీజ్ అంటూ తాను చేసిన అభ్యర్థనలు గాలిలో కలిశాయని రణ్ బీర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా తమ అభిమాన హీరోతో ఫొటోల కోసం జనం పడే తంటాలు ఈ యువ నటుడికి తెలిసి ఉంటాయి!!