ఆమె అలా అనడంతో నా గుండె పగిలింది! | I was heartbroken, says Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

ఆమె అలా అనడంతో నా గుండె పగిలింది!

Published Tue, Aug 23 2016 1:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

ఆమె అలా అనడంతో నా గుండె పగిలింది!

ఆమె అలా అనడంతో నా గుండె పగిలింది!

బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అతడంటే దేశంలోని అమ్మాయిలు పడిచస్తారు. ఎందుకంటే అతను మనకు హీరోగా తెలుసు. కానీ ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మన్ కు ఏం తెలుసు. అందుకే అతని ముఖం మీదే 'గెట్ లాస్ట్' అంటూ చిరాకు పడిందంట ఆ ముద్దుగుమ్మ.

తాజాగా సీఎన్ఎన్ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ ఈ విషయాన్ని తెలిపాడు. 'ట్రిబెకా చిత్రోత్సవంలో నటాలీ పోర్ట్ మన్ వెనుక నేను పరిగెత్తాను. ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తున్నట్టు అనిపించింది. నేను వెంటనే వెళ్లి 'ఐ లవ్ యువర్..' అని అన్నాను. నేను 'యువర్ వర్క్' అనే లోపే ఆమె తలతిప్పి చూసి.. ఆగ్రహంగా 'గెట్ లాస్ట్'  అంది. ఆ క్షణంలో నా హృదయం ముక్కలైంది. ఆ చేదు క్షణాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంటాయి' రణ్ బీర్ చెప్పాడు. అలాగే 'యే దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్వింటిన్ టారంటినోను కలిసి ఫొటో దిగాలని తాను ఉబలాట పడ్డానని, కానీ ఆయన తనను పట్టించుకోకుండానే కారు ఎక్కి వెళ్లిపోయాడని, ఫొటో ప్లీజ్ అంటూ తాను చేసిన అభ్యర్థనలు గాలిలో కలిశాయని రణ్ బీర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా తమ అభిమాన హీరోతో ఫొటోల కోసం జనం పడే తంటాలు ఈ యువ నటుడికి తెలిసి ఉంటాయి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement