Heartbroken
-
Odisha Train Crash: హృదయ విదారక ఘటన: జో బైడెన్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం భారతదేశంలో దాదాపు మూడు దశాబ్దాలలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటి. ఈ ఘటనలో కనీసం 288 మంది మరణించగా, దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఈ ఘటనలో తమవారిని కోల్పోయిన అనేకమందికి సానుభూతిని తెలియజేయడమే గాక, తీవ్రంగా గాయపడిన వారు ఈ ఘటన నుంచి సత్వరమే కోరుకోవాలని దేవుడిన ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు బైడెన్. భారత్, అమెరికా ఇరు దేశాలు ఒక కుటుంబం వలే సంస్కృతి సంబధాలతో లోతైన బంధాన్ని పెనవేసుకుంది. అమెరికా అంతటా ప్రజలు భారతదేశ ప్రజల తోపాటు సంతాపం వ్యక్తం చేస్తున్నాం. రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నందున ఈ విషాదకర ఘటన నుంచి బయటపడేలా మా ఆలోచనలన్ని భారతదేశ ప్రజల చుట్టూనే ఉంటాయని బైడెన్ అన్నారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?..) -
హృదయ విదారక దృశ్యాలు: బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
సాక్షి,ముంబై: అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ పౌరులు, ప్రధానంగా మహిళల స్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వేతన సమానత్వం కోసం పోరాడుతోంటే.. అఫ్గన్ మహిళలు మాత్రం అమ్మకానికి గురవుతున్నారన్నారు. వారే ఆదాయవనరుగా మారిపోయి జీవన పోరాటం చేస్తున్నారన్నారు. అఫ్గన్ మహిళలు, మైనార్టీల పరిస్థితిని చూసి హృదయం బద్దల వుతోందని పేర్కిన్నారు. ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ సంక్షోభంలో అండగా నిలబడాలని రియా గ్లోబల్ నాయకులను కోరారు. "పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి...మహిళలు కూడా మనుషులే" అని వ్యాఖ్యానించారు. మరోవైపు అఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, ఇతర సినీరంగ ప్రముఖులు స్పందించారు. ‘ప్రపంచం మౌనంగా చూస్తుండగా ఇంతటి సంక్షోభం.. మానవత్వానికి సిగ్గుచేటు’ అంటూ నటుడు కరణ్ టాకర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. అలాగే చిత్రనిర్మాత శేఖర్ కపూర్ కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్ ప్రజలకోసం ప్రార్థిస్తున్నాననీ, విదేశీ శక్తుల వలస రాజ్యం ఆశలో అఫ్గన్ నాశనం మైందని కపూర్ ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, రిచా చద్దా, అనురాగ్ కశ్యప్, సనమ్ పురి, హన్సల్ మెహతాతో సహా ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. As the Americans leave Kabul: pic.twitter.com/VLYoOrPGZL — ian bremmer (@ianbremmer) August 16, 2021 కాగా అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే అఫ్గన్ రాజధాని కాబూల్‌తోపాటు కీలక భూభాగాలను అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని కాబూల్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపాయి. ముఖ్యంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. కాబూల్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దీంతో బీతిల్లిన ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా తరలి రావడంతో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు, విమాన చక్రాలను పట్టుకుని మరీ వేళ్లాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ముఖ్యంగా కదులుతున్న విమానాన్ని అందుకోవాలన్న ఆశతో రవ్‌వేపై వేలాదిగా పరుగులు పెడుతున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆమె అలా అనడంతో నా గుండె పగిలింది!
బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అతడంటే దేశంలోని అమ్మాయిలు పడిచస్తారు. ఎందుకంటే అతను మనకు హీరోగా తెలుసు. కానీ ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మన్ కు ఏం తెలుసు. అందుకే అతని ముఖం మీదే 'గెట్ లాస్ట్' అంటూ చిరాకు పడిందంట ఆ ముద్దుగుమ్మ. తాజాగా సీఎన్ఎన్ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ ఈ విషయాన్ని తెలిపాడు. 'ట్రిబెకా చిత్రోత్సవంలో నటాలీ పోర్ట్ మన్ వెనుక నేను పరిగెత్తాను. ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తున్నట్టు అనిపించింది. నేను వెంటనే వెళ్లి 'ఐ లవ్ యువర్..' అని అన్నాను. నేను 'యువర్ వర్క్' అనే లోపే ఆమె తలతిప్పి చూసి.. ఆగ్రహంగా 'గెట్ లాస్ట్' అంది. ఆ క్షణంలో నా హృదయం ముక్కలైంది. ఆ చేదు క్షణాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంటాయి' రణ్ బీర్ చెప్పాడు. అలాగే 'యే దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్వింటిన్ టారంటినోను కలిసి ఫొటో దిగాలని తాను ఉబలాట పడ్డానని, కానీ ఆయన తనను పట్టించుకోకుండానే కారు ఎక్కి వెళ్లిపోయాడని, ఫొటో ప్లీజ్ అంటూ తాను చేసిన అభ్యర్థనలు గాలిలో కలిశాయని రణ్ బీర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా తమ అభిమాన హీరోతో ఫొటోల కోసం జనం పడే తంటాలు ఈ యువ నటుడికి తెలిసి ఉంటాయి!! -
నన్ను భయపెట్టినందుకు థాంక్స్!
''మెరుపు మెరిస్తే, వానకురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే'' అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పిల్లలు పువ్వుల్లా ఎంతో సుకుమారంగా, సున్నితంగా ఉంటారు కదా! అలాంటి ఆ పసివాళ్లు భయపడితే..ఆ ప్రభావం వారి మనసులపై తీవ్ర ప్రభావాన్నే పడేస్తుంది. అలా తనకు, తమ కుటుంబానికి ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని తలుచుకుంటూ.. ఓ చిన్నారి తన ఆవేదనకు అక్షర రూపాన్నిచ్చింది. తమకు నచ్చిన వస్తువులను, బహుమతిగా వచ్చిన బొమ్మలను ఎంతో అపురూపంగా దాచుకుంటారు పిల్లలు. అంతగా అభిమానించినవి ఉన్నట్టుండి పోతే.. ఎంత బెంగపడతారు! తన బాధ తెలుసుకున్న తరువాతైనా మీరు మారండి అంటున్న ఆ చిన్నారి రాసిన బహిరంగ లేఖ కరుడుగట్టిన నేరస్తులను సైతం ఆలోచనలో పడేస్తుంది. ఈ ఉత్తరాన్ని యూకేకు చెందిన పారిస్ ముల్ హోలాండే (11) అనే చిన్నారి రాసింది. ''వాళ్లు మానవత్వం లేని మనుషులు.. నేను ఎంత బాధపడ్డానో.. నా మనసు ఎంత కష్టపడిందో వారికి తెలియజేయాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇప్పటికైనా వాళ్లు పశ్చాత్తాప పడతారని ఆశిస్తున్నాను. నా బెడ్ మీద పడుకోవాలంటేనే భయంగా ఉంది. ఆ దుర్మార్గులు నా రూంలోకి వచ్చి నా వస్తువులన్నీ దోచుకెళ్లారు.. ఇది నన్ను చాలా భయపెట్టింది. ఇది ఎవరి రూం, ఎవరి వస్తువులు ఇవేవీ వారికి పట్టవు.. నాకు చాలాకాలంగా చీకటి అంటే భయం... దాన్ని అధిగమించాను. కానీ మీరు నా రూంలోకి వచ్చినప్పటి నుంచి భయం మళ్లీ నన్ను చుట్టుకుంది. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు.. అందుకే బాగా ఏడ్చాను.. దాదాపు రెండు గంటల పాటు అలా ఏడుస్తూనే ఉన్నాను. నా నోట మాటలు లేవు.. నాకెంతో ఇష్టమైన డిస్నీ బొమ్మ లెగోను ధ్వంసం చేశారు. మా ఫ్యామిలీ ఫొటో చూసిన తర్వాతైనా వారి మనసు మారలేదా? వాళ్లకు తెలుసు.. ఇది చిన్న పాప రూం అని.. అయినా ఈ పని చేశారు. నిజంగా నన్ను భయపెట్టినందుకు థాంక్స్...'' ఇలా సాగుతుంది ఆ చిన్నారి లేఖ. చివరగా.. ''తలుపులకు తాళాలు వేసుకోండి. మీ వస్తువులు కాపాడుకోండి. నాలాంటి అనుభవం మీకెవ్వరికీ ఎదురు కాకూడదు'' అంటూ అందరికీ జాగ్రత్తలు కూడా చెప్పింది. యూకేలోని సౌత్ యార్క్‌షైర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పారిస్ ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువులు, నగదును దోచుకెళ్లారు. వారం క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు వచ్చిన బహుమతులు కూడా చోరీకి గురయ్యాయి. వాళ్ల ఫ్యామిలీ ట్రిప్ ఫొటోలున్న ఐ ఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బెంగపడిన పారిస్.. ఈ ఉత్తరం రాయడం అక్కడి పోలీసు అధికారులను సైతం కదిలించింది. క్రిస్మస్ పండుగ బహుమతులు, పారిస్ పుట్టిన రోజు కానుకలతో పాటుగా, అమ్మమ్మ బంగారు వాచ్, లాప్ టాప్, ఐ ఫోన్ ఎత్తుకెళ్లారని పారిస్ తల్లి గెమ్మ(29) తెలిపారు. ఈ ఘటనతోతన పాప చాలా భయపడిపోయిందన్నారు. ఇలా ఉత్తర రాయడం ద్వారా ఆమెకు కొంత ఉపశమనాన్ని పొంది ఉంటుందన్నారు. ఈ ఘటన ఆ పాపపై తీవ్ర ప్రభావం చూపడం విచారకరమని సౌత్ యార్క్‌షైర్ పోలీస్ పీసీ ఆడమ్ వ్యాఖ్యానించారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.