ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం భారతదేశంలో దాదాపు మూడు దశాబ్దాలలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటి. ఈ ఘటనలో కనీసం 288 మంది మరణించగా, దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు.
ఈ ఘటనలో తమవారిని కోల్పోయిన అనేకమందికి సానుభూతిని తెలియజేయడమే గాక, తీవ్రంగా గాయపడిన వారు ఈ ఘటన నుంచి సత్వరమే కోరుకోవాలని దేవుడిన ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు బైడెన్. భారత్, అమెరికా ఇరు దేశాలు ఒక కుటుంబం వలే సంస్కృతి సంబధాలతో లోతైన బంధాన్ని పెనవేసుకుంది.
అమెరికా అంతటా ప్రజలు భారతదేశ ప్రజల తోపాటు సంతాపం వ్యక్తం చేస్తున్నాం. రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నందున ఈ విషాదకర ఘటన నుంచి బయటపడేలా మా ఆలోచనలన్ని భారతదేశ ప్రజల చుట్టూనే ఉంటాయని బైడెన్ అన్నారు.
(చదవండి: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?..)
Comments
Please login to add a commentAdd a comment