నటాలియా పోర్ట్‌మన్
‘‘నాకు పదమూడేళ్లు ఉన్నప్పుడు ఒకతను రేప్ ఫాంటసీ లెటర్ రాశాడు.’’ ‘‘ఒకసారి ఎవరో నా బాడీని కామెంట్ చేస్తూ అబ్యూజ్ చేశారు.’’ ‘‘ఒక నిర్మాత సినిమా అవకాశం ఇస్తానంటూ నేరుగా నాతో పడుకోవాలన్నాడు.’’ ఇవన్నీ నటి నటాలియా పోర్ట్‌మన్ చెప్పిన మాటలు. ఆమె అవార్డ్ విన్నింగ్ నటి. ఎప్పుడో కానీ దర్శకత్వ బాధ్యతల్లో ఒక మహిళ పేరు కనిపించని పేరున్న హాలీవుడ్‌లో దర్శకురాలిగానూ మెప్పించిన స్టార్. పైన చెప్పినటువంటి వంద కథలు తన జీవితంలో ఉన్నాయని చెప్పిందామె.
‘‘మీటూ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. ఇంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్తుంటే నాకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? అని ఆలోచించా. ఎదురవ్వలేదనిపించింది. నిజంగానే లేదా? నేనింతవరకూ లైంగిక వేధింపులకే గురికాలేదా? మళ్లీ ఆలోచించా. ఒక్కో కథ గుర్తొచ్చింది. ఒక్కో కథ. వంద కథలున్నాయి అలాంటివి. ఇలాగే అందరు అమ్మాయిలూ లెక్కలేనన్ని వేధింపులు ఎదుర్కొని ఉంటారు. అవన్నీ మరచిపోయారని కాదు. అలాంటివి ఎదురైనా నిలబడి మళ్లీ లైఫ్‌ని ఫేస్ చేస్తున్నారు. తవ్వితే ఎన్ని కథలు ఉంటాయో! మనం పోరాడుతూనే ఉండాలి.
అలా ఎప్పటికీ నిలబడేంతవరకూ..’’ అంటూ మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ తన గురించి చెప్పుకొచ్చింది నటాలియా. ‘మీటూ’ ఓ గొప్ప ఉద్యమం అని చెప్పింది నటాలియా. మార్పు ఇక్కడైనా మొదలవ్వాలని కోరుకుందామె. అందరూ వచ్చి ఇలాంటి కథలు చెబుతూ ఉండడం కూడా మార్పుకోసం వేసే అడుగే! అలాంటి అడుగులో భాగమైన నటాలియా, పదేళ్ల తర్వాత, తన జుట్టును మొదటిసారి చిన్నగా, పిక్సీ హెయిర్‌కట్‌తో అందంగా మార్చేసుకుంది. ఈ పిక్సీ హెయిర్‌కట్‌తో, ఇలా స్టైల్‌గా నడిచొస్తూ చెప్పిందామె.. ‘‘ఆడవాళ్లు ధైర్యంగా నిలబడాలి’’.
∙నటాలియా పోర్ట్‌మన్
Comments
Please login to add a commentAdd a comment