మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ... కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని అన్నారు. ‘మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చుకానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారు. మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారు. ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.
తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు.
ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు హేమ కమిషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment