Malayalam film industry
-
జూన్ 1 నుంచి మలయాళ చిత్రాల షూటింగ్ బంద్
‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్‌కుమార్(Suresh Kumar) ప్రకటించారు.60 శాతం పారితోషికాలకే... ‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్ పేర్కొన్నారు.50 రోజుల్లో పూర్తి చేయకుండా... ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు. 176 చిత్రాలు... అపజయంపాలు... బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
రహస్య కెమేరాలు అమర్చారు: రాధికా శరత్‌కుమార్
కేరళ రాష్ట్రం రిలీజ్ చేసిన హేమా కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇతర పరిశ్రమలనూ కుదిపేస్తోందనే చెప్పాలి. ఇంతకు ముందు దగా పడ్డ నటీమణులు ఇప్పుడు తమ ఆవేదనను వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాధికా శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ సమయంలో క్యారవేన్‌లో రహస్య కెమేరాలు అమర్చారు. నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి కొందరు నటులు సెల్ఫోన్లో చూసి, ఆనందించడం నా కంటపడింది. చాలా కోపం వచ్చింది.నేను క్యారవేన్కు వెళ్లకుండా హోటల్‌కు వెళ్లి దుస్తులు మార్చుకున్నాను. ఆ తర్వాత వాహన ఇన్చార్జ్ని ఇంకోసారి ఇలా జరిగితే జాగ్రత్త అని హెచ్చరించాను. సినిమా రంగంలో సిస్టమ్ సరిగ్గా లేదు. నటీమణుల గది తలుపులను తట్టే పరిస్థితి పలు చిత్ర పరిశ్రమల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్ చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. మేం అందరం అలా ఎదిగినవాళ్లమే. ఒక మహిళ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు చూపించమని అడుగుతారు. అంటే... జరిగే ఘటనను మేం వీడియో తీయాలా? ఇప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఈ విషయంపై కోలీవుడ్‌లో మాట్లాడుతున్న నటులెవరైనా ఉన్నారా? ‘ఉల్లొళుకు’ సినిమాలో ఊర్వశితో కలిసి పార్వతి బాగా నటించింది. ఆమెకు ఎందుకు అవార్డు రాలేదని మలయాళ ఇండస్ట్రీలో కొందరిని అడిగాను. ‘పార్వతి అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. సమస్యల గురించి మాట్లాడుతుంది’ అన్నారు. అంత ప్రతిభ ఉన్న నటిని ఇలానా ట్రీట్ చేసేది అనిపించింది’’ అన్నారు.అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారని...2018లో ‘మీటూ’లో భాగంగా తమిళ రచయిత వైరముత్తు గురించి చిన్మయి చేసిన ఫిర్యాదు గురించి ప్రస్తావించారు రాధిక. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూశాను. ఒక వ్యక్తి... అతను జర్నలిస్ట్ కాదు... అతను నటీమణులు అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారు అన్నట్లుగా మాట్లాడాడు. నడిగర్ సంఘమ్ జనరల్ సెక్రటరీ విశాల్‌కి ధైర్యం ఉంటే.. వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టమనండి. తనతో పాటు నేను కూడా వెళతాను’’ అని ఘాటుగా స్పందించారు రాధిక. -
జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సమంత రియాక్షన్
-
చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్ గోపి ఆగ్రహం
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ... కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని అన్నారు. ‘మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చుకానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారు. మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారు. ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు. ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు హేమ కమిషన్ తెలిపింది. -
బయటపడ్డ బహిరంగ రహస్యం
ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది. నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది. ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్‌కతాలో విధినిర్వహణలో డాక్టర్‌పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది. తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది. లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది. మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు. కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం. ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత. -
ఆ నటుడితో కాంగ్రెస్‌కు గొడవ ఎందుకు?
మలయాళ నటుడు జోజు జార్జ్.. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీకి లక్ష్యంగా మారారు. అతడు బహిరంగ క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. తాను ఏ తప్పు చేయలేదని జార్జ్ చెబుతున్నాడు. అసలు హస్తం పార్టీ అతడిని ఎందుకు టార్గెట్ చేసింది? జార్జ్ చేసిన తప్పేంటి? అసలు కథ ఇక్కడి నుంచే.. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా నవంబర్ 1న కొచ్చిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. వైట్టిల-ఎడపల్లి జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు దాదాపు గంటల పాటు యాతన అనుభవించారు. జోజు జార్జ్.. కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో కూతురిని కీమోథెరపికి తీసుకెళుతున్న ఓ మహిళ పక్షాన కాంగ్రెస్ కార్యకర్తలతో అతడు వాగ్వాదానికి దిగాడు. గట్టిగా నిలదీయడంతో కోపోద్రిక్తులయిన కాంగీయులు జార్జ్ కారు అద్దాలను పగులగొట్టారు. దీంతో బాధ్యులపై పోలీసులు పలు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. తలపొగరు తగ్గాలి జోజు జార్జ్.. తమ పార్టీ మహిళా కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించాడని కాంగ్రెస్ ఆరోపించింది. వీధి రౌడీలా ప్రవర్తించాడని, అతడి తలపొగరు తగ్గాలంటే చట్టప్రకారం శిక్షించాలని పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జోజు జార్జ్‌ను నిందించే ప్రయత్నంలో సినీ పరిశ్రమను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. సినిమా షూటింగ్స్ వద్ద హడావుడి చేస్తూ శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో సినిమా షూటింగులను అడ్డుకుంటే సహించేది లేదని అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..) సోషల్ మీడియాకు దూరం కాంగ్రెస్ పార్టీతో కలహం నేపథ్యంలో గత రెండు వారాల నుంచి జోజు జార్జ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సన్నిహితులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. త్రిసూర్ జిల్లాలోని మాలా గ్రామంలో ఉన్న తన ఇంటి ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంతో కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. (చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!) జీరో టు హీరో! త్రిస్సూర్ జిల్లాలోని కూజూర్ గ్రామంలో జన్మించిన జోజు జార్జ్.. సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నటుడిగా ఎదిగారు. 1995లో ‘మజవిల్కూడారం’ సినిమాలో చిన్న వేషంతో కెరీర్ మొదలు పెట్టిన ఆయనకు 2000లో ‘దాదా సాహెబ్’ సినిమాలో తొలిసారిగా డైలాగ్ చెప్పే అవకాశం లభించింది. అప్పటి నుంచి హాస్య పాత్రలు చేస్తూ వచ్చిన జార్జ్‌కు 2018లో వచ్చిన ‘జోసఫ్’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో జోజు జార్జ్‌కు హీరో ఇమేజ్ ఇచ్చింది. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది) టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఎంతో కష్టపడి కిందిస్థాయి నుంచి సినిమా పరిశ్రమలో ఎదిగిన జోజు జార్జ్‌ను రాజకీయ నేతలు టార్గెట్ చేయడం సరికాదని అతడి సన్నిహితులు అంటున్నారు. కెరీర్లో ఎన్ని విజయాలు అందుకున్నా ఇప్పటికీ మూలాలు మరిచిపోలేదని, సాధారణ గ్రామస్తుడిలానే జీవిస్తారని వెల్లడించారు. బెదిరింపులతో జార్జ్‌ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం ఏమీ బాలేదని చెబుతున్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత సతీషన్‌కు లేఖ కూడా రాశారు. (Jai Bhim: హీరో సూర్యకు బెదిరింపులు.. దాడి చేస్తే రూ. లక్ష బహుమతి!) క్షమాపణ చెప్పాల్సిందే అయితే జోజు జార్జ్ బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు వెనక్కు తగ్గేది లేదని ఎర్నాకులం జిల్లా కమిటీ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు భీష్మించుకుని కూర్చున్నారు. అటు జార్జ్.. కూడా క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అనడంతో వివాదం సద్దుమణగలేదు. కాగా, చమురు ధరల పెరుగుదలకు నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల లక్ష్యం నెరవేరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కేంద్రం, కేరళ ప్రభుత్వాలను ఆత్మరక్షణలో పడేసే గొప్ప అవకాశాన్ని పార్టీ చేజార్చకుందన్నారు. జోజుపై దాడి, అతనిపై దురుద్దేశపూరిత ప్రచారం నిరసనల గమనాన్ని మార్చిందని విశ్లేషించారు. (చదవండి: ప్రకాశ్‌రాజ్ మౌనవ్రతం..దానికోసమే అంటూ ట్వీట్) -
దర్శకుడు సచీ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) కన్నుమూశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో సచీకి గుండెపోటు వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన్ను జాయిన్ చేశారు బంధువులు. కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై సచీకి చికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో వచ్చిన మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. సచీ ఒక్కరే ‘రన్ బేబీ రన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ (దర్శకత్వం కూడా), ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (దర్శకత్వం కూడా) చిత్రాలకు కథ అందించారు. ‘అనార్కలి’ (2015) చిత్రంతో సచీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దర్శకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ మీనన్ నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత – నటుడు జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు. సచీ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ, ఇతర సినీరంగ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. -
భవిష్యత్తు బాగుండాలనే...
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీ సమానత్వం కోసం, సురక్షితంగా పనిచేసే వాతావరణం ఏర్పాటు కోసం ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్ (డబ్లు్యసీసీ)’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో రేవతి, పార్వతి, రమ్య నింబసేన్, పద్మ ప్రియా ముఖ్య సభ్యులు. తాజాగా ఈ కమిటీ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)’ అధ్యక్షుడు మోహన్‌లాల్ వైఖరిని ఖండిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. లైంగిక వేధింపుల కేస్ ఉన్న దిలీప్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నటి భావనపై లైంగిక దాడి కేసులో దిలీప్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి ‘అమ్మ’ సభ్యత్వం తొలగించారు. మళ్లీ బెయిల్ మీద బయటకు రాగానే ఆ సభ్యత్వం పునరుద్ధరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బాధితులను సపోర్ట్ చేయకుండా అసోసియేషన్ నిందితులవైపు ఉండటమేంటి? అని ప్రశ్నించారు రేవతి. స్త్రీలను ఇండస్త్రీలో సమానంగా ట్రీట్ చేయాలని ఈ మీటింగ్‌లో కోరారు. ‘‘ఈ పోరాటమంతా భవిష్యత్తులో మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సురక్షితంగా పని చేసుకోవడం కోసం’’ అని పేర్కొన్నారామె. -
ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు!
వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఓ సినీ ప్రముఖుడి హస్తం ఉందని అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ ఘటన వెనుక ప్రముఖ మలయాళ నిర్మాత అంటో జోసెఫ్ ప్రమేయమున్నట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. నటి కిడ్నాప్, అత్యాచారం జరిగిన రోజు రాత్రి.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన రౌడీ షీటర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునితో జోసెఫ్ ఫోన్లో తరచూ మాట్లాడినట్టు పలు మీడియా చానెళ్లు తెలిపాయి. నిర్మాత జోసెఫ్ సహాయంతోనే పల్సర్ సుని తప్పించుకున్నట్టు వెల్లడించాయి. 'నిర్మాత అంటో జోసెఫ్‌ను ఇంకా పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదు.. చివరిసారిగా అతనితో మాట్లాడిన తర్వాతే పల్సర్ సుని తన ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసినట్టు కాల్ రికార్డ్స్‌తోపాటు, పోలీసులు ధ్రువీకరిస్తున్నారు' అని సీనియర్ జర్నలిస్టు ఉల్లేక్ ఎన్పీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. ఈ కేసులో సినీ ప్రముఖుల హస్తముందని అనుమానాలు వెలువడటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని కేరళ క్రైంబ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ చెప్పారు. సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. నేరసామ్రాజ్యంతో సినీ చీకటి సంబంధాలు! ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచారం ఘటన నేపథ్యంలో కేరళ చిత్రపరిశ్రమకు, నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్సర్ సుని ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు, ఇతర సహా నిందితులు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగానే..మరోవైపు మాలీవుడ్‌తో నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు చర్చనీయాంశమయ్యాయి. నటులు, సినీ ప్రముఖులు తమ సొంత భద్రత కోసం నేరచరిత్ర కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్న సంగతి పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమేనని, భారీమొత్తంలో డబ్బుతో ప్రయాణించాల్సి ఉండటంతో క్రిమినల్స్‌ని నటులు తమ బాడీగార్గులుగా నియమించుకుంటారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చాలామంది ప్రముఖ నటులకు, సినీ పెద్దలకు క్రిమినల్స్ డ్రైవర్లుగా, బాడీగార్డులుగా ఉన్నారని ప్రముఖ న్యాయవాది హరీశ్ వాసుదేవన్ 'ఆసియా నెట్' చానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. రౌడీషీటర్లు, నేరగాళ్లతో ప్రముఖ నటులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారిని తమ డైవర్లు, బాడీగార్డులుగా నియమించుకోవడమే కాదు.... ఏకంగా బహిరంగ కార్యక్రమాలు, అవార్డు వేడుకలకు వారితోపాటు హాజరవుతుంటారని చెప్పారు. భూముల కొనుగోళ్లు, మనీ లెండింగ్ వంటి వ్యవహారాల్లో నటులు నేరగాళ్ల సహాయం తీసుకుంటున్నారని తెలిపారు. -
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
-
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
అంతులేని ప్రేమకథకు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. లివింగ్ ‘లైలా- మజ్నూ’లుగా ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన హీరోహీరోయిన్లు కావ్యా మాధవన్- దిలిప్‌లు ఒక్కఇంటివాళ్లయ్యారు. మలయాళంలో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న కావ్యా.. అదే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతోన్న దిలిప్‌లు శుక్రవారం వివాహబంధంలోకి ప్రవేశించారు. అతికొద్దిమంది ఆంతరంగికుల సమక్షంలో శుక్రవారం కొచిలోని ఓ హోటల్లో ఈ ఇద్దరూ మనువాడారు. కాగా, కావ్యా, దిలిప్‌లు ఇద్దరిరీ ఇది రెండో పెళ్లేకావడం గమనార్హం. మలయాళ నటి మంజూ వారియర్‌ను 1998లో పెళ్లాడిన దిలిప్.. కొన్నేళ్ల కిందటే ఆమెకు విడాకులిచ్చాడు. ఇటు కావ్య.. కెరీర్ జోరుమీదున్న సమయంలోనే(2009లో) కువైట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి.. సంవత్సరం తిరిగేలోపే విడాకులిచ్చింది. గడిచిన కొద్దికాలంగా కావ్యా, దిలిప్‌ల ప్రణయగాథపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఏ దశలోనూ ఖండించని ఆ ఇద్దరూ.. అందరికి సర్ప్రైజ్ ఇస్తూ పెళ్లిపీటలెక్కారు. కావ్యతో పెళ్లికి దిలీప్ కుమార్తె మీనాక్షి కూడా అభ్యంతరపెట్టలేదని, ఆ ఇద్దరూ(కావ్యా, దిలీప్‌లు) కలిసి ఉండటం కంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని నటి మనేకా(నిర్మాత సురేశ్ భార్య) మీడియాతో అన్నారు. కావ్యా దిలిప్‌లు కలిసి ఇప్పటిదాకా 21 సినిమాల్లో జతకట్టారు. వాటిలో మీసమాధవన్, కాసిపట్టణం, పిన్నెయుమ్ తదితర సినిమాలు సూపర్హిట్లుగా నిలిచాయి. -
మలయాళ పరిశ్రమ నన్ను మోసగించింది
మలయాళ చిత్రపరిశ్రమ నన్ను మోసం చేసింది అని ఆరోపణలు గుప్పిస్తున్నారు నటి పూర్ణ. విషయం ఏమిటంటే ఈ బ్యూటీ కేరళ కుట్టి అన్నది తెలిసిందే. అలాంటిది మాతృభాషలో కంటే తమిళం, తెలుగు భాషల్లోనే మంచి అవకాశాలు వస్తున్నాయని పూర్ణ పేర్కొనడం గమనార్హం. ఈ భామ బహుభాషా నటి అన్నది తెలిసిందే. మలయాళంతో పాటు,తమిళం,తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి పేరే తెచ్చుకున్నారు.అయితే ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ల్లోనే మంచి ఆదరణ లభిస్తోంది. మూడు పదుల వయసుకు చేరువవుతున్న పూర్ణకు ఇంట్లో వరుడి అన్వేషణ ఎక్కువైందట. పూర్ణ తన మనోభావాలను వెల్లడిస్తూ మలయాళంలో తనకు మంచి అవకాశాలు అక్కడ లభించడం లేదన్నారు. కథలు వినిపించేటప్పుడు మంచి పాత్ర అని చెబుతున్నారని, షూటింగ్‌కు బయలు దేరిన తరువాత చిన్న వేషం ఇస్తున్నారని వాపోయారు. ఇలా పలు మలయాళ చిత్రాల్లో మంచి పాత్ర అని చెప్పి తనను మోసం చేశారని ఇది చాలా బాధాకరం అని అన్నారు. ఇకపోతే ఒక తెలుగు చిత్రంలో దెయ్యంగా నటించానన్నారు. ఆ చిత్రం చూసి ఒకరు గుండె ఆగి మరణించినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారని తెలిపారు. నిజానికి ఆ ప్రచారంలో నిజం లేదని అన్నారు. అదేవిధంగా ఒక చిత్రంలో గర్భిణిగా నటిస్తే పూర్ణ నిజంగానే గర్భం దాల్చిందనే వదంతులు హల్చల్ చేశాయన్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రసారం చేయడం బతికున్న వాళ్లను చంపినట్లేనన్నారు. అలాంటి ఫేస్‌బుక్‌లను నిషేధించాలని ఎవరైనా గొంతు ఎత్తితే నాను వారికి మద్దతిస్తానని తెలిపారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్న ్రపశ్నలు చుట్టుముట్టేస్తున్నాయని ఇంటో వాళ్లు వరుడి వేటలో ముమ్మరంగా ఉన్నారనీ, ఈ ఎడాది పెళ్లి చేయాలనే నిశ్చయానికి వచ్చారని చెప్పారు.ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సవరకత్తి, అర్జునన్ కాదలి, పడం పేసుమ్, మణల్ కయిరు-2 చిత్రాలతో పాటు తెలుగు ఒకసారి అవును ఒకసారి కాదు, సర్వమంగళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
ఇప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదు
చెన్నై : మలయాళ నటీమణులకు సొంత గడ్డపై అవకాశాలు ఇవ్వడం లేదని నటి మాయ కొత్త వివాదానికి తెర లేపారు. తమిళంలో ఎల్లా అవళ్ సెయల్, రామానుజన్ తదితర చిత్రాల్లో నటించిన నటి మాయకి ప్రస్తుతం అంతగా అవకాశాలు లేవు. ఈ విషయమై స్పందించిన ఆమె తానే చిత్రాలను తగ్గించుకున్నానని చెప్పారు. షూటింగ్‌లతోనే అధిక భాగం గడిచిపోతోందని, దీంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను చాలా మిస్ అవ్వాల్సి వస్తోందని అన్నారు. అందువల్ల స్లో అండ్ స్టడీ పాలసీని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే మలయాళ హీరోయిన్లకు తమిళం, తెలుగు భాషల్లో ఎక్కువ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, అయితే అక్కడ వారికి సొంత గడ్డపైన అవకాశాలు రాకపోవడంతోనే ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మరో విషయం తన వివాహం గురించి వదంతులు ప్రచారమవుతున్నాయని, ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.